ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆరోగ్యం పై ప్రత్యేక దృష్టి పెట్టిన సీఎం చంద్రబాబు నాయుడు గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య సేవలను మరింత చేరువగా తీసుకెళ్లేందుకు ఆరోగ్య రథం పేరుతో కొత్త మొబైల్ వైద్య వాహనాలను ప్రారంభించారు. ఈ వాహనాలు ప్రజలకు ఒక్క రూపాయి ఖర్చు లేకుండా వైద్య సేవలు అందించడం జరుగుతుంది.
చంద్రబాబు ప్రభుత్వం ఇప్పటికే ఆరోగ్య శ్రీ పథకాన్ని 25 లక్షల వరకు పెంచి, రాష్ట్రవ్యాప్తంగా యూనివర్సల్ హెల్త్ పాలసీని అందిస్తున్న విషయం అందరికీ తెలిసినదే. దీని భాగంగా గ్రామీణ ప్రాంతాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే ఈ కొత్త కార్యక్రమ లక్ష్యం.
ఆరోగ్య రథంలో 47 రకాల వైద్య పరీక్షలు నిర్వహించగల సామర్థ్యం ఉంది. రక్తపరీక్షలు, మూత్రపరీక్షలు, షుగర్, బీపీ, లివర్, కిడ్నీ ఫంక్షన్ వంటి సాధారణ వైద్య పరీక్షలు అందిస్తారు. ప్రతి రోగికి ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్ (EHR) రూపొందించి, వారి ఆరోగ్య పరిస్థితిని సులభంగా పర్యవేక్షిస్తారు.
రాష్ట్రంలో ఇప్పటికే 104 మొబైల్ వైద్య వాహనాలు 936 ప్రాంతాల్లో సేవలందిస్తున్నాయి. కానీ తరచుగా వాహనాలు మరమ్మతులకు వెళ్ళడం, పునరావృత సమస్యల కారణంగా, ప్రతి వాహనం నెలకు కేవలం రెండు సార్లు మాత్రమే గ్రామాలను సందర్శిస్తుంది. ఫలితంగా, కొన్ని గ్రామాల్లో ప్రజలకు సమర్థవంతమైన వైద్య సేవలు అందడం కష్టం అవుతుంది.
నూతన రథాల ప్రణాళిక
ఈ సమస్యను పరిష్కరించడానికి, ప్రభుత్వం కొత్త ఆరోగ్య రథాలు సిద్ధం చేసింది. ప్రతి వాహనంలో వైద్య బృందం మరియు ల్యాబ్ టెక్నీషియన్లు ఉంటారు. వీరు గ్రామాల్లోకి వెళ్లి, అవసరమైన నమూనాలను సేకరించి, వైద్య పరీక్షలు చేసి ఫలితాలను వెంటనే అందిస్తారు.
ఆరోగ్య రథం ముఖ్య లక్షణాలు
గ్రామీణ ప్రాంతాల్లో డోర్-టు-డోర్ వైద్య సేవలు
47 రకాల వైద్య పరీక్షలు ఉచితంగా
ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డులు ప్రతి రోగికి
ప్రతి వాహనంలో వైద్య బృందం + ల్యాబ్ టెక్నీషియన్
చంద్రబాబు ఆరోగ్య రథం ద్వారా ఆంధ్రప్రదేశ్‌లో నాణ్యమైన, సమయోచిత వైద్య సేవలు అందే అవకాశం ఏర్పడింది. ఇది గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల ఆరోగ్యాన్ని పెంపొందించడంలో కీలక అడుగులు గా చెప్పుకోవచ్చు.