సత్యసాయి జిల్లా ధర్మవరంలో ఆదివారం వైకాపా, టీడీపీ శ్రేణుల మధ్య ఘర్షణ చోటుచేసుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఘర్షణలో రాళ్ల దాడికి పాల్పడటంతో రెండు కార్లు, నాలుగు ద్విచక్ర వాహనాలు ధ్వంసమయ్యాయి. పలువురు గాయపడ్డారు. వైకాపా మైనార్టీ నాయకుడు జమీర్ భాజపాలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. నియోజకవర్గ ఎమ్మెల్యే, మంత్రి సత్యకుమార్ సమక్షంలో సోమవారం జమీర్ తన అనుచరులతో భాజపాలో చేరనున్నారు. ఈ నేపథ్యంలో జమీర్ అనుచరులు భారీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయితే జమీర్ భాజపాలో చేరడాన్ని నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జి పరిటాల శ్రీరామ్ వర్గీయులు వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇంకా చదవండి: డ్వాక్రా మహిళల కోసం సర్కార్ భారీ ప్రణాళిక! లక్షల కుటుంబాలకు సోలార్ రూఫ్ టాప్ సౌకర్యం!
ఈ క్రమంలోనే జమీర్ వర్గం ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను కొందరు చింపివేయడంతో వివాదం మొదలైంది. ధర్మవరంలోని పల్లకి సర్కిల్ రోడ్డులో టీడీపీ వర్గీయుల వాహనాలపై జమీర్ అనుచరులు దాడి చేశారు. స్థానికులు డయల్ 100కు ఫోన్ చేసి సమాచారం అందించడంతో పోలీసులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. పోలీసుల ఎదుటే ఇరువర్గాలు బాహాబాహీకి దిగడంతో పలువురు టీడీపీ నాయకులు గాయపడ్డారు. కొన్ని వాహనాలు ధ్వంసమయ్యాయి. పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు. గాయపడిన వారిని ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇంకా చదవండి: వైసీపీకి మరో షాక్.. సాక్షిపై పరువు నష్టం కేసు! నారా లోకేష్ కీలక నిర్ణయం..
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
దిమ్మతిరిగే ఆఫర్.. రూ.15 వేల స్మార్ట్‌ఫోన్ ఎంత తక్కువకి వస్తుందో.. లక్కీ ఛాన్స్ గురు..
షాక్ షాక్ షాక్... జగన్ గూబగుయ్యుమనిపించిన నంబర్ టు, నంబర్ త్రీ! రాజకీయాల నుంచి అవుట్!
శుభవార్త చెప్పిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం! ఫిబ్రవరి 1న కొత్త పథకం ప్రారంభం!
కేంద్ర ప్రభుత్వం 139 మందికి పద్మ పురస్కారాలు.. ఆ వివరాలు మీకోసం!
మూడో మేనిఫెస్టో విడుదల చేసిన అమిత్ షా! 62 వేల గ్రూపుల సలహాలు, సూచనలు..
విజయసాయిరెడ్డి రాజీనామాపై చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు! పార్టీ పరిస్థితి కూడా..
ఈ విషయంలో భారతీయుల గుండెల్లో గుబులు! అమెరికా వద్దంటే.. ఈ దేశాలు రారమ్మంటున్నాయ్.. ఆ వివరాలు..
రైతులకు ప్రభుత్వం భారీ శుభవార్త! వారి అకౌంట్లలోకి రూ.53 వేలు జమ!
ఎమ్మెల్యే పై టమాటాలు, గుడ్లు విసిరిన జనం.. దీంతో గ్రామసభలో ఉద్రిక్తత!
ఢిల్లీ నుంచి విజయవాడ బయల్దేరిన చంద్రబాబు! 2025-26 కేంద్ర బడ్జెట్లో ఏపీకి..
ప్రభుత్వ పాఠశాలలో నా బర్త్ డే వేడుకలు.. లోకేశ్ ఆసక్తికర వ్యాఖ్యలు! బాధ్యులపై వెంటనే చర్యలు..
మంత్రికి తప్పిన ప్రమాదం.. కాన్వాయ్ లో ఒకదానికొకటి ఢీ కొన్న ఎనిమిది వాహనాలు!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: