ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2024 25 ఆర్థిక సంవత్సరానికి సాధారణ బడ్జెట్‌ను సమర్పిస్తూ, NPS వాత్సల్య పథకాన్ని ప్రవేశపెడుతున్నట్లు ప్రకటించారు. ఇప్పుడు.. ఆ ప్రకటనను అమల్లోకి తీసుకొచ్చే పనిలో పడ్డారు. ఆర్థిక మంత్రి ఈ పథకాన్ని 18 సెప్టెంబర్ 2024న ప్రారంభించబోతున్నారు. ఈ పథకానికి సంబంధించిన వివరాలను విడుదల చేస్తారు. 18 ఏళ్లలోపు బాలబాలికల పేరుతో తల్లిదండ్రులు ఎన్‌పీఎస్ వాత్సల్య ఖాతా తీసుకోవచ్చు. NPS వాత్సల్య పథకం కింద.. తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తు కోసం ఎన్‌పీఎస్ వాత్సల్య ఖాతా తీసుకోవచ్చు. పిల్లలు మేజర్లు అయ్యాక ఈ ఖాతా సాధారణ ఎన్‌పీఎస్ (NPS) ఖాతాగా మారుతుందని ఇటీవల ఆర్థిక మంత్రి పేర్కొన్నారు. రిటైర్మెంట్ నాటికి పెద్ద మొత్తంలో కార్పస్ సమకూరుతుంది. ఎన్‌పీఎస్ వాత్సల్య ఖాతా వల్ల చిన్నతనంనుంచే తమ పిల్లలకు నుంచే పొదుపు అలవాటు చేయొచ్చు. సామాజిక భద్రత కొరకు 2004లో ఎన్పీఎస్ పథకాన్ని తీసుకొచ్చారు. ఇది పన్ను ప్రయోజనాలతో పాటు.. దీర్ఘకాలిక పెట్టుబడి పథకంగా బాగా ప్రాచూర్యం పొందింది. దీన్ని ఇప్పుడు మరింత విస్తృత పరుస్తూ మైనర్లకూ వాత్సల్యను అందుబాటులోకి తేవడం గమనార్హం.
ఇంకా చదవండి: జగన్ స్క్రిప్ట్ తోనే హీరోయిన్ జెత్వానీపై కేసులు నమోదు! తప్పు చేసిన వారు ఎంతటి వ్యక్తులైనా!
సుకన్య సమృద్ధి యోజన, పీపీఎఫ్ వంటి మదుపు పథకాలకు ఇది అదనం. NPS వాత్సల్య ఫ్లెక్సిబుల్ కంట్రిబ్యూషన్స్ , ఇన్వెస్ట్‌మెంట్ ఆప్షన్‌లను అందిస్తోంది. తల్లిదండ్రులు పిల్లల పేరు మీద సంవత్సరానికి రూ. 1,000 పెట్టుబడి పెట్టడానికి అనుమతిస్తుంది. ఇది అన్ని ఆర్థిక నేపథ్యాల కుటుంబాలకు అందుబాటులో ఉంటుంది. దీని వల్ల ముందుగానే పెట్టుబడులు పెట్టేందుకు వీలు పడుతుంది. దీంతో చక్రవడ్డీ పొందేందుకు అవకాశం ఉంటుంది. పదవీ విరమణ తర్వాత ఎన్‌పీఎస్ నిధిలో 60 శాతాన్ని ఒకేసారి వెనక్కి తీసుకోవచ్చు. మిగతా 40 శాతంతో తప్పనిసరిగా యాన్యుటీ పథకాలను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. దీని తర్వాత పంఛన్ పొందే వీలుంటుంది. పిల్లల ఆర్థిక భవిష్యత్తు సురక్షితంగా ఉంటుంది .. NPS వాత్సల్య పథకం యొక్క కొత్త కార్యక్రమాలు పిల్లల ఆర్థిక భవిష్యత్తును భద్రపరచడానికి రూపొందించబడిది. ఇది భారతదేశ పెన్షన్ వ్యవస్థలో ఒక ముఖ్యమైన దశగా నిరూపించబడుతుంది. NPS వాత్సల్య పథకం పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ (PFRDA) క్రింద అమలు చేయబడుతుంది. అందరికీ దీర్ఘకాలిక ఆర్థిక ప్రణాళికను , భద్రతను ప్రోత్సహించడానికి భారత ప్రభుత్వ నిబద్ధతను NPS వాత్సల్య ప్రారంభించడం ప్రతిబింబిస్తుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ పథకం భారతదేశం యొక్క భవిష్యత్తు తరాలను మరింత ఆర్థికంగా సురక్షితంగా , స్వతంత్రంగా మార్చడానికి ఒక పెద్ద అడుగు.
75 స్థానాల్లో NPS వాత్సల్య ఈవెంట్‌లు..
NPS వాత్సల్య పథకం ప్రారంభోత్సవం ప్రధాన కార్యక్రమం న్యూఢిల్లీలో నిర్వహించబడుతుంది. అయితే NPS వాత్సల్య కార్యక్రమాలు దేశవ్యాప్తంగా దాదాపు 75 ప్రదేశాలలో ఏకకాలంలో నిర్వహించబడతాయి. ఇతర ప్రాంతాల ప్రజలు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఇందులో పాల్గొంటారు. ఆ ప్రదేశాలలో అర్హులైన మైనర్ లకు PRAN సభ్యత్వం పంపిణీ చేయబడుతుంది.
ఇంకా చదవండి: శుభవార్త చెప్పిన ప్రభుత్వం.. కొత్త రేషన్ కార్డులకు ముహూర్తం ఖరారు!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
వైజాగ్ స్టీల్ ప్లాంట్ పై కేంద్రం ప్లాన్ ఇదే.. తేల్చేసిన పురందేశ్వరి! ఉద్యోగులను ప్రొబేషన్ పై!
మందుబాబులకు కిక్కిచ్చే న్యూస్! తక్కువ ధరకే నాణ్యమైన కొత్త రకం మద్యం! కేబినెట్ సబ్ కమిటీలో!
మోదీకి చంద్రబాబు, రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు! దేశాన్ని పురోగతి దిశగా నడిపించే మనోబలాన్ని..
సిమ్ కార్డుల కోసం కొత్త నిబంధనలు... వివరాలు ఇవిగో! పేపర్ లెస్ వ్యవస్థను తీసుకువచ్చిన డీఓటీ!
ఫ్రీగా ఆధార్ అప్ డేట్... గడువు మరోసారి పొడిగించిన కేంద్రం! ఈ నేపథ్యంలో పదేళ్ల క్రితం నాటి!
ఇచ్చిన మాట నెరవేర్చిన మంత్రి లోకేశ్! ఆ ఊరు వారికి పండగే.. ఇక ఆ సమస్య లేనట్టే!!
ఈ మధ్య కాలంలో కనిపించని సీనియర్ నటి! మెమరీ లాస్ తో బాధపడుతున్నట్టు వెల్లడి!
పరీక్ష లేకుండా నేరుగా రూ.4 లక్షల జీతంతో ఉద్యోగం! ఈ డాక్యుమెంట్లు తీసుకొని ఇక్కడికి వెళ్లండి!
శుభవార్త చెప్పిన ప్రభుత్వం.. కొత్త రేషన్ కార్డులకు ముహూర్తం ఖరారు!
చంద్రబాబు నియోజకవర్గ ఇన్‌ఛార్జులతో కీలక భేటీ! పార్టీ బలోపేతంపై చర్చ!
ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం! మరో పథకం పేరు మార్పు!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: