Elevated Rail Corridor: దక్షిణ మధ్య రైల్వే కొత్త మెగా ప్రాజెక్టు! గంటకు 350కి.మీ వేగం... ఇక గంటన్నర లో హైదరాబాద్!

తీర ప్రాంతాల్లో తుపాన్ ప్రభావం కొనసాగుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యవసర చర్యలు చేపట్టింది. బాపట్ల జిల్లాలోని ప్రముఖ పర్యాటక కేంద్రాలు సూర్యలంక బీచ్, నిజాంపట్నం హార్బర్ బీచ్లను అధికారులు తాత్కాలికంగా మూసివేశారు. ఈ నిర్ణయం ప్రజల భద్రత దృష్ట్యా తీసుకున్నదని పోలీసులు తెలిపారు.

ఈ రీఛార్జ్‌తో 3 నెలల పాటు OTT సబ్‌స్క్రిప్షన్ ఫ్రీ! 168GB డేటా ఉచితం - 84 రోజుల వ్యాలిడిటీ..

తాజాగా బంగాళాఖాతంలో ఏర్పడిన తుపాన్‌ ప్రభావంతో సముద్రం ఉద్ధృతంగా మారింది. అలలు ఎగిసి పడుతూ తీరప్రాంతాల్లో ప్రమాదకర పరిస్థితులు ఏర్పడుతున్నాయి. దీంతో స్థానిక మత్స్యకారులకు సముద్రంలోకి వెళ్లవద్దని ముందస్తు హెచ్చరికలు జారీ చేశారు. అలాగే సముద్రతీర ప్రాంతాల్లో ఉన్న పర్యాటకులు, స్థానికులు బీచ్ ప్రాంతాలకు చేరకూడదని అధికారులు సూచించారు.

రిలయన్స్ జియో సంచలనం – అందరికీ అందుబాటులో 5జీ ఫోన్! ధర తెలిస్తే ఆశ్చర్యానికి గురవుతారు!!

ప్రతి సంవత్సరం కార్తీకమాసం సందర్భంగా జిల్లాలోని ప్రజలు కుటుంబ సభ్యులతో కలిసి సముద్ర స్నానం చేయడం ఒక సాంప్రదాయం. ఆదివారం రోజు ఈ పుణ్యస్నానాల కోసం వేలాది మంది భక్తులు సూర్యలంక, నిజాంపట్నం బీచ్లకు చేరుకునే అవకాశం ఉండటంతో, ప్రజల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈసారి పోలీసులు ముందస్తు చర్యలు తీసుకున్నారు. సముద్రం ఉప్పొంగి ప్రమాదకర పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉన్నందున, బీచ్ ప్రాంతాలకు వెళ్లవద్దని ప్రజలను వేడుకుంటున్నారు.

'మొంథా' తుపాను ముప్పు.. రాత్రికి తీవ్ర తుపానుగా బలపడే అవకాశం.. తీరం వైపు దూసుకొస్తోంది! గంటకు 6 కి.మీ వేగంతో..

బాపట్ల జిల్లా కలెక్టర్, ఎస్పీ సంయుక్తంగా పర్యవేక్షణ బాధ్యతలు చేపట్టారు. తీరప్రాంతాల్లో NDRF, పోలీసు, ఫైర్ సిబ్బంది అప్రమత్తంగా ఉండేలా చర్యలు చేపట్టారు. ఏవైనా అత్యవసర పరిస్థితులు ఎదురైతే వెంటనే స్పందించేందుకు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు.

అధిక రేంజ్ ఇచ్చే ఫ్యామిలీ స్కూటర్.. 123 కి.మీ. రేంజ్‌తో నగర ప్రయాణాలకు బెస్ట్ ఆప్షన్! రంగును బట్టి రిజ్టా ధరలు వేరు!

అలాగే మత్స్యకారులు సముద్రంలోకి వెళ్ళకూడదని, ఇప్పటికే వెళ్లినవారు వెంటనే తీరానికి చేరుకోవాలని సూచించారు. మత్స్యకార పడవలను సురక్షిత ప్రదేశాలకు తరలించే పనిని కూడా అధికారులు పూర్తి చేశారు.

Rock Garden: చిన్న పిల్లల నుంచి పెద్ద వయస్సు వారిని ఆకర్షిస్తున్న ప్రకృతి అందాల రాక్ గార్డెన్! తప్పక చూడండి!

ఇక పర్యాటక శాఖ అధికారులు కూడా తీరప్రాంతాలను పర్యవేక్షిస్తున్నారు. బీచ్ ప్రాంతాల్లో భద్రతా సిబ్బందిని మోహరించి, ప్రజలు బీచ్ వద్దకు వెళ్లకుండా అడ్డుకుంటున్నారు. సూర్యలంక, నిజాంపట్నం బీచ్ ప్రవేశ మార్గాలను తాత్కాలికంగా మూసివేయడంతో పర్యాటకులు కొంత నిరాశ వ్యక్తం చేశారు.

స్టార్ యాంకర్ ఎమోషనల్ నోట్.. అతడితో బ్రేకప్.. లాంగ్ జర్నీ ముగిసింది! నెటిజన్ల భిన్న కామెంట్లు!

అయితే అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ, “మీ భద్రతే మా ప్రాధాన్యం. పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చిన వెంటనే బీచ్‌లను మళ్లీ తెరవబడతాయి. అప్పటి వరకు ఇంట్లోనే ఉండి వర్షం, గాలుల తీవ్రత తగ్గేవరకు వేచి ఉండండి” అని సూచించారు.

Bank News: బ్యాంకు ఖాతాదారులకు బిగ్ అలర్ట్! నవంబర్ 1 నుంచి నలుగురు నామినీలు.. లాకర్‌ రూల్స్‌లోనూ భారీ మార్పు!

ప్రస్తుతం సముద్ర తీర ప్రాంతాల్లో గాలులు గంటకు 50–60 కిలోమీటర్ల వేగంతో వీస్తున్నాయి. వర్షాలు కూడా కొనసాగుతున్నాయి. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం, తుపాన్ ప్రభావం వచ్చే 24 గంటల వరకు కొనసాగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అధికారులు తీసుకున్న ఈ తాత్కాలిక మూసివేత చర్య భద్రతా పరంగా అత్యంత సమంజసమైనదిగా నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Womens: మహిళలు ఇంటి వంటకంతో ఉద్యోగులకు భోజనం..! అమరావతిలో క్లౌడ్ కిచెన్ పథకం ప్రారంభం..!
Special Trains: ఏపీ మీదుగా ప్రత్యేక రైళ్లు! హాల్ట్ స్టేషన్లు ఇవే!
RBI: ఆర్బీఐ సంచలన నిర్ణయం..! వెండిపైనా రుణాలు.. ఒక్కరికి రూ.10 లక్షల వరకు..!
Tirumala: టీటీడీ తాజా సమాచారం! పెరిగిన భక్తుల రద్దీ... సర్వదర్శనానికి 14 గంటల సమయం!
Liquor: మద్యం లైసెన్స్‌ల గడువు వివాదం..! టెండర్‌ గడువు పెంపుపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు..!