విజయవాడలో ఓ షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. బందరు రోడ్డులోని ఓ ప్రముఖ పబ్‌లో సింగర్‌గా పని చేస్తున్న మహిళ ఆరుగురు వ్యక్తులను మోసం చేసి పెళ్లి చేసుకున్న కేసు ఇటీవల బయటపడింది. ఈ మహిళ 20 ఏళ్ల క్రితం ఓ వ్యక్తితో వివాహం చేసుకున్నప్పటికీ, కుటుంబ విభేదాల కారణంగా భర్తతో విడాకులు తీసుకుంది.
తర్వాత పబ్‌లో సింగర్‌గా పనిచేస్తూ అక్కడకు వచ్చే వినియోగదారులతో పరిచయాలు ఏర్పరుచుకుంది. నమ్మకం పెంచి ప్రేమ పేరుతో ట్రాప్ చేసి పెళ్లి చేసుకునే ప్రయత్నాలు సాగించింది. ఒకరికి తెలియకుండా మరొకరితో వివాహం చేసుకుంటూ ఆరుగురు వ్యక్తులతో వివాహ బంధం పెట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు.
ఇప్పటికే పెళ్లి అయిన తర్వాత బాధితుల వద్ద నుండి లక్షలాది రూపాయలను డబ్బు, ఆభరణాల రూపంలో వసూలు చేసి, మోసపూరితంగా బ్లాక్‌మైల్ చేసినట్లు సమాచారం. కొత్తపేటకు చెందిన ఓ బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ స్కాం బయటపడింది. ప్రస్తుతం ఈ కేసు విచారణ దశలో ఉంది. మరింత మంది బాధితులు ఉండొచ్చన్న అనుమానంతో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.