బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ ప్రకటించిన ప్రకారం, నమ్మ మెట్రో ఫేజ్ 3 నిర్మాణంలో తొలగించాల్సిన చెట్లు మొదట అంచనా వేసిన 11,000 కాకుండా, తాజా అంతర్గత సమీక్ష తర్వాత సుమారు 6,800 మాత్రమే అవసరమవుతాయని తేలిందని తెలిపారు. BMRCL యొక్క పర్యావరణ విభాగం అధికారి కనకరాజ్ MH పేర్కొన్న దాని ప్రకారం, ఈ చెట్లన్నీ పూర్తిగా తొలగించరనీ వాటిలో కొన్ని నరికే అవకాశం ఉండగా, కొన్ని స్థలాంతరం చేయబడతాయని, మరికొన్ని అదే చోట ఉంచబడతాయని చెప్పారు. చివరికి ఏ చెట్లు తొలగించాలో ఎన్ని నిలిపివేయాలో నిర్మాణ సమయంలో భౌగోళిక పరిస్థితులను బట్టి నిర్ణయిస్తారు.
ఈ ప్రకటనపై పర్యావరణ కార్యకర్తలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వారు మరింత పారదర్శకత మరియు గణాంకాల రూపంలో వివరాలను కోరుతున్నారు. “ఎన్ని చెట్లు కాపాడబడతాయో, ఎన్ని తగ్గించబడతాయో, ఎన్ని స్థలాంతరం చేయబడతాయో, వాటి జాతులు మరియు వయస్సు ఏమిటి?” అనే అంశాలపై స్పష్టమైన డేటా కావాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అంతేగాక, గత మెట్రో దశల్లో నిర్వహించిన పరిహార నాట్య కార్యక్రమాల స్థితిగతులపై కూడా ప్రశ్నలు వేస్తున్నారు. BMRCL, ప్రతి చెట్టు తొలగింపు కు ప్రతి ఒక్క చెట్టు కు పది మొక్కలు నాటతామని, వాటిని కనీసం మూడు సంవత్సరాలు సంరక్షిస్తామని హామీ ఇచ్చింది.
ప్రస్తుతం పర్యావరణ ప్రభావ అంచనా నివేదిక తుది దశలో ఉంది. ప్రజల అభిప్రాయాలు, ఎన్.జి.ఓ ల సూచనలు తీసుకొని ఈ నివేదిక ఆగస్టు నాటికి సిద్ధమవుతుందని,అక్టోబరులో ప్రచురణకు వచ్చే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఫేజ్ 3లో 44 కిలోమీటర్ల కొత్త మెట్రో మార్గం ఏర్పడనుంది.ఇది ముఖ్యంగా ట్రాఫిక్ ఎక్కువగా ఉండే అ
ఔటర్ రింగ్ రోడ్ పశ్చిమ భాగానికి మెట్రో కనెక్టివిటీని అందించనుంది.