వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు జిల్లాల్లో కుండపోత వర్షాలు పడుతున్నాయి. భారీ వర్షాలతో రాష్ట్రం అతలాకుతలం అయింది. పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. భారీ వర్షాల నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. అధికారులు ప్రతి క్షణం అప్రమత్తంగా ఉండాలని, అవసరమైన సహాయక చర్యలకు ప్రభుత్వ సిబ్బంది సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. అన్ని శాఖలు ఫుల్ అలర్ట్ గా ఉండాలని చెప్పారు. భారీ వర్షాలు పడుతున్న అన్ని ప్రాంతాల్లో విద్యా సంస్థలకు సెలవు ప్రకటించాలని ఆదేశించారు.
ఇంకా చదవండి: అలవెన్సుల నిలిపివేత వెనుక ఏదో కుట్ర? ఎన్ఎంయూ లేఖలో సంచలన ఆరోపణలు!
భారీ వర్షాలు పడే ప్రాంతాల ప్రజల మొబైళ్లకు ఎప్పటికప్పుడు అలర్ట్ లు పంపించాలని చంద్రబాబు ఆదేశించారు. వాగులు, వంకల వద్ద హెచ్చరిక బోర్డులు పెట్టాలని.. ప్రజలు ప్రమాదాల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మరోవైపు అల్పపీడనం ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాల వైపు కదులుతూ వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని... దీని ప్రభావంతో పెను వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది. విజయనగరం, శ్రీకాకుళం, మన్యం, అల్లూరి, విశాఖ, అనంతపురం, కడప, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు... మిగిలిన జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. కోస్తా తీరం వెంబడి గంటకు 45 నుంచి 65 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది.
ఇంకా చదవండి: రఘురామ టార్చర్ కేసులో జగన్ కు పిలుపు? అప్పట్లో సీఐడీ కస్టడీలో..
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
మందుబాబులకు అదిరే శుభవార్త! చంద్రబాబు సర్కార్ కీలక నిర్ణయం!
రూ.78 వేలు సబ్సిడీ! సామాన్యులకు కేంద్రం భారీ గుడ్ న్యూస్! మతిపోయే స్కీమ్!
ప్రతీ పరిశ్రమలోనూ ఇలాంటి పరిస్థితులే! నటి ఖుష్బూ కీలక వ్యాఖ్యలు!
ఏపీని హడలెత్తిస్తున్న మంకీఫాక్స్! ప్రభుత్వం కీలక నిర్ణయం!
మీకు రేషన్ కార్డు ఉందా? ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం! త్వరలో ప్రభుత్వ రాజముద్రతో!
జగన్ కు షాక్.. వైసీపీకి రాజీనామా చేసే రాజ్యసభ ఎంపీ! కారణం?
వైసీపీకి వరుస షాక్ లు! బీజేపీ లోకి ఆరుగురు ఎంపీలు!
వైసీపీకి మరో ఎదురుదెబ్బ! పార్టీకి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా!
విషాదం.. అమెరికాలో తెలంగాణ యువకుడి మృతి! అసలు ఏమి జరిగింది అంటే!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: