
వృద్ధులను గౌరవించని సమాజం, వేర్లు లేని చెట్టు లాంటిది. కానీ అమెరికా ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్మెంట్ (ICE) అధికారులు ఇటీవల 73 ఏళ్ల భారతీయ వృద్ధురాలు హర్జిత్ కౌర్‌ను అరెస్టు చేసిన తీరు చాలా బాధాకరంగా ఉంది. మూడు దశాబ్దాలకు పైగా అమెరికాలో జీవించిన ఆమెను ఆకస్మికంగా, ఒక పక్షిని పంజరంలో బంధించినట్టు నిర్బంధించడం అంతర్జాతీయంగా కూడా చర్చనీయాంశమైంది.
హర్జిత్ కౌర్ 1992లో అమెరికాకు వలస వెళ్లారు. అక్కడ తన కుటుంబంతో కలిసి జీవితం కొనసాగిస్తూ, 2012లో ఆశ్రయం కోసం దరఖాస్తు చేశారు. అయితే ఆ దరఖాస్తు తిరస్కరించబడింది. అప్పటి నుండి ఆమె ప్రతి ఆరు నెలలకు ఒకసారి ICE కార్యాలయానికి వెళ్లి రిపోర్ట్ ఇస్తూ చట్టానికి సహకరిస్తూ వచ్చారు.
సెప్టెంబర్ 8న సాన్ ఫ్రాన్సిస్కోలోని ICE కార్యాలయానికి సాధారణ రిపోర్టింగ్ కోసం వెళ్లిన హర్జిత్ కౌర్‌ను అధికారులు అనూహ్యంగా అరెస్టు చేశారు. అనంతరం ఆమెను కాలిఫోర్నియాలోని Mesa Verde ICE Processing Centerకి తరలించారు. ఆమె వయసు, ఆరోగ్య పరిస్థితులను పక్కన పెట్టి తీసుకున్న ఈ నిర్ణయం కుటుంబాన్ని తీవ్ర ఆందోళనకు గురిచేసింది.
అమెరికా ప్రభుత్వం హర్జీత్ కౌర్ పంపిన విధానం అత్యంత కఠినంగా ఉందని న్యాయవాది దీపక్ అహ్లువాలియా ఇంస్టాగ్రామ్ వేదికదా తెలిపారు.హర్జీత్ కౌర్ ను బలమైన గొలుసులతో కట్టేసి, చల్లని గదుల్లో నిర్బంధించి, అవసరమైన మందులు కూడా ఇవ్వలేదని అదే విధంగా రెండు వారాలపాటు వివిధ నిర్బంధ గృహాలలో ఉంచి చివరికి ప్రత్యేక విమానంలో ఢిల్లీలో వదిలివేశారు ఆయన తెలిపారు.
ఆమె కుటుంబ సభ్యులు చేసిన విన్నపాలు కూడా అధికారులు పట్టించుకోలేదు. చివరిసారి కలిసే అవకాశం ఇవ్వాలని కనీసం సాధారణ విమానంలో పంపాలని కోరినా అక్కడ అధికారులు వాటిని కూడా నిర్లక్ష్యం చేశారు. దీంతో కాలిఫోర్నియాలో వందలాది మంది ప్రజలు ర్యాలీలు నిర్వహించారు. మా అమ్మమ్మను విడిచిపెట్టండి అంటూ నినాదాలు చేశారు. స్థానిక ప్రజా ప్రతినిధులు కూడా అధికారుల నిర్ణయాన్ని తప్పు పట్టడం విశేషంగా చెప్పుకోవచ్చు.
అయితే అమెరికా అధికారులు మాత్రం “హర్జీత్ కౌర్ పలుమార్లు చెప్పిన వినలేదని అందుకే ఇప్పుడు మేము చట్టాన్ని అమలు చేశాం అని వాదిస్తున్నారు. కానీ మానవ హక్కుల సంఘాలు మాత్రం 73 ఏళ్ల ఆ వృద్ధురాలిని ఈ విధంగా పంపించడం కరుణకు బదులు కఠినతకే ప్రాధాన్యం ఇవ్వడం అవుతుందని, అది అమెరికా ప్రతిష్టను దెబ్బతీసేయని తెలిపారు. .