వైసీపీ ముఖ్య నేత సాయిరెడ్డి రాజకీయాల నుంచి తప్పుకోవటం సంచలనంగా మారింది. వైసీపీలో నెంబర్ టూ గా వ్యవహరించిన సాయిరెడ్డి ఆసక్మిక నిర్ణయం వెనుక కారణం ఏంటనేది రాజకీయం గా ఆసక్తిని పెంచుతోంది. ఇందులో ఢిల్లీ రాజకీయం ఉందనే చర్చ సాగుతోంది. కానీ, సాయిరెడ్డి తాను ఏ పార్టీలో చేరటం లేదని స్పష్టం చేసారు. సాయిరెడ్డి నిర్ణయం పైన కూటమి నేతలు సైతం స్పందిస్తున్నారు. కాగా, తాజాగా వైసీపీ ముఖ్య నేత కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఈ అంశం పైన ఆసక్తి కర విశ్లేషణ చేసారు. కీలక అంశాలను ప్రస్తావించారు.
కేతిరెడ్డి వ్యాఖ్యలతో
రాజకీయాలకు దూరంగా ఉండాలనే నిర్ణయం సాయిరెడ్డి నిర్ణయం వైసీపీలో కలకలం రేపుతోంది. జగన్ వద్దని చెప్పినా.. తాను తప్పని పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సాయిరెడ్డి రాజీనామా సమయంలో వెల్లడించారు. ఆ తరువాత వైసీసీ సైతం సాయిరెడ్డి నిర్ణయం పైన స్పందించింది. అయితే, వైసీపీలో ఉన్న పరిస్థితుల కారణంగానే సాయిరెడ్డి కొనసాగలేక పోయారంటూ కూటమి ముఖ్య నేతలు జగన్ ను టార్గెట్ చేస్తున్నారు. తాజాగా మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఈ విషయం పైన స్పందించారు. వైసీపీలో జగన్కు విజయసాయి అత్యంత నమ్మకమైన వ్యక్తి గా పేర్కొన్నారు. ఢిల్లీలో జగన్ వ్యవహారాలను సాయిరెడ్డి పర్యవేక్షించే వారని వివరించారు.
ఇంకా చదవండి: విజయసాయిరెడ్డి రాజీనామాపై స్పందించిన వైసీపీ అధిష్టానం! సంచలన వ్యాఖ్యలు!
అసలు కారణం ఇదేనా
వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత విజయ సాయిరెడ్డికి కీలక మైన ఉత్తరాంధ్ర బాధ్యతలు ఇచ్చారని గుర్తు చేసారు. ఆ బాధ్యతల నిర్వహణ సమయంలో కొన్ని తప్పులు జరిగి ఉంటాయని కేతిరెడ్డి అభిప్రాయ పడటం ఇప్పుడు పార్టీలో కొత్త చర్చకు కారణమైంది. అదే విధంగా సాయిరెడ్డి నిర్ణయం వెనుక కాకినాడ సెజ్ వివాదం ఉందని కేతిరెడ్డి చెప్పటం సంచలనంగా మారింది. కొంత కాలంగా కేంద్రంలోని ముఖ్యులు పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటుగా.. పలు పార్టీల నేతలను ఈడీ.. సీబీఐ తో టార్గెట్ చేస్తున్నారని చెప్పుకొచ్చారు. ఈ అంశంలో సాయిరెడ్డి అతీతుడు గా చూడలేమని కేతిరెడ్డి వ్యాఖ్యానించారు. సాయిరెడ్డి ఖండించినా.. ఇదే అసలు విషయంగా తాను భావిస్తున్నానని పేర్కొన్నారు.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
సాయిరెడ్డి మినహాయింపు కాదు
ఈ అంశం మినహా సాయిరెడ్డి ఆకస్మిక నిర్ణయం వెనుక కారణాలు లేవని కేతిరెడ్డి అభిప్రాయ పడ్డారు. కాగా, సాయిరెడ్డి మాత్రం తాను రాజకీయాల నుంచి తప్పుకుంటే కేసుల్లో బలహీనుడిని అవుతానని.. కేసుల అంశంగా తాను తప్పుకోవటం లేదని చెప్పుకొచ్చారు. జగన్ కేసుల్లో సాయిరెడ్డి అప్రూవర్ గా మారుతారనే వ్యాఖ్యలను ఖండించారు. తాను వెన్నుపోటు పొడిచే వ్యక్తిని కాదని తేల్చి చెప్పారు. తనకు సెరికల్చర్ పైన ఆసక్తి ఉందని.. ఇక, వ్యవసాయం చేసుకుంటానని సాయిరెడ్డి వెల్లడించారు. అయితే, సాయిరెడ్డి వ్యవహారంలో బీజేపీ పాత్ర పైన రాజకీయంగా ఆసక్తి కర చర్చ సాగుతోంది. కొద్ది రోజుల్లో ఏపీలో రాజకీయంగా కీలక పరిణామాలు చోటు చేసుకుందనే అవకాశం ఉందనే అంచనాలు వ్యక్తం అవుతున్నాయి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
మూడో మేనిఫెస్టో విడుదల చేసిన అమిత్ షా! 62 వేల గ్రూపుల సలహాలు, సూచనలు..
విజయసాయిరెడ్డి రాజీనామాపై చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు! పార్టీ పరిస్థితి కూడా..
ఈ విషయంలో భారతీయుల గుండెల్లో గుబులు! అమెరికా వద్దంటే.. ఈ దేశాలు రారమ్మంటున్నాయ్.. ఆ వివరాలు..
రైతులకు ప్రభుత్వం భారీ శుభవార్త! వారి అకౌంట్లలోకి రూ.53 వేలు జమ!
ఎమ్మెల్యే పై టమాటాలు, గుడ్లు విసిరిన జనం.. దీంతో గ్రామసభలో ఉద్రిక్తత!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: