నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ) కొత్త నిబంధనల ప్రకారం, యూపీఐ లావాదేవీ తాలూకు ఐడీలో స్పెషల్ క్యారెక్టర్స్ (@, #, &) కలిగి ఉంటే.. అలాంటి యూపీఐ లావాదేవీలు సక్సెస్ కావు. ట్రాన్సాక్షన్ ఐడీలో ప్రత్యేక అక్షరాలు లేకుండా ఆల్ఫాన్యూమరిక్ (ఇంగ్లిష్ అక్షరాలు, నంబర్లు)తోనే ఐడీలు జనరేట్ చేయాలని యూపీఐ ఆపరేటర్స్‌ను ఇప్పటికే ఎన్‌పీసీఐ ఆదేశించింది. ఈ మేరకు జనవరి 9న ఓ ప్రత్యేక సర్క్యులర్‌ను జారీ చేసింది. లేనిపక్షంలో ఫిబ్రవరి 1వ తేదీ నుంచి ఆయా లావాదేవీలు ఆగిపోతాయని స్పష్టం చేసింది. కాగా, ఈ ఆదేశాలను పాటించని యాప్స్ ద్వారా వినియోగదారులు ట్రాన్సాక్షన్ చేయలేరు. నకిలీ ఐడీలను నివారించడంతో పాటు లావాదేవీలను సులభంగా ట్రాక్ చేయడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎన్‌పీసీఐ వెల్లడించింది.
ఇంకా చదవండి: శంషాబాద్ ఎయిర్ పోర్టుకు బెదిరింపు కాల్! పోలీసుల దర్యాఫ్తులో కామారెడ్డి జిల్లాకు..
అంతకంతకూ పెరుగుతున్న యూపీఐ లావాదేవీలు..
ఇక యూపీఐ లావాదేవీలు రోజురోజుకీ అంతకంతకూ పెరుగుతున్నాయి. ఎన్‌పీసీఐ డేటా ప్రకారం యూపీఐ ట్రాన్సాక్షన్స్ సంఖ్య 2024 డిసెంబర్‌లో 16.73 బిలియన్లకు చేరుకుంది. ఇది నవంబర్‌లో 15.48 బిలియన్లతో పోలిస్తే 8 శాతం పెరుగుదలను నమోదు చేసింది. కాగా, డిసెంబరులో ఈ లావాదేవీల మొత్తం విలువ రూ.23.25 లక్షల కోట్లకు చేరుకోగా, అంతకు ముందు నెలలో రూ.21.55 లక్షల కోట్లుగా ఉంది. అలాగే రోజువారీ సగటు లావాదేవీల సంఖ్య కూడా నవంబర్‌లో 516.07 మిలియన్ల నుంచి డిసెంబర్‌లో 539.68 మిలియన్లకు పెరిగింది.
ఇంకా చదవండి: నామినేటెడ్ పదవులు ఆశించేవారు తప్పనిసరిగా ఇలా చేయాలి... ఎమ్మెల్యేలకు పలు కీలక సూచనలు!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
ఘోర ప్రమాదం.. ఆకాశంలో ఢీ కొన్న విమానాలు.. విమానాశ్రయాన్ని మూసివేసిన అధికారులు!
భక్తుడి ఫిర్యాదు.. మంత్రి లోకేష్ సీరియస్ రియాక్షన్.. 24 గంటల్లోనే చర్యలు!
జనవరి 1 నుంచే ఆర్థిక సంవత్సరం? టాక్స్‌పేయర్లకు లాభామా? నష్టమా?
ఉద్యోగులకు సూపర్ న్యూస్! ఇక వారానికి నాలుగు రోజులే పని! 200 కంపెనీల కీలక నిర్ణయం!
సౌదీ అరేబియాలో ఘోర రోడ్డు ప్రమాదం! 9 మంది భారతీయులు మృతి!
ట్రంప్ మరో దారుణమైన నిర్ణయం.. ప్రపంచమే విస్తుపోయేలా.. అమెరికా కఠిన వలస విధానాలు.!
కుంభమేళా కి వెళ్ళిన రోజా.. తొక్కిసలాటలో 20 మంది మృత్యువాత!
ఇందులో సభ్యులుగా ఉంటేనే నామినేటెడ్ పదవులు! నేతలకు చంద్రబాబు కండిషన్.. ప్రభుత్వం కీలక నిర్ణయం!
రాజీనామా, పార్టీ మార్పు - తేల్చేసిన వైసీపీ ఎంపీ అయోధ్య రామిరెడ్డి! ఓటమి ఎదురైనప్పుడే..
జానీ మాస్టర్ కు మరో ఎదురుదెబ్బ.. యాంకర్ ఝాన్సీ కీలక ప్రకటన! ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్!
ఏపీలో మరో ఫ్లై ఓవర్‌కు గ్రీన్ సిగ్నల్! కేంద్ర మంత్రి ప్రకటన! ఆ రూట్ లోనే!
ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం! భూముల రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపు.. ఆ 29 గ్రామాల్లో మాత్రం పెరగవు..
గుడ్ న్యూస్.. చంద్రబాబు పలు పథకాల అమలకు సంబంధించి కీలక వ్యాఖ్యలు! అకౌంట్లోకి రూ.15,000లు..
విజయసాయిరెడ్డి రాజీనామా వెనుక కారణాలు వెల్లడించిన కేతిరెడ్డి! ఆ సమయంలో కొన్ని తప్పులు..!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: