Google: 11వేల యూట్యూబ్ ఛాన‌ళ్లపై గూగుల్ వేటు..! ర‌ష్యా, చైనావే అధికం!

తెలుగు రాష్ట్రాల్లో తొలిసారి సికింద్రాబాద్ – విశాఖ మధ్య ప్రారంభమైన వందేభారత్‌ రైలుకు ప్రజాధరణ పెరగడంతో ఇటీవలే ఈ రైలు లో కోచ్‌లను పెంచుతూ రైల్వేశాఖ అభివృద్ధి చేసింది. ఈ వందేభారత్‌ రైలు ప్రారంభం సమయంలో 16 కోచ్‌లతో ప్రయాణికులకు అందుబాటులో ఉండగా.. తాజాగా పెరిగిన డిమాండ్‌ తో వీటి కోచ్‌లను రైల్వేశాఖ 20కి పెంచింది. కోచ్‌లు పెంచడం ద్వారా వెయిటింగ్ లిస్టులో ఉండే ఈ రైలు ప్రయాణికులకు వెసులుబాటు కలుగుతుంది.

Metro: నమ్మ మెట్రో ఫేజ్ 3 నిర్మాణం! వాటిపై BMRCL క్లియరెన్స్!

అయితే ఈ వందేభారత్‌ రైళ్లలో ప్రయాణించేందుకు ప్రయాణికులు ఆసక్తి చూపుతుండడంతో వారికి మరింత సౌకర్యాన్ని అందించేందుకు.. ప్రయాణికుల సంఖ్యను మరింత పెంచేందుకు సికింద్రాబాద్‌- విశాఖపట్నం మధ్య నడుస్తున్న వందేభారత్‌ రైళ్లకు అదనపు స్టాపేజీలను చేర్చుతూ ఇటీవలే సదుపాయాన్ని కల్పించిన రైల్వేశాఖ తాజాగా వీటిపై మరో నిర్ణయం తీసుకుంది.

Jagdeep Dhankhar: ధన్‌ఖడ్‌ రాజీనామా..! ప్రధాని మోదీ ఏమ‌న్నారంటే..!

ఈ మేరకు వందేభారత్‌ అదనపు స్టాపేజీల సదుపాయాన్ని మరో ఆరునెలల వరకు పొడిగిస్తున్నట్లు రైల్వేశాఖ ప్రకటించింది. సికింద్రాబాద్‌ నుంచి విశాఖపట్నం మధ్య నడిచే 20707/20708 వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లకు ఏలూరు వద్ద కల్పించిన అదనపు స్టాపేజీ సదుపాయం గడువు వచ్చే నెలతో ముగియనుంది. ఈ నేపథ్యంలో ప్రయాణికుల సౌకర్యార్థం ఈ గడువును మరో ఆరు నెలల పాటు పొడగిస్తున్నట్టు పేర్కొంది. దీనితో పాటు 20833/20834 నెంబర్‌ గల వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లకు సామర్లకోట వద్ద కల్పించిన అదనపు స్టాపేజీల సదుపాయాన్ని కూడా ఆరునెలల పాటు పెంచుతున్నట్టు తెలిపింది.

ChatGPT: షాకింగ్ రిపోర్ట్స్! చాట్‌జీపీటీలో రోజుకు 2.5 బిలియన్ల ప్రాంప్ట్‌లు!

ఇదిలా ఉండగా వందేభారత్‌ లో స్లీపర్‌ సర్వీసులకు కూడా ప్రారంభించేందుకు భారతీయ రైల్వే కసరత్తు చేస్తోంది. వీటి తయారీ పూర్తయితే తొలి విడతలో తెలుగు రాష్ట్రాలకు మూడు-నాలుగు మార్గాల్లో వందేభారత్‌ స్లీపర్‌ కేటాయించాలని రైల్వేశాఖ గతంలోనే నిర్ణయం తీసుకుంది.

Express Train: ఏపీలో ఆ ఎక్స్‌ప్రెస్ రైల్లో ప్రయాణించాలంటే రెండు టికెట్లు తీసుకోవాల్సిందే..! ఎందుకంటే!
Toy Trains: భారతంలోని టాప్ 5 ట్రైన్ జర్నీలు! మిమ్మల్ని మరో లోకంలోకి తీసుకెళ్తాయి! ప్రతి ట్రావెలర్ తప్పక చూడాలి!
రైతుల సంక్షేమమే ప్రథమ లక్ష్యం! మామిడి రైతులకు కూటమి ప్రభుత్వం భరోసా!
Big Relief: ఫలించిన చంద్రబాబు కృషి! వారికి బిగ్ రిలీఫ్!
Kadapa Jail: కడప సెంట్రల్ జైలు... ఐదుగురు అధికారులకు సస్పెన్షన్ వేటు!
Liquor Scam: ఏపీ లిక్కర్ స్కామ్‌లో మరో సంచలనం..! ఛార్జ్‌షీట్‌లో ఫేమస్ బ్రాండ్‌ల తయారీ కంపెనీల పేర్లు!