ప్రతిభావంతులైన యువ క్రీడాకారులకు తాను ఎప్పుడూ అండగా ఉంటానని ఏపీ మంత్రి నారా లోకేశ్ మరోసారి నిరూపించుకున్నారు. తాజాగా, మంగళగిరి నియోజకవర్గానికి చెందిన యువ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు కె.చరణ్ నాయక్ కు ఆర్థిక చేయూతనిచ్చారు. చరణ్ నాయక్ అంతర్జాతీయ స్థాయిలో షటిల్ బ్యాడ్మింటన్ క్రీడలో సత్తా చాటుతున్నాడు. ఆస్ట్రేలియాలో అక్టోబరు 16 నుంచి 20 వరకు... న్యూజిలాండ్ లో 23 నుంచి 26 వరకు జరగనున్న అంతర్జాతీయ ర్యాంకింగ్ పోటీల్లో చరణ్ నాయక్ పాల్గొంటున్నాడు.
ఇంకా చదవండి: రెండ్రోజుల్లో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా! అరవింద్ కేజ్రీవాల్ సంచలన ప్రకటన! దానికి కారణం?
ఈ నేపథ్యంలో, రెండు విదేశీ పర్యటనలు చేయాల్సి రావడంతో, ఈ యువ క్రీడాకారుడు ఆర్థికసాయం కోరుతున్నాడు. నిన్న మంత్రి నారా లోకేశ్ ను కలిసి తన పరిస్థితిని వివరించాడు. చరణ్ నాయక్ గురించి తెలుసుకున్న నారా లోకేశ్.... అతడి విజ్ఞప్తి పట్ల సానుకూలంగా స్పందించారు. 'ప్రైడ్ ఆఫ్ మంగళగిరి' పేరిట అతడికి ఆర్థికసాయం చేశారు. ఈ మేరకు, స్థానిక టీడీపీ నేతల ద్వారా రూ.3 లక్షలు చరణ్ నాయక్ కు అందించారు. లోకేశ్ తనకు ఆర్థికసాయం చేయడం పట్ల ఆ యువ షట్లర్ సంతోషం వ్యక్తం చేశాడు. ఆయనకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశాడు.
ఇంకా చదవండి: కొత్త పెన్షన్లపై గుడ్ న్యూస్ చెప్పిన సీఎం! దరఖాస్తులు ఎప్పటి నుంచంటే? Don't Miss!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
జగన్ ఐదేళ్ల పాలన రాష్ట్రానికి అతి పెద్ద విపత్తు! అర్థంలేని విమర్శలతో కాలక్షేపం చేస్తున్న వైసీపీ!
ఆధార్ ఉచిత అప్‌డేట్ గడువు మరోసారి పొడిగింపు! ఎలా చేయాలో చూసేయండి!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: