LIVE
Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!  •  Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!  •  Modi: ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు ప్రధాని మోదీ.. యూరప్ దేశాలతో బంధాల బలోపేతమే లక్ష్యం!  •  Health Tips: పక్షవాతానికి ముందు వచ్చే డేంజర్ బెల్స్.. మైక్రో స్ట్రోక్ పై వైద్యుల వివరణ!  •  Promotions: దేవాదాయ శాఖలో భారీ ప్రమోషన్లు.. గ్రేడ్-1 ఆఫీసర్లుగా 26 మంది ఈఓలకు పదోన్నతులు!  •  TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ నెల తిరుమల దర్శన టికెట్ల కోటా షెడ్యూల్ విడుదల!  •  EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్... 8.25 శాతం వడ్డీ డబ్బులు అకౌంట్లలోకి వచ్చేది అప్పుడే!  •  Allu Arjun: రెండు దశాబ్దాల తర్వాత అదే క్రేజ్... 'హ్యాపీ' రీ-రిలీజ్ కలెక్షన్ల సంచలనం!  •  Srisailam: శ్రీశైల క్షేత్రంలో రికార్డు స్థాయి ఆర్థిక ప్రగతి.. బ్యాంకుల్లో వందల కోట్ల భారీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు!  •  Google Maps: గూగుల్ మ్యాప్స్ క్రేజీ అప్‌డేట్.. ఇకపై పెట్రోల్, డీజిల్ ఖర్చులు మిగిలడం ఖాయం!  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
Politics

Komati Jayaram: విజయవాడలో వేడుకగా జయరాం అభినందన సభ.. మంత్రులు, ఎమ్మెల్యేల సందడి! టీడీపీ జెండాను విదేశాల్లో..

Komati Jayaram: ఏపీ ప్రభుత్వ ఉత్తర అమెరికా ప్రత్యేక ప్రతినిధిగా నియమితులైన కోమటి జయరాం అభినందన సభ విజయవాడ మురళీ రిసార్ట్స్‌లో ఘనంగా జరిగింది. సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి. రమణతో పాటు పలువురు కూటమి మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు.

AndhraPravasi News Desk 4 min read
Komati Jayaram: విజయవాడలో వేడుకగా జయరాం అభినందన సభ.. మంత్రులు, ఎమ్మెల్యేల సందడి! టీడీపీ జెండాను విదేశాల్లో..
  • ప్రవాసాంధ్రుల ఆత్మీయ నేతకు ఘన సత్కారం: వైభవంగా ముగిసిన జయరాం కోమటి సన్మాన వేడుక..
  • ఎన్నారైల 'వారధి'కి నీరాజనం: జయరాం సేవలను కొనియాడిన జస్టిస్ ఎన్వీ రమణ, స్పీకర్ అయ్యన్నపాత్రుడు..

Komati Jayaram: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉత్తర అమెరికా ప్రత్యేక ప్రతినిధిగా బాధ్యతలు చేపట్టిన కోమటి జయరాం గౌరవార్థం విజయవాడ సమీపంలోని పోరంకి మురళి రీస్టార్ట్‌లో శనివారం ‘ఆత్మీయ అభినందన సభ’ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమాన్ని బీజేపీ నాయకులు, గుంటూరు జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ పాతూరి నాగభూషణం, టీడీపీ సీనియర్ నేత నాగుల్ మీరా సమన్వయపరిచి, సభ నిర్వహించారు. ప్రవాసాంధ్రుల వారధిగా పేరుగాంచిన జయరాంకు శుభాకాంక్షలు తెలిపేందుకు సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణతో పాటు కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు దాదాపు 50 మందికి పైగా ప్రముఖులు హాజరయ్యారు.

సాంస్కృతిక కార్యక్రమాలతో సభ ప్రారంభమైంది. అనేక మంది చిన్నారులు కూచిపూడి నృత్యాలతో అలరించారు. వేదపండితుల ఆశీర్వచనంతో జయరాం కోమటిని వేదికపైకి తీసుకొచ్చారు. ఆశీనులైన అతిథులందరూ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆ తరువాత జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు.

హాజరైన అతిరథమహారధులు..
సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు, రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, రాష్ట్ర గనులు, ఎక్సైజ్ శాఖల మంత్రి కొల్లు రవీంద్ర, బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత, ఎంపీలు కేశినేని చిన్ని, సీఎం రమేష్, రాజ్యసభ మాజీ సభ్యుడు గరికపాటి మోహన్రావు, సీపీఐ సీనియర్ నేత నారాయణ, ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు, సినీ నటుడు రాజేంద్రప్రసాద్, ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, గద్దె రామ్మోహన్, ధూళిపాళ నరేంద్రకుమార్, కామినేని శ్రీనివాస్, సుజనా చౌదరి, గంటా శ్రీనివాస్, బోడె ప్రసాద్, ఆరుమిల్లి రాధాకృష్ణ, కాకర్ల సురేష్, జూలకంటి బ్రహ్మారెడ్డి, వసంత కృష్ణప్రసాద్, మాజీ మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, ఆలపాటి రాజేంద్రప్రసాద్, బండారు సత్యనారాయణమూర్తి, నక్కా ఆనంద్ బాబు, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య, జాతీయ అధికార ప్రతినిధి గురజాల మాల్యాద్రి, టీడీపీ పొలిట్బ్యూరో సభ్యుడు టీడీ జనార్దన్, టీడీపీ సీనియర్ నేత దివి శివరాం, స్వర్ణాంధ్ర పి4 ఫౌండేషన్ వైస్ చైర్మన్ కుటుంబరావు, మాజీ పోలీసు అధికారి ఏబీ వెంకటేశ్వరరావు, మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్లు నన్నపనేని రాజకుమారి, వాసిరెడ్డి పద్మ, రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ చైర్మన్ బ్రహ్మం చౌదరి, బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ బుచ్చిరాంప్రసాద్, దూదేకుల కార్పొరేషన్ చైర్మన్ నాగుల్మీరా, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు, మాదిగ కార్పొరేషన్ చైర్మన్ ఉండవల్లి శ్రీదేవి, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకటరావు, గంటా శ్రీనివాసరావు, నిర్మాత బండ్ల గణేశ్, రాష్ట్ర 20సూత్రాల కమిటీ చైర్మన్ లంకా దినకర్, ఏపీ నాటక అకాడమీ చైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణ, కల్చరల్ అకాడమీ చైర్మన్ పొడపాటి తేజస్విని, సామాజిక సంక్షేమ బోర్డు చైర్మన్ పోతుల బాలకోటయ్య, జిల్లా పరిషత్ చైర్పర్సన్ గద్దె అనూరాధ, బీజేపీ నాయకుడు పాతూరి నాగభూషణం, గుంటూరు పార్లమెంటు టీడీపీ అధ్యక్షుడు పిల్లి మాణిక్యరావు, నాట్స్ చైర్మన్ గుత్తికొండ శ్రీనివాస్, ఎన్ఆర టీడీపీ కో-ఆర్డినేటర్ చప్పిడి రాజశేఖర్, లాస్ ఏంజిల్స్ ఎన్ఆర టీడీపీ ప్రెసిడెంట్ ఆళ్ల వెంకట్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సుప్రీం కోర్టు మాజీ సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ మాట్లాడుతూ..

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జయరాం వంటి కష్టపడే కార్యకర్తలను గుర్తించి పదవులు ఇవ్వడం అభినందనీయమని పేర్కొన్నారు. కష్టకాలంలో సాయం చేసే వారిని ఎప్పుడూ మర్చిపోకూడదని, అమరావతి రైతుల ఉద్యమానికి జయరాం అందించిన ఆర్థిక, న్యాయ సహాయం మరువలేనిదని కొనియాడారు. ముఖ్యంగా చంద్రబాబు అక్రమ అరెస్టు సమయంలో ఆయనను బయటకు తీసుకురావడానికి జయరాం ఎంతో కృషి చేశారని గుర్తు చేస్తూ, అన్యాయానికి గురైన టీడీపీ నేతలు, కార్యకర్తలందరికీ న్యాయం జరగాలని కోరారు.

కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ..
అమెరికాలోని అనేక పట్టణాల్లో ఎన్నారైలను సమన్వయం చేయడం, వారిని ఎన్నికల సమయంలో రాష్ట్రానికి సహాయం చేయడానికి జయరాం కోమటి కృషి చేశారన్నారు. పాతికేళ్లుగా జయరాం తెలుగు వారి ఐక్యత కోసం తానా సంస్థను ముందుకు నడిపించారని, కల్లాకపటం లేని వ్యక్తిగా కష్టకాలంలో పార్టీ వెంటే ఉన్నారని ప్రశంసించారు.

ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ…
అమెరికాలోని తెలుగు విద్యార్థుల సమస్యల పరిష్కారంలో జయరాం కోమటి ముందుంటారని, తనను ఆరు రాష్ట్రాల్లో పర్యటింపజేసి అక్కడి తెలుగు వారితో మమేకం చేశారని గుర్తు చేసుకున్నారు.

ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణం రాజు మాట్లాడుతూ..
గత అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి విజయం కోసం ఎన్నారైలను సంఘటితం చేయడంలో జయరాం పాత్ర కీలకమని తెలిపారు. ఎన్నారైల సంక్షేమం కోసం నిరంతరం పోరాడుతున్నారన్నారు.
సీపీఐ నేత నారాయణ మాట్లాడుతూ…
అమెరికాలోని తెలుగు వారి సంక్షేమం కోసం కోమటి జయరాం చేస్తున్న సేవలను నారాయణ కొనియాడారు.

మాజీ మంత్రి నన్నపనేని రాజకుమారి మాట్లాడుతూ…
టీడీపీ పట్ల జయరాంకున్న నిబద్ధతను ప్రశంసించారు. సరైనవ్యక్తికి సరైన హోదా దక్కిందని అన్నారు. ఎన్నారైల సంక్షేమం కోసం జయరాం అహర్నిశలు కష్టపడుతున్నట్లు చెప్పారు. కృష్ణా జిల్లాలోని అనేక రాజకీయ నాయకులు, జయరాం కోమటి స్నేహితులు బొకేలతో, దండలతో, శాలువాలతో జయరాం కోమటిని సత్కరించడానికి పోటీ పడ్డారు. వర్జీనియాలో నివసించే రామా చౌదరి ఉప్పుటూరి తరుపున వారి తండ్రి ఉప్పుటూరి రాములు గులాబీల గజమాలతో జయరాంను సత్కరించారు. వచ్చిన అతిథులకు ఎప్పటికప్పుడు వెల్కమ్ డ్రింక్స్, స్నాక్స్‌, భోజనంతో పెళ్లి వాతావరణంలో మర్యాదలు చేశారు.

హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతూ..
జయరాం కోమటితో తన కుటుంబానికి సత్సంబంధాలున్నాయని పేర్కొన్నారు. ఎన్నారైలకు చేస్తున్న కృషికిగానూ ఆయనకు ఈ పదవి వరించడం ఆనందంగా ఉందని తెలిపారు. సీఎం చంద్రబాబు నాయుడికి శుభాకాంక్షలు చెప్పారు.

మంత్రి పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ…
ఎన్నారైల కోసం కోమటి జయరాం నిరంతరం కష్టపడుతున్నారని పయ్యావుల కేశవ్ తెలిపారు. సమూచిత స్థానం కల్పించినందుకు సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు చెప్పారు.

మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ…
అమెరికాలో ఎన్నారైలకు ఏ సమస్య వచ్చినా.. క్షణాల్లో స్పందించే వ్యక్తి కోమటి జయరామని కొల్లు రవీంద్ర కొనియాడారు. ఆయనకు ఈ పదవి వరించడంపై సంతోషం వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో ఎన్నారైల కోసం మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టాలని కోరారు.

ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ…
జయరాం అందరివాడు. అమెరికాలో ఆపద్భాందువులా నిలిచారు. లక్షల సంఖ్యలో ఉన్న తెలుగు వారికి అండగా నిలుస్తున్నారు.

ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మాట్లాడుతూ..
జయరాం కోమటి మేం కుటుంబ సభ్యుల్లా ఉంటాం. ఆయన తండ్రితో నాకు సత్సంబంధాలున్నాయి. వెలమలను తమ సొంత కుటుంబంగా జయరాం ఆదుకుంటారు. ఎన్నారైలకు ఏ సమస్య వచ్చినా తక్షణం స్పందిస్తారు. అమెరికా చరిత్రలో ఐదుగురు గవర్నర్లు, 5 వేల ప్రజల సమక్షంలో కోమటి జయరాంకు సన్మానం జరగడం అమెరికాలో ఆయన చేసిన సేవలను గుర్తు చేస్తోంది.

విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని మాట్లాడుతూ…
అమెరికాలో ఎన్నారైలకు ఏ సమస్య వచ్చిన తొలుత సంప్రదించేది జయరాంనేనని కేశినేని చిన్ని అన్నారు. సరైన వ్యక్తికి సరైన హోదా దక్కిందని సంతోషం వ్యక్తం చేశారు.

ఎమ్మెల్యే బోండా ఉమ మాట్లాడుతూ…
జయరాం కోమటి.. ఎన్నారైల సంక్షేమం కోసం అహర్నిశలు పాటుపడుతున్నారని అన్నారు. అమెరికాలో ఉన్న తెలుగు వారందరికీ అండగా నిలిచేందుకు ఇప్పటికే ఎన్నో కార్యక్రమాలు నిర్వహించారని వివరించారు.

ఎంపీ సీఎం రమేశ్ మాట్లాడుతూ…
జయరాంతో తనకున్న 30 ఏళ్ల అనుబంధాన్ని గుర్తు చేస్తూ అమెరికాలో టీడీపీ జెండా స్థాపించడంలో ఆయన కృషిని సీఎం రమేశ్ అభినందించారు.

ఎమ్మెల్యే సుజనా చౌదరి మాట్లాడుతూ…
జయరాం కోమటి అందరి మనిషని అభివర్ణించారు. ఎన్నారైల సంక్షేమం కోసం ఆయన చేస్తున్న కృషి మరువలేనిదని పేర్కొన్నారు.

కోమటి జయరామ్ మాట్లాడుతూ..
తనపై ప్రభుత్వం ఉంచిన గురుతర బాధ్యతను వందశాతం నిలబెట్టుకునేందుకు కృషి చేస్తానన్నారు. ప్రవాసాంధ్రుల ద్వారా రాష్ట్రానికి పెట్టుబడులు తేవడంతోపాటు, సేవకూ ముందుండేలా కృషిచేస్తానని తెలిపారు. అమరావతి రాజధానికితమ సేవలు పూర్తిస్థాయిలో అందిస్తామన్నారు. ప్రవాసాంధ్రులంతా కలిసి ఇంత ఘనంగా సన్మానం చేయటం ఆనందంగా ఉందన్నారు. దాదాపు 50 మందికి పైగా ఎన్నారైలు నగరంలో పలు చోట్ల హోల్డింగ్స్, బిల్ బోర్డ్‌లు, ఫ్లెక్సీల ద్వారా, దినపత్రికలలో ప్రకటనల ద్వారా జయరాం కోమటికి అభినందనలు చెప్పటమే కాక, దాదాపు 30 మందికి పైగా ఎన్నారైలు విజయవాడ వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తనకు జరిగిన సన్మానానికి, తన గురించి ప్రశంసించిన అతిథులకు జయరాం కోమటి ధన్య వాదాలు తెలిపారు.

Be the first to react

More Coverage

Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!

Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!

Liquor Scam: మద్యపాన నిషేధం చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన గత ప్రభుత్వం, ఆ తర్వాత మద్యాన్ని…

Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!

Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!

Kollu Ravindra: ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ఉపయోగించుకుని రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీశారని మాజీ ముఖ్యమ…

Amaravathi: అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష.. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం!

Amaravathi: అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష.. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం!

Amaravathi: రాజధాని అమరావతిలో జరుగుతున్న అభివృద్ధి పనులను రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి…