ఆంధ్రప్రదేశ్‌లో మరో కొత్త ఫ్లై ఓవర్‌కు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ఈ మేరకు కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కీలక ప్రకటన చేశారు. గుంటూరు ప్రజల ట్రాఫిక్ కష్టాలను నివారించడానికి మూడో రైల్వే ఫ్లై ఓవర్ మంజూరైనట్లు తెలిపారు. గుంటూరుకు సంబంధించి శంకర్ విలాస్, ఇన్నర్ రింగురోడ్డు వంతెనలు ఇప్పటికే మంజూరైన సంగతి తెలిసిందేనని.. తాజాగా గుంటూరు-నల్లపాడు మధ్య మరో పైవంతెనను (ఫ్లైఓవర్) తీసుకొచ్చినట్లు చెప్పారు. ఈ ఫ్లై ఓవర్‌తో గుంటూరు ప్రజల ట్రాఫిక్ కష్టాలు తీరుతాయన్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో మరో కొత్త ఫ్లై ఓవర్‌కు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ఈ మేరకు కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కీలక ప్రకటన చేశారు. గుంటూరు ప్రజల ట్రాఫిక్ కష్టాలను నివారించడానికి మూడో రైల్వే ఫ్లై ఓవర్ మంజూరైనట్లు తెలిపారు. గుంటూరుకు సంబంధించి శంకర్ విలాస్, ఇన్నర్ రింగురోడ్డు వంతెనలు ఇప్పటికే మంజూరైన సంగతి తెలిసిందేనని.. తాజాగా గుంటూరు-నల్లపాడు మధ్య మరో పైవంతెనను (ఫ్లైఓవర్) తీసుకొచ్చినట్లు చెప్పారు. ఈ ఫ్లై ఓవర్‌తో గుంటూరు ప్రజల ట్రాఫిక్ కష్టాలు తీరుతాయన్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్‌లు దావోస్‌లో జరిగిన వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సదస్సుతో పారిశ్రామికవేత్తల్లో రాష్ట్రం విషయంలో సానుకూల వాతావరణం సృష్టించగలిగారు అన్నారు. కానీ చంద్రబాబు దావోస్ పర్యటనపై కొందరు జగన్ అభిమానులు దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు, లోకేష్‌లో దావోస్ పర్యటనతో అతితక్కువ సమయంలో పలు ప్రముఖ కంపెనీల సీఈవోలను కలిసి రాష్ట్రంలో ప్రస్తుతం సానుకూల అంశాలను వివరించారన్నారు. త్వరలోనే రాష్ట్రానికి రూ.లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయని.. టీసీఎస్‌తో పాటుగాశ్రీసిటీలో 11 ప్రాజెక్టులు, హెచ్‌సీఎల్ సెకండ్ ఫేజ్, రిలయన్స్, ఆర్సెలార్ మిత్తల్‌లు రాష్ట్రంలో వారి సంస్థలు ఏర్పాటుచేసేలా మంత్రి లోకేష్ ఒప్పించారని ప్రశంసించారు.
ఇంకా చదవండి: నామినేటెడ్ పదవుల భర్తీకి కూటమి ప్రభుత్వం కీలక చర్యలు! ఇవాళ రెపట్లో జాబితా విడుదల!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
విశాఖపట్నం-చెన్నై పారిశ్రామిక కారిడార్ (వీసీఐసీ)లో మొదటి దశకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నారు. సదరన్ రీజియన్‌లో పారిశ్రామిక అవసరాలకు నీటి సరఫరా కోసం సబ్ ప్రాజెక్టుకు రూ.766.25 కోట్లతో ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. అయితే రివైజ్డ్ అంచనాలకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ముందు రూపొందించిన అంచనా ప్రకారం రూ.689.70 కోట్లతో ప్రాజెక్టు పనులను ఏపీఐఐసీ ప్రతిపాదించింది. ఆ తర్వాత 2017లో అప్పటి ధరల ప్రకారం ప్రాజెక్టు అంచనాలను రూ.712.65 కోట్లకు సవరించారు.
మరోవైపు రామాయపట్నం పోర్టు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ప్రతాప్ సూర్యనారాయణరెడ్డిని నియమించింది ప్రభుత్వం. ఆయన ఏడాది పాటు ఆయన కొనసాగుతారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. రాష్ట్ర కేంద్ర విద్యుత్ పంపిణీ సంస్థ (సీపీడీసీఎల్) సీఎండీగా ఏకేబీ భాస్కర్‌కు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించింది ప్రభుత్వం.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
విజయసాయిరెడ్డి రాజీనామా వెనుక కారణాలు వెల్లడించిన కేతిరెడ్డి! ఆ సమయంలో కొన్ని తప్పులు..!
తీవ్ర ఉద్రిక్తత.. వైసీపీ, టీడీపీ నేతల మధ్య ఘర్షణ.. రెండు కార్లు, నాలుగు ద్విచక్ర వాహనాలు!
డ్వాక్రా మహిళల కోసం సర్కార్ భారీ ప్రణాళిక! లక్షల కుటుంబాలకు సోలార్ రూఫ్ టాప్ సౌకర్యం!
దిమ్మతిరిగే ఆఫర్.. రూ.15 వేల స్మార్ట్‌ఫోన్ ఎంత తక్కువకి వస్తుందో.. లక్కీ ఛాన్స్ గురు..
షాక్ షాక్ షాక్... జగన్ గూబగుయ్యుమనిపించిన నంబర్ టు, నంబర్ త్రీ! రాజకీయాల నుంచి అవుట్!
శుభవార్త చెప్పిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం! ఫిబ్రవరి 1న కొత్త పథకం ప్రారంభం!
కేంద్ర ప్రభుత్వం 139 మందికి పద్మ పురస్కారాలు.. ఆ వివరాలు మీకోసం!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: