ఐదేళ్లపాటు కార్యకర్తలు చేసిన తిరుగులేని పోరాటమే మొన్నటి ఎన్నికల్లో టీడీపీ ఘన విజయానికి కారణమని ఏపీ సీఎం, టీడీపీ చీఫ్ చంద్రబాబు పేర్కొన్నారు. పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్తలకు టీడీపీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, మొదటి నుంచీ పార్టీ బలోపేతానికి కృషి చేసిన వారికి నామినేటెడ్ పదవులు ఇవ్వడం జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలోని 214 మార్కెట్ కమిటీలు, 1,100 దేవాలయాల ట్రస్ట్ బోర్డుల్లో నియామకాలతో పాటు అన్ని నామినేటెడ్ పోస్టులను వచ్చే జూన్ లోగా భర్తీ చేస్తామని చెప్పారు. ఈ పదవులు పొందిన వారి పనితీరును సమీక్షించి, భవిష్యత్తు అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. ఆయా పోస్టులకు అర్హులైన వారి పేర్లతో జాబితా పంపించాలని ఎమ్మెల్యేలకు సూచించారు. మంగళవారం పార్టీ నేతలతో జరిగిన టెలీకాన్ఫరెన్స్ లో చంద్రబాబు ఈమేరకు సూచనలు చేశారు. నామినేటెడ్ పదవులు ఆశించేవారు తప్పనిసరిగా పార్టీ క్లస్టర్, యూనిట్, బూత్, సెక్షన్‌లలో సభ్యులై ఉండాలని చెప్పారు.
ఇంకా చదవండి: ఏప్రిల్ నెల లోపు ఆ పనులు పూర్తి! ఇకపై హైదరాబాద్ నుండి వైజాగ్ మరింత సులువుగా!
మొదటి నుంచీ పార్టీని నమ్ముకున్న వారికి పదవులు దక్కేలా చూడాల్సిన బాధ్యత ఎమ్మెల్యేలదేనని అన్నారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఘన విజయానికి కారణం కార్యకర్తలేనని, అలాంటి కార్యకర్తలను మరవొద్దని పార్టీ నేతలకు చంద్రబాబు హితవు పలికారు. కార్యకర్తలను ఎల్లప్పుడూ గౌరవించాలని చెప్పారు. పార్టీ కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొనాలంటూ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలకు సూచించారు. కార్యకర్తలు, ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండాలని అన్నారు. ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చేలా పనిచేయాలని, ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పారు. ఎన్నికల హామీలు అన్నింటినీ అమలుచేస్తామని చెబుతూ వైసీపీ తప్పుడు ప్రచారాన్ని ఎండగట్టాలని అన్నారు.
ఇంకా చదవండి: ఇందులో సభ్యులుగా ఉంటేనే నామినేటెడ్ పదవులు! నేతలకు చంద్రబాబు కండిషన్.. ప్రభుత్వం కీలక నిర్ణయం!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
ఏపీలో మరో ఫ్లై ఓవర్‌కు గ్రీన్ సిగ్నల్! కేంద్ర మంత్రి ప్రకటన! ఆ రూట్ లోనే!
ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం! భూముల రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపు.. ఆ 29 గ్రామాల్లో మాత్రం పెరగవు..
గుడ్ న్యూస్.. చంద్రబాబు పలు పథకాల అమలకు సంబంధించి కీలక వ్యాఖ్యలు! అకౌంట్లోకి రూ.15,000లు..
విజయసాయిరెడ్డి రాజీనామా వెనుక కారణాలు వెల్లడించిన కేతిరెడ్డి! ఆ సమయంలో కొన్ని తప్పులు..!
తీవ్ర ఉద్రిక్తత.. వైసీపీ, టీడీపీ నేతల మధ్య ఘర్షణ.. రెండు కార్లు, నాలుగు ద్విచక్ర వాహనాలు!
డ్వాక్రా మహిళల కోసం సర్కార్ భారీ ప్రణాళిక! లక్షల కుటుంబాలకు సోలార్ రూఫ్ టాప్ సౌకర్యం!
దిమ్మతిరిగే ఆఫర్.. రూ.15 వేల స్మార్ట్‌ఫోన్ ఎంత తక్కువకి వస్తుందో.. లక్కీ ఛాన్స్ గురు..
షాక్ షాక్ షాక్... జగన్ గూబగుయ్యుమనిపించిన నంబర్ టు, నంబర్ త్రీ! రాజకీయాల నుంచి అవుట్!
శుభవార్త చెప్పిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం! ఫిబ్రవరి 1న కొత్త పథకం ప్రారంభం!
కేంద్ర ప్రభుత్వం 139 మందికి పద్మ పురస్కారాలు.. ఆ వివరాలు మీకోసం!
మూడో మేనిఫెస్టో విడుదల చేసిన అమిత్ షా! 62 వేల గ్రూపుల సలహాలు, సూచనలు..
విజయసాయిరెడ్డి రాజీనామాపై చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు! పార్టీ పరిస్థితి కూడా..
ఈ విషయంలో భారతీయుల గుండెల్లో గుబులు! అమెరికా వద్దంటే.. ఈ దేశాలు రారమ్మంటున్నాయ్.. ఆ వివరాలు..
రైతులకు ప్రభుత్వం భారీ శుభవార్త! వారి అకౌంట్లలోకి రూ.53 వేలు జమ!
ఎమ్మెల్యే పై టమాటాలు, గుడ్లు విసిరిన జనం.. దీంతో గ్రామసభలో ఉద్రిక్తత!
ఢిల్లీ నుంచి విజయవాడ బయల్దేరిన చంద్రబాబు! 2025-26 కేంద్ర బడ్జెట్లో ఏపీకి..
ప్రభుత్వ పాఠశాలలో నా బర్త్ డే వేడుకలు.. లోకేశ్ ఆసక్తికర వ్యాఖ్యలు! బాధ్యులపై వెంటనే చర్యలు..
మంత్రికి తప్పిన ప్రమాదం.. కాన్వాయ్ లో ఒకదానికొకటి ఢీ కొన్న ఎనిమిది వాహనాలు!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: