కేంద్ర ప్రభుత్వం దేశంలోని అసంఘటిత రంగంలోని కార్మికుల భవిష్యత్తుకు ఆర్థిక భరోసా ఇవ్వడానికి అటల్ పెన్షన్ యోజన (Atal Pension Yojana – APY) అనే ప్రత్యేక పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం ప్రధానంగా రైతులు, కూలీలు, తాపీ పని చేసేవారిలాంటి అసంఘటిత రంగంలో పనిచేసే ప్రజలకు ఉద్దేశించబడింది. ఇందులో చేరినవారు 60 ఏళ్ల వయసు దాటిన తర్వాత నెలకు ₹1000 నుంచి ₹5000 వరకు పెన్షన్ పొందగలుగుతారు.
ఇప్పటివరకు చాలా మంది ఈ స్కీమ్‌లో చేరారు కానీ తాజా సమాచారం ప్రకారం అటల్ పెన్షన్ యోజనలో రిజిస్ట్రేషన్ ప్రక్రియలో కొన్ని మార్పులు చేశారు. సబ్‌స్క్రైబర్ రిజిస్ట్రేషన్ ఫారం మార్చబడింది. పాత ఫారమ్‌లో రిజిస్ట్రేషన్ చేయడం 30 సెప్టెంబర్ 2025 వరకు మాత్రమే అనుమతించబడింది. 1 అక్టోబర్ 2025 నుండి కొత్త ఫారం ఉపయోగించడం తప్పనిసరి అయింది.
ఈ సమాచారాన్ని తపాలా శాఖ ఒక ఆఫీస్ మెమో ద్వారా ప్రకటించింది, కొత్త APY ఫారం మాత్రమే రిజిస్ట్రేషన్ కోసం అంగీకరించబడుతుందని. పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ (PFRDA) ఇచ్చిన మార్గదర్శకాలను అనుసరించి, రిజిస్ట్రేషన్ ప్రక్రియను మరింత సులభతరం చేశారు. పాత ఫారమ్ సెప్టెంబర్ 30 తర్వాత ఉపయోగించరాదు. పాత ఫారమ్‌ను ఇప్పటికే సెంట్రల్ రికార్డ్ కీపింగ్ ఏజెన్సీ () ఆమోదించదు తెలపడం జరిగింది.
అటల్ పెన్షన్ యోజన ముఖ్యాంశాలు
1. ఈ పథకం సామాజిక భద్రతా పథకం.
2. దేశంలోని అసంఘటిత రంగంలో పని చేసే వ్యక్తులు ఇందులో చేరవచ్చు.
3. నెలకు ₹1000 నుంచి ₹5000 వరకు గ్యారెంటీ పెన్షన్ లభిస్తుంది.
4. పెన్షన్ ఖాతాదారుకు 60 ఏళ్ల వయసు చేరిన తర్వాత ఇవ్వబడుతుంది.
5. నెలకు 250 చెల్లిస్తూ గరిష్ఠంగా ₹5000 పెన్షన్ పొందవచ్చు.
6. మీరు నెలకి ఎంత మొత్తం చెల్లిస్తారో దానిపై ఆధారపడి.
200 నుంచి 100 నెల నెల కట్టుకోవచ్చు
7. 18 ఏళ్లు నుంచి 40 ఏళ్ల వయసుకలిగిన భారతీయులు ఇందులో చేరవచ్చు.
8. బ్యాంక్ లేదా పోస్టాఫీసులో ఖాతా ఉండాలి.
9. ఆదాయపు పన్ను చెల్లించే వ్యక్తులు ఈ స్కీమ్‌లో చేరలేరు.
ఈ పథకం ద్వారా అసంఘటిత రంగ కార్మికులకు వారి వృద్ధాప్యం కోసం నిబంధిత ఆదాయం ఏర్పడుతుంది. కొత్త ఫారం రాబోయే వారందరికీ రిజిస్ట్రేషన్ ప్రక్రియను సులభతరం చేస్తుంది. అంటే, ఇప్పుడు ఏకకాలంలో ఎక్కువ మంది ఈ స్కీమ్‌లో చేరి భవిష్యత్తుకు ఆర్థిక భరోసా పొందవచ్చు.