ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త మద్యం పాలసీకి ఆమోద ముద్ర వేసినట్లు తెలుస్తోంది. ఈ రోజు (బుధవారం) అమరావతిలోని సచివాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన నిర్వహించిన కేబినెట్ మీటింగ్ లో నూతన మద్యం పాలసీపై సుదీర్ఘ చర్చ జరిపిన అనంతరం వివిధ రాష్ట్రాల్లో ఉన్న మద్యం పాలసీలను అధ్యయనం చేసి తయారుచేసిన మద్యం పాలసీకి ఆమోదం తెలపడం జరిగింది. అలాగే ఈ మధ్య భారీ వర్షాలకు గండ్లు పడి పొంగి పొర్లిన బుడమేరు సమస్యపై కూడా కేబినెట్ సుదీర్ఘ చర్చ జరిపినట్లు తెలుస్తోంది.
ఇంకా చదవండి: శుభవార్త చెప్పిన ప్రభుత్వం.. కొత్త రేషన్ కార్డులకు ముహూర్తం ఖరారు!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఇలాంటి విపత్తులు మరోసారి ఎదురుకాకుండా చేపట్టాల్సిన చర్యలపై మంత్రులంతా తమ తమ అభిప్రాయాలను సీఎం చంద్రబాబుకు తెలియజేశారు. ఈ క్రమంలోనే ఇలాంటి సమస్యలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా అనుసరించాల్సిన కార్యచరణను సిద్ధం చేయాలని చంద్రబాబు సూచించారు. ఇక బీసీలకు 33 శాతం రిజర్వేషన్ పై కూడా చర్చించిన కేబినెట్ దీనిపై అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.
ఇంకా చదవండి: జగన్ స్క్రిప్ట్ తోనే హీరోయిన్ జెత్వానీపై కేసులు నమోదు! తప్పు చేసిన వారు ఎంతటి వ్యక్తులైనా!
ఇవి కాకుండా రాష్ట్రంలో 100 రోజుల కూటమి ప్రభుత్వ పాలనలో తీసుకున్న నిర్ణయాలు, పారిశ్రామిక అభివృద్ధి రేటు, విద్యుత్ సంస్కరణలపై కూడా మంత్రిమండలి చర్చించింది. అనంతరం వరదల సమయంలో కేంద్రం చేసిన సాయానికి మంత్రి మండలి ధన్యవాదాలు తెలిపింది. వరద నష్టంపై, నష్ట పరిహారంపై కూడా అదే స్థాయిలో కేంద్రం ఆదుకోవాలని కోరారు. చివరిగా మంత్రుల గ్రాఫ్, ఎమ్మెల్యేల పని తీరుపై అన్నింటిపై చంద్రబాబు ఆరా తీశారు. ఇక జనసేన అధినేత పవన్ కల్యాణ్ తమ పార్టీ మంత్రుల గ్రాఫ్ ను చంద్రబాబుకు అందజేశారు. అంతేకాకుండా వివిధ మంత్రిత్వ శాఖల నివేదికల అంశం కూడా ప్రస్తావనకు వచ్చినట్లు తెలుస్తోంది.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
వైజాగ్ స్టీల్ ప్లాంట్ పై కేంద్రం ప్లాన్ ఇదే.. తేల్చేసిన పురందేశ్వరి! ఉద్యోగులను ప్రొబేషన్ పై!
మందుబాబులకు కిక్కిచ్చే న్యూస్! తక్కువ ధరకే నాణ్యమైన కొత్త రకం మద్యం! కేబినెట్ సబ్ కమిటీలో!
మోదీకి చంద్రబాబు, రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు! దేశాన్ని పురోగతి దిశగా నడిపించే మనోబలాన్ని..
సిమ్ కార్డుల కోసం కొత్త నిబంధనలు... వివరాలు ఇవిగో! పేపర్ లెస్ వ్యవస్థను తీసుకువచ్చిన డీఓటీ!
ఫ్రీగా ఆధార్ అప్ డేట్... గడువు మరోసారి పొడిగించిన కేంద్రం! ఈ నేపథ్యంలో పదేళ్ల క్రితం నాటి!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: