దేశంలోనే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ లో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టనున్న స్కిల్ సెన్సస్ కు సంబంధించి తొలి అడుగు పడింది. నిన్న మంగళగిరి నియోజకవర్గంలో స్కిల్ సెన్సస్ పైలట్ ప్రాజెక్టు ప్రారంభమైంది. ఏపీ మంత్రి నారా లోకేశ్ ప్రాతినిధ్యం వహిస్తున్న మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గంతోపాటు తుళ్లూరు మండలంలోనూ నిన్న స్కిల్ సెన్సస్ చేపట్టారు. మంగళగిరి నియోజకవర్గంలో 1,35,914 గృహాలు, తుళ్లూరు మండలంలో 25,507 గృహాలు కలిపి మొత్తం 1,61,421 కుటుంబాల నుంచి 675 మంది ఎన్యుమరేటర్లు స్కిల్ సెన్సస్ లో భాగంగా వివరాలు సేకరించారు. గ్రామ సచివాలయాలు, స్కిల్ డెవలప్ మెంట్ శాఖ, సీడాప్, న్యాక్ విభాగాల సిబ్బంది స్కిల్ సెన్సస్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని స్కిల్ డెవలప్ మెంట్ విభాగం ప్రధాన కార్యాలయం నుంచి పర్యవేక్షిస్తున్నారు.
రేషన్ కార్డు ఉన్న వారికి శుభవార్త.. ప్రభుత్వం కీలక ప్రకటన! ఈ పంపిణీ ద్వారా రాష్ట్రంలో!
పైలట్ ప్రాజెక్టులో ఏమైనా లోపాలు గమనిస్తే సరిదిద్ది రాష్ట్రవ్యాప్తంగా స్కిల్ సెన్సస్ ప్రక్రియను ప్రారంభిస్తారు. యువతలో నైపుణ్యాలను గుర్తించి, అవసరమైన నైపుణ్యాభివృద్ధి అందించడం ద్వారా మెరుగైన ఉద్యోగావకాశాలు కల్పించడం స్కిల్ సెన్సస్ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యం. ప్రభుత్వ, ప్రైవేటు రంగాలలో ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం ఈ దిశగా ఒక్కో అడుగు ముందుకు వేస్తోంది. పరిశ్రమలతో ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీల అనుసంధాన ప్రక్రియ, ఐటీఐ కాలేజీల్లో ఉద్యోగాల కల్పన లక్ష్యంగా, శిక్షణ, నియోజకవర్గాల వారీగా ప్రతి నెలా జాబ్ మేళా నిర్వహణ చేపట్టి ఉద్యోగాలు కల్పించనున్నారు. ఎంత మంది నిరుద్యోగులున్నారు? వారి నైపుణ్యాలు ఏంటి? వారు ఏ వయస్సు వారు? ఏ ప్రాంతంలో ఉద్యోగం-ఉపాధి కోరుకుంటున్నారు? అనే అంశాలు స్కిల్ సెన్సస్ ద్వారా సేకరించి...వీరందరికీ మెరుగైన ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే బృహత్తర కార్యక్రమానికి తొలి అడుగు పడింది.
ఇంకా చదవండి: గల్ఫ్ కి వెళ్లాలని కోరికతో ట్రాప్ లో పడుతున్న తెలుగు ఆడపడుచులు! ఏజెంట్ల గుట్టు రట్టు! అసలు ఎందుకు ఇలా జరుగుతుంది? 10
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
ఏపీ మహిళలకు దసరా కానుక! సీఎం చంద్రబాబు అదిరిపోయే గిఫ్ట్! ఇందులో మహిళలు 40 శాతం!
టీడీపీ కేంద్రంలో అర్జీల స్వీకరణలో నూతన కోణం! ప్రజల సమస్యలపై ఫోన్లోనే ఆదేశాలు!
న్యూయార్క్ లో వివిధ రంగాల ప్రముఖులతో రాష్ట్ర మంత్రి భేటీ! పలు అంశాలపై చర్చ!
దారుణ హత్యకు దారితీసిన వివాహేతర సంబంధం! అసలు జరిగింది అంటే!
మందు బాబులకు షాక్.. రెండు రోజులు మద్యం దుకాణాలు బంద్! ఈ ఏడాది ఓనం మద్యం విక్రయాలు!
ఏపీ మహిళలకు అలర్ట్.. ఇలా చేస్తే, 3 ఉచిత సిలిండర్లు రావు! ఆయా జిల్లాల్లో ఎంతమంది లబ్దిదారులు!
ఏపీ సచివాలయంలో 28 మంది మిడిల్ లెవల్ ఆఫీసర్స్ బదిలీ! ఎందుకో తెలుసా?
ఎన్టీఆర్ ఫ్యాన్స్ రచ్చ రచ్చ.. థియేటర్ సిబ్బందిని చితకబాదారు! ఎందుకో తెలిస్తే షాక్!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: