భోజనం చేసిన వెంటనే కొన్ని అలవాట్లు చేస్తాం, అవి సాధారణంగా ‘ఒక పని అయిపోయింది’ అనే భావనతో జరుగుతాయి. ఉదాహరణకు, కొందరు నేరుగా మంచంపై పడ్డారు లేదా టీ, కాఫీ తాగుతారు. కానీ ఈ అలవాట్లు ఆరోగ్యానికి హానికరంగా ఉండవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. భోజనం తర్వాత ఏం చేస్తున్నామనేది జీర్ణక్రియకు, శరీరానికి సరిగ్గా శక్తి అందించడంలో కీలక పాత్ర పోషిస్తుంది.
భోజనం తర్వాత నేరుగా నీరు తాగడం మంచిది కాదు. ఇది కడుపులోని ఆమ్లాలు మరియు జీర్ణ ఎంజైమ్స్ సమతుల్యతను దెబ్బతీస్తుంది. ఫలితంగా ఆహారం సరిగ్గా జీర్ణం అవడం ఆపబడుతుంది. గ్యాస్ట్రిక్ సమస్యలు, అజీర్ణం, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే భోజనం చేసిన తర్వాత కనీసం 30 నిమిషాలు ఆగి నీరు తాగడం మంచిదని సూచిస్తున్నారు.
భోజనం చేసిన వెంటనే నిద్రపోవడం కూడా ఆరోగ్యానికి హానికరం. ఇది కడుపులో ఆహారం సరిగ్గా జీర్ణం కాకుండా, గుండెల్లో మంట, జీర్ణ సమస్యలు, శరీరంలో కొవ్వు పెరగడం వంటి సమస్యలకు దారి తీస్తుంది. కాబట్టి భోజనం తర్వాత కొద్దిగా నడవడం లేదా శాంతమైన కార్యకలాపాలు చేయడం మంచిది.
భోజనం తర్వాత సిగరెట్ కాల్చడం, టీ లేదా కాఫీ తాగడం కూడా జాగ్రత్త అవసరం. సిగరెట్ వల్ల ఊపిరితిత్తులు, జీర్ణ సమస్యలు, క్యాన్సర్ వంటి రోగాలు వచ్చే అవకాశం 10 రెట్లు ఎక్కువగా ఉంటుంది. టీ, కాఫీ లోని కెఫిన్ ఐరన్, ఇతర పోషకాల శోషణను అడ్డుకుంటుంది, ఇది ముఖ్యంగా మహిళలలో రక్తహీనత సమస్యలను పెంచవచ్చు. వీటిని తీసుకోవాలంటే భోజనం చేసిన తర్వాత కనీసం గంట తర్వాత తాగడం మంచిది.
తదుపరి, భోజనం చేసిన వెంటనే వ్యాయామం చేయడం కూడా మంచిది కాదు. శారీరక శ్రమ వల్ల కండరాలకు రక్త ప్రవాహం పెరుగుతుంది, కానీ జీర్ణక్రియకు అవసరమైన రక్తం అందదు. ఫలితంగా కడుపు నొప్పి, వాంతులు, అజీర్ణం, గ్యాస్ సమస్యలు ఏర్పడతాయి. కాబట్టి భోజనం తర్వాత 90 నిమిషాల నుంచి 2 గంటల తర్వాత వ్యాయామం చేయడం ఆరోగ్యకరమైన అలవాటు.
ఇలా పాటిస్తే జీర్ణక్రియ సులభం అవుతుంది, శరీరానికి అవసరమైన శక్తి అందుతుంది, మరియు దీర్ఘకాలంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.