BSNL Recharge: దేశంలోనే తొలిసారిగా అతి చౌక ప్లాన్! 330 రోజుల అన్ లిమిటెడ్ కాలింగ్స్.. డైలీ 1.5GB డేటా!

సౌత్ ఇండియాలోకి మరో కొత్త ఎయిర్‌లైన్ అడుగుపెట్టడానికి సిద్ధమవుతోంది. ఇప్పటికే అల్ హింద్ ఎయిర్, ఎయిర్ కేరళ లాంటి కంపెనీలు రంగప్రవేశానికి సన్నద్ధమవుతుంటే, ఇప్పుడు ఎయిర్ సఫా అనే స్టార్ట్‌అప్ కూడా ప్రయాణానికి రంగం సిద్ధం చేసుకుంటోంది. కంపెనీ లింక్డిన్‌లో చేసిన ప్రకటన ప్రకారం, భారత ఏవియేషన్ రెగ్యులేటర్ దగ్గర నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ (NOC) కోసం చివరి దశలో ఉంది. ఈ నెలలోనే DGCA డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అధికారులతో మొదటి సమావేశం జరగనుంది.

BSNL 4G: సాంకేతిక రంగంలో చారిత్రాత్మక ఘట్టం.. BSNL స్వదేశీ 4జీ సేవలు.. ప్రధాని మోదీ!

ఎయిర్ సఫా తన విస్తరణలో భాగంగా, తిరుచిరాపల్లి ఎయిర్‌పోర్ట్ (TRZ) వద్ద ఒక ఆధునిక Aviation Hub ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ హబ్‌లో ప్రయాణికుల రవాణాతో పాటు, ట్రైనింగ్, ఆపరేషన్స్, MRO (మెయింటెనెన్స్, రిపేర్, ఓవర్‌హాల్), డిజిటల్ ఏవియేషన్ సర్వీసులు అన్నీ ఒకే వేదికపై అందుబాటులోకి వస్తాయి. అంటే, కేవలం విమానాలు నడపడం మాత్రమే కాకుండా, విమానయానానికి కావాల్సిన అన్ని సదుపాయాలను ఒకే చోట కల్పించనుంది.

MBBS PG Seats: 2028-29 నాటికి ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 10,000 పైగా సీట్లు! కేబినేట్ ఆమోదం!

ఈ ప్రాజెక్ట్‌ను కంపెనీ భారత ఏవియేషన్ భవిష్యత్తుకు పునాది రాయి మారనుందని అభివర్ణించింది. ఉద్యోగులకు పంపిన సందేశంలో మేనేజ్‌మెంట్ మీ కష్టపడి పనిచేయడం, అంకితభావం వల్లే మేము ఈ స్థాయికి చేరుకున్నాం అని సిబ్బందికి ధన్యవాదాలు తెలిపింది.

India: ఐరాసలో పాక్‌కు భారత్ స్ట్రాంగ్ కౌంట‌ర్‌..! ఉగ్రవాదులను, వారిని వెనకనుండి నడిపించే వారిని ఊరికే వదలం..!

ప్రస్తుతం భారత ఏవియేషన్ రంగం వేగంగా పెరుగుతోంది. ప్రభుత్వ రీజినల్ కనెక్టివిటీ పథకాల వల్ల చిన్న నగరాలకు కూడా విమాన సదుపాయాలు అందుబాటులోకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎయిర్ సఫా రంగప్రవేశం మార్కెట్‌కు మరింత ఉత్సాహాన్ని తెచ్చే అవకాశం ఉంటుందని భావించుకోవచ్చు. ముఖ్యంగా ట్రిచీ హబ్ ద్వారా దేశీయ MRO సదుపాయాలు పెరగడం, స్థానికంగా ఏవియేషన్ నైపుణ్యాలు అభివృద్ధి చెందడం వంటి ప్రయోజనాలు లభించనున్నాయి.

Free bus: ప్రయాణికులకు గుడ్ న్యూస్! ఇకపై ఆధార్ అవసరం లేదు, అది ఉంటే చాలు..!

అలాగే అల్ హింద్ ఎయిర్, ఎయిర్ కేరళ వంటి కంపెనీలు కూడా దక్షిణ భారత మార్కెట్‌లోకి అడుగుపెట్టబోతుండటంతో పోటీ మరింత కఠినంగా మారనుంది. గల్ఫ్ దేశాలకు కనెక్టివిటీ, దక్షిణ రాష్ట్రాల మధ్య విమాన సర్వీసులు, చిన్న పట్టణాల ఎయిర్‌పోర్టుల అభివృద్ధి కలిపి ఈ ప్రాంతాన్ని వేగంగా పెరుగుతున్న విమానయాన మార్కెట్‌గా నిలబెడుతున్నాయి.

Polytechnic: పాలిటెక్నిక్ కళాశాలలకు సొంత భవనాలు..! త్వరలో నిర్మాణం పూర్తి చేస్తామని మంత్రి లోకేష్ హామీ..!

అయితే ఎయిర్ సఫా ప్రత్యేక వ్యూహాన్ని అవలంబిస్తోంది. కేవలం ఎయిర్‌లైన్ కాకుండా, పూర్తి Aviation Ecosystem‌ను నిర్మించడం దీని లక్ష్యం పేర్కొనడం జరిగినది. ట్రిచీ వంటి కీలక గల్ఫ్ గేట్‌వేలో తన కేంద్రాన్ని ఏర్పాటు చేసి, ట్రైనింగ్, మెయింటెనెన్స్, టెక్నాలజీ రంగాలన్నింటినీ ఒకే చోట కలపడం ద్వారా, ఈ సంస్థ దక్షిణ భారత ఏవియేషన్ రంగంలో ఒక స్ట్రాటజిక్ ఎనేబ్లర్ గా ఎదగవచ్చని నిపుణులు భావిస్తున్నారు.

Tirumala Devotees: తిరుమల శ్రీవారి భక్తులకు దసరా కానుక.. కేవలం రూ.1,499 కే గంటన్నరలో వెళ్ళొచ్చు! మూడు రోజులే ఛాన్స్!

ఈ మల్టీ-డైమెన్షనల్ మోడల్ మేక్ ఇన్ ఇండియా లక్ష్యాలకు తోడ్పడటమే కాకుండా, స్థానిక యువతకు ఏవియేషన్ రంగంలో కొత్త అవకాశాలు, శిక్షణా సదుపాయాలను అందించనుంది. దీంతో ఎయిర్ సఫా కేవలం కొత్త ఎయిర్‌లైన్‌గానే కాకుండా, భావితరాలకు కూడా మంచి అవకాశం కానుంది.

Dwacra womens: ఏపీలో డ్వాక్రా మహిళలకు కొత్త AI యాప్! ఇక అన్ని సదుపాయాలు ఇంటి నుండే...
Amrut Bharat Express: ఏపీ మీదుగా అమృత్ భారత్ ఎక్స్ ప్రెస్! హాల్ట్ స్టేషన్లు ఇవే!
Top 10 Airlines 2025: ప్రపంచంలోనే నెంబర్ 1 స్థానంగా ఖతర్ ఎయిర్ లైన్స్! రెండవ స్థానంలో ఆ దేశం!