Modi: ఈనెల 16న కర్నూలు జిల్లాలో ప్రధాని మోదీ పర్యటన ఖరారు.. ఉదయం 7.50కి ఢిల్లీ నుండి!

అమరావతి:  విద్య ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ గత కొన్ని నెలలుగా రాష్ట్రంలో ఐటీ రంగ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టారు. విశాఖలో ఐటీ ఉద్యోగాలను లక్షల సంఖ్యలో సృష్టించాలన్న ఆయన దృష్టిలో ఈ డేటా సెంటర్ ప్రాజెక్ట్ కీలక మైలురాయిగా నిలుస్తోంది. విశాఖను టెక్నాలజీ హబ్‌గా తీర్చిదిద్దడమే కాకుండా, యువతకు ఉద్యోగావకాశాలు కల్పించడం మా ప్రధాన లక్ష్యం అని మంత్రి లోకేష్ ముందుగా పేర్కొన్నారు.

Rishab Shetty: రికార్డుల వేటలో రిషబ్ శెట్టి! బాక్సాఫీస్‌ వద్ద దుమ్ము రేపుతున్న కాంతారా ఛాప్టర్1 !

మంత్రి నారా లోకేష్ దృష్టిలో విశాఖ కేవలం తీరనగరం కాదు దేశ భవిష్యత్ డిజిటల్ రాజధాని. రేపు (అక్టోబర్ 12, ఆదివారం) ఆయన ఆధ్వర్యంలో సిఫీ టెక్నాలజీస్ అనుబంధ సంస్థ (Sify Infinit Spaces Limited)నిర్మించబోయే ఏఐ ఆధారిత ఎడ్జ్ డేటా సెంటర్  మరియు ఓపెన్ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ (CLS) కు శంకుస్థాపన జరగనుంది. రూ.1,500 కోట్ల భారీ పెట్టుబడితో సాకారం కానున్న ఈ ప్రాజెక్టులు రాష్ట్ర సాంకేతిక రంగానికి కొత్త దిశను చూపనున్నాయి.

చైనా దూకుడు వైఖరిపై ట్రంప్ ఆగ్రహం.. సాఫ్ట్‌వేర్‌ల ఎగుమతిపై అమెరికా ఆంక్షలు!!

రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన 3.6 ఎకరాల భూమిలో రెండు దశల్లో 50 మెగావాట్ల సామర్థ్యంతో సిఫీ అభివృద్ధి చేయనున్న ఈ ఏఐ ఎడ్జ్ డేటా సెంటర్ ఉత్తరాంధ్రలో ఉపాధి అవకాశాలకు మార్గం సుగమం చేయనుంది. ఈ ప్రాజెక్టు ద్వారా వెయ్యిమందికి పైగా ప్రత్యక్ష  పరోక్ష ఉద్యోగాలు లభించనున్నాయి. అంతేకాక ఈ సెంటర్ ద్వారా దేశవ్యాప్తంగా డేటా నిల్వ, ప్రాసెసింగ్‌లో విశాఖ ప్రధాన కేంద్రంగా అవతరించనుంది.

ఫౌజీ క్రేజీ అప్‌డేట్.. డార్లింగ్ ఇలా కూడా ట్రై చేస్తున్నాడా?

సముద్రపు కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ (CLS) ఏర్పాటుతో విశాఖ అంతర్జాతీయ డిజిటల్ కనెక్టివిటీకి కీలక హబ్‌గా మారబోతోంది. ఈ సదుపాయం ద్వారా భారతదేశం సింగపూర్, మలేషియా, ఆస్ట్రేలియా, థాయ్‌లాండ్ వంటి దేశాల మధ్య డేటా ప్రసారం వేగవంతమవుతుంది. ఫలితంగా గ్లోబల్ స్థాయిలో విశాఖ డిజిటల్ గేట్‌వే టు సౌత్ ఈస్ట్ ఏషియా గా నిలుస్తుంది. ఈ మౌలిక సదుపాయాల ద్వారా ఏఐ ఆధారిత టెక్నాలజీ వినియోగం పెరిగి, పరిశ్రమలు, సంస్థలు అత్యాధునిక సర్వీసులు అందించే అవకాశం పొందుతాయి.

Earn From Home: ఈ కోర్స్ నేర్చుకుంటే చాలు! ఇంట్లో ఉండే నెలకు రూ.30 వేల లక్ష వరకు సంపాదించవచ్చు!

ఈ ప్రాజెక్టుల ద్వారా ఉత్తరాంధ్ర రూపురేఖలు మారబోతున్నాయి. సాంకేతికంగా‌ఆర్థికంగా విశాఖ కొత్త శిఖరాలను అధిరోహించే దిశగా అడుగులు వేస్తోంది. ఏఐ డిజిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, సముద్రపు కనెక్టివిటీ  ఈ మూడు శక్తులు కలిసినప్పుడు విశాఖ కేవలం నగరం కాదు దేశ డిజిటల్ హృదయంగా మారనుంది. రేపటి శంకుస్థాపన కొత్త తరాల ఉజ్వల భవిష్యత్తుకు బలమైన నాంది పలుకుతుంది ఇది కేవలం టిడిపి ప్రభుత్వంతోనే సాధ్యమవుతుంది అనడంలో అతిశయోక్తి లేదు.

Happy Nest: హ్యాపీ నెస్ట్ నిర్మాణం ఊపందుకుంది.. 12 టవర్లలో 1200 ఫ్లాట్లు!
Education: చదువు మధ్యలో మానేసిన వారికి మరో అవకాశం..! ప్రభుత్వ ఆధ్వర్యంలో కొత్త పథకం..!
APPSC Alert: పలు శాఖల ఉద్యోగాల రాత పరీక్ష ఫలితాలు విడుదల..! ఎంపిక జాబితా వెబ్‌సైట్‌లో..!
Passenger Halt: అరకు పర్యాటకులకు సూపర్ న్యూస్! ఇక అక్కడ కూడా రైళ్లు ఆగుతాయి... ఎంపీ సూచనపై రైల్వే మంత్రి గ్రీన్ సిగ్నల్!
Shopping mall: విశాఖలో మెగా షాపింగ్ మాల్.. అమరావతిలో స్టార్ హోటల్స్..! కేబినెట్ కీలక నిర్ణయాలు..!