దేశంలోని అతిపెద్ద ఐటీ కంపెనీల్లో ఒకటైన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) తన ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. వచ్చే సెప్టెంబర్ 1 (September) నుండి జీతాల పెంపు అమల్లోకి రానుందని కంపెనీ యాజమాన్యం అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు కంపెనీ ఉద్యోగులకు ఇమెయిల్ ద్వారా సమాచారం అందించింది.
ఈ జీతాల పెంపు ముఖ్యంగా మిడ్ లెవల్ మరియు జూనియర్ లెవల్ ఉద్యోగులకే వర్తిస్తుంది. మొత్తం ఉద్యోగుల్లో సుమారు 80 శాతం మందికి ఈ సాలరీ హైక్ వర్తించనుందని సమాచారం. ఇది వేలాది మంది ఉద్యోగులకు ప్రోత్సాహకరంగా మారబోతుంది.
గమనించదగిన విషయం ఏమిటంటే… కొద్ది రోజుల క్రితమే కంపెనీ సుమారు 12,000 మందిని తొలగించబోతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ప్రకటన అనంతరం తక్కువ స్థాయి ఉద్యోగులకు జీతం పెంపు ప్రకటించడం ఆసక్తికరంగా మారింది.
ఇకపై సెప్టెంబర్ నుండి కొత్తగా పెరిగిన జీతంతో ఉద్యోగులు కొనసాగనున్నట్లు తెలుస్తోంది. ఇది తక్కువ స్థాయి ఉద్యోగుల్లో నమ్మకాన్ని పెంచేందుకు కంపెనీ తీసుకున్న పాజిటివ్ అడుగుగా భావించవచ్చు. ఉద్యోగుల నైతిక బలాన్ని పెంచేందుకు TCS చేసిన ఈ ప్రకటనకు ఉద్యోగుల నుంచి మంచి స్పందన వస్తోంది.