చాట్‌జీపీటీ వచ్చిన తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో గణనీయమైన మార్పులు చోటు చేసుకున్నాయి. ఇప్పటికే అనేక మంది గూగుల్ వాడకాన్ని తగ్గించి, చాట్‌జీపీటీ వైపు మొగ్గు చూపుతున్నారు. దీనిని ఆక్సియోస్ డేటా కూడా స్పష్టం చేస్తోంది. ఓపెన్‌ఏఐ నిర్వహిస్తున్న ఈ చాట్‌బాట్ ద్వారా రోజుకు సుమారు 2.5 బిలియన్ ప్రాంప్ట్‌లు లభిస్తున్నాయి. వాటిలో 33 కోట్ల ప్రాంప్ట్‌లు అమెరికా నుండి వస్తున్నవే కావడం విశేషం. అంటే, సంవత్సరానికి దాదాపు 91,200 కోట్ల అభ్యర్థనలు చాట్‌జీపీటీకి వచ్చేవిగా అంచనా వేయబడుతోంది.

ఇక వినియోగదారుల సంఖ్యలో కూడా భారీ పెరుగుదల కనిపిస్తోంది. గూగుల్ వాడకం ఇంకా పెద్ద సంఖ్యలో ఉన్నప్పటికీ సంవత్సరానికి 500 ట్రిలియన్ సెర్చ్‌లు, చాట్‌జీపీటీ వేగంగా ఎదుగుతూ ఉండటంతో భవిష్యత్తులో గూగుల్‌కు తీవ్ర పోటీదారుగా మారే అవకాశముందని నిపుణులు భావిస్తున్నారు. 2023 డిసెంబర్ నాటికి ఓపెన్‌ఏఐ వారానికి 300 మిలియన్ యాక్టివ్ యూజర్లు కలిగి ఉండగా, కేవలం మూడు నెలల్లో ఈ సంఖ్య 500 మిలియన్‌కు చేరుకుంది. ఇందులో చాలా మంది ఉచిత వర్షన్‌ను ఉపయోగిస్తున్నారని గమనించాల్సిన విషయం.

ఈ గణాంకాలు చాట్‌జీపీటీకి ప్రపంచవ్యాప్తంగా ఎంతటి ఆదరణ ఉందో, అలాగే కృత్రిమ మేధస్సు సాధనాలు భవిష్యత్తులో మన ఇంటర్నెట్ వాడకాన్ని ఎలా మలచబోతున్నాయో స్పష్టంగా చూపుతున్నాయి.