ఏపీలో కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. అభ్యంతరం లేని ప్రభుత్వ భూముల క్రమబద్ధీకరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అదనంగా, రాష్ట్రవ్యాప్తంగా ల్యాండ్ రెగ్యులరైజేషన్ సంబంధిత విధివిధానాలు ఖరారు చేశాయి. ఈ మేరకు భూముల క్రమబద్ధీకరణ పథకం–2025 పేరిట ప్రధాన కార్యదర్శి విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు. అర్బన్, రూరల్ ఏరియాల్లో భూముల క్రమబద్ధీకరణకు నిబంధనలను కఠినంగా అమలు చేయనున్నారు. కూటమి ప్రభుత్వం భూముల ఆక్రమణల క్రమబద్ధీకరణ పట్టాలను మహిళల పేర్లపైనే జారీ చేస్తామని స్పష్టం చేసింది. 2019 అక్టోబరు 15లోగా ఆక్రమించిన వారికే క్రమబద్ధీకరణ నిబంధనలు వర్తిస్తాయని వెల్లడించింది. 150 గజాల వరకు ఉచితంగా క్రమబద్ధీకరించనున్నట్లు పేర్కొంది.
క్రమబద్ధీకరణ అర్హతలు ఇవే?
లబ్ధిదారుల కుటుంబసభ్యులు ఆదాయ పన్ను చెల్లింపుదారులై ఉండకూడదు.
కారు ఉండకూడదు, అయితే వ్యవసాయ అవసరాలకు వినియోగించే టాక్సీ, ఆటో, ట్రాక్టర్లకు మినహాయింపు ఇస్తారు.
గ్రామాల్లో కుటుంబ ఆదాయం గరిష్ఠంగా రూ. 10,000, పట్టణాల్లో రూ. 14,000 మాత్రమే ఉండాలి.
ఇంకా చదవండి: రైతులకు తీపికబురు చెప్పిన చంద్రబాబు.. ఆ పంట వేసిన వారికి ఇక పండగే! దీంతో పాటుగా పంటలకు ఉచిత బీమా..
నెలకు రూ. 300 లోపు విద్యుత్తు బిల్లు చెల్లించి ఉండాలి.
10 ఎకరాలకు మించని వ్యవసాయ భూమి మాత్రమే ఉండాలి.
ఆర్‌సీసీ రూఫ్ / ఆస్బెస్టాస్ రూఫ్‌తో ఇటుక గోడలతో నిర్మించిన ఇల్లు ఉండాలి.
రిజిస్టర్డ్ డాక్యుమెంట్, ఆస్తిపన్ను రశీదు, విద్యుత్ మరియు నీటి బిల్లులు పరిగణనలోకి తీసుకుంటారు.
క్రమబద్ధీకరణ ప్రక్రియ:
డిసెంబర్ 31 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు.
తహసీల్దార్ పర్యవేక్షణలో గ్రామ/వార్డు సిబ్బంది ఆక్రమిత భూముల జాబితా సిద్ధం చేయాలి.
అర్హుల తుది జాబితాను సబ్‌కలెక్టర్ / ఆర్‌డీవోకి పంపాలి.
జాబితాపై అభ్యంతరాలు ఉంటే 30 రోజుల్లో జాయింట్ కలెక్టర్‌కు అప్పీల్ చేసుకోవచ్చు.
తుది జాబితా ఖరారైన తర్వాత, తహసీల్దార్లు ఆ వివరాలను సబ్-రిజిస్ట్రార్ & జిల్లా రిజిస్ట్రార్‌కు పంపాలి.
150 గజాల వరకు ఉచిత రిజిస్ట్రేషన్
150 గజాల వరకు భూముల రిజిస్ట్రేషన్ ఫీజు పూర్తిగా మాఫీ చేస్తారు. 151-300 గజాలు, 301-450 గజాలు మరియు అంతకంటే ఎక్కువ స్థలాలకు లబ్ధిదారుల ఆర్థిక స్థితిని పరిగణనలోకి తీసుకుని రిజిస్ట్రేషన్ ఫీజు నిర్ణయిస్తారు.
ఈ స్థలాల్లో క్రమబద్ధీకరణ సాధ్యం కాదు..?
మాస్టర్ ప్లాన్, జోనల్ ప్లాన్‌లో ముద్రపెట్టిన భూములు
లే-అవుట్ స్థలాలు
కాలువలు, నదీ ప్రవాహ మార్గాలు, ఇతర జల వనరులకు చెందిన భూములు
జీవో నెం.30 విడుదల
గత కేబినెట్ సమావేశంలో ఆమోదించిన మేరకు, రెవెన్యూ శాఖ బుధవారం నాడు జీవో నెం. 30 (GO No.30)ని విడుదల చేసింది. భూముల ఆక్రమణదారులకు పక్కా పట్టాలు, కన్వేయన్స్ డీడ్ అందించిన రెండు సంవత్సరాల తర్వాత యాజమాన్య హక్కులు లభిస్తాయని జీవోలో పేర్కొన్నారు.
ఇంకా చదవండి: నామినేటెడ్ పదవులు ఆశించేవారు తప్పనిసరిగా ఇలా చేయాలి... ఎమ్మెల్యేలకు పలు కీలక సూచనలు!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
ఘోర ప్రమాదం.. ఆకాశంలో ఢీ కొన్న విమానాలు.. విమానాశ్రయాన్ని మూసివేసిన అధికారులు!
భక్తుడి ఫిర్యాదు.. మంత్రి లోకేష్ సీరియస్ రియాక్షన్.. 24 గంటల్లోనే చర్యలు!
జనవరి 1 నుంచే ఆర్థిక సంవత్సరం? టాక్స్‌పేయర్లకు లాభామా? నష్టమా?
ఉద్యోగులకు సూపర్ న్యూస్! ఇక వారానికి నాలుగు రోజులే పని! 200 కంపెనీల కీలక నిర్ణయం!
సౌదీ అరేబియాలో ఘోర రోడ్డు ప్రమాదం! 9 మంది భారతీయులు మృతి!
ట్రంప్ మరో దారుణమైన నిర్ణయం.. ప్రపంచమే విస్తుపోయేలా.. అమెరికా కఠిన వలస విధానాలు.!
కుంభమేళా కి వెళ్ళిన రోజా.. తొక్కిసలాటలో 20 మంది మృత్యువాత!
ఇందులో సభ్యులుగా ఉంటేనే నామినేటెడ్ పదవులు! నేతలకు చంద్రబాబు కండిషన్.. ప్రభుత్వం కీలక నిర్ణయం!
రాజీనామా, పార్టీ మార్పు - తేల్చేసిన వైసీపీ ఎంపీ అయోధ్య రామిరెడ్డి! ఓటమి ఎదురైనప్పుడే..
జానీ మాస్టర్ కు మరో ఎదురుదెబ్బ.. యాంకర్ ఝాన్సీ కీలక ప్రకటన! ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్!
ఏపీలో మరో ఫ్లై ఓవర్‌కు గ్రీన్ సిగ్నల్! కేంద్ర మంత్రి ప్రకటన! ఆ రూట్ లోనే!
ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం! భూముల రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపు.. ఆ 29 గ్రామాల్లో మాత్రం పెరగవు..
గుడ్ న్యూస్.. చంద్రబాబు పలు పథకాల అమలకు సంబంధించి కీలక వ్యాఖ్యలు! అకౌంట్లోకి రూ.15,000లు..
విజయసాయిరెడ్డి రాజీనామా వెనుక కారణాలు వెల్లడించిన కేతిరెడ్డి! ఆ సమయంలో కొన్ని తప్పులు..!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: