చింత చచ్చినా పులుపు చావలేదు అనే సామెత నిజమే. చింతకాయలను ఎండబెట్టి నిల్వ చేసినా, వాటి పులుపు అలాగే ఉంటుంది. అలాగే ఉంది పాకిస్తాన్ తీరు. పొరుగు దేశం అని మనం ఎంత క్షమించినా, వారి మనస్తత్వం మాత్రం ఎప్పటికీ మారదేమో. ముఖ్యంగా వారి అబద్ధపు ప్రచారాలు, మనల్ని రెచ్చగొట్టే చర్యలు ఎప్పటికీ మారకుండా అలాగే కొనసాగిస్తారేమో. హరీస్ రౌఫ్ భార్య ముజ్ఞా మసూద్ మాలిక్ చేసిన ఒక సోషల్ మీడియా పోస్ట్ ప్రస్తుతం పెద్ద వివాదంగా మారింది.
ఆదివారం జరిగిన సూపర్-4 పోరులో భారత్ 6 వికెట్ల తేడాతో పాకిస్థాన్‌పై ఘన విజయం సాధించిన విషయం అందరికీ తెలిసిందే. దీంతో ఈ టోర్నీలో రెండోసారి కూడా పాకిస్థాన్‌ను భారత్ చిత్తు చేసింది. అయితే మ్యాచ్ సందర్భంగా హరీస్ రౌఫ్ చేసిన ఒక సైగ, ఆ తర్వాత అతని భార్య పెట్టిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది.
మ్యాచ్ ఓడిపోతున్న సమయంలో రౌఫ్ భారత అభిమానులను రెచ్చగొట్టేలా తన చేతులతో 6 అంటూ చూపించాడు. ఇది ఆపరేషన్ సిందూర్ సంఘటనను గుర్తు చేసింది. ఆ దాడుల్లో వందమంది ఉగ్రవాదులు మృతి చెందగా, పాకిస్థాన్ మాత్రం భారత్‌కు చెందిన 6 జెట్ విమానాలను కూల్చేశాం అనే అబద్ధపు ప్రకటన చేసింది. ఈ విమానాలపై ఇప్పటివరకు ఒక్క ఆధారమూ చూపించలేకపోయింది.
ఈ సంఘటన తర్వాత రౌఫ్ భార్య ముజ్ఞా మసూద్ మాలిక్ ఇన్‌స్టాగ్రామ్‌లో రౌఫ్ ఫొటోను షేర్ చేస్తూ మ్యాచ్ ఓడినా.. యుద్ధం గెలిచాం అంటూ క్యాప్షన్ పెట్టింది. ఆమె వ్యాఖ్యలు భారత అభిమానులను మరింత కోపానికి గురి చేశాయి.
నెటిజన్లు ఈ పోస్ట్‌పై విరుచుకుపడుతూ రెండుసార్లు చిత్తుగా ఓడిపోయినా తప్పుడు విషయాలతో సంతోషం పొందటమేంటి? అని ప్రశ్నిస్తున్నారు. మరికొందరు హరీస్ రౌఫ్‌కు కోహ్లీ ఇచ్చిన బెల్ట్ ట్రీట్‌మెంట్ సరిపోలేదా? అంటూ ఘాటుగా విమర్శలు గుప్పిస్తున్నారు. సోషల్ మీడియాలో ముజ్ఞాపై వందలాది కామెంట్లు వస్తున్నాయి. మరికొందరు తిట్లతోనే విరుచుకుపడుతున్నారు.ఈ వివాదం కారణంగా ముజ్ఞా మసూద్ పేరు ఒక్కసారిగా ట్రెండింగ్‌లోకి వచ్చింది.