నాలుగేళ్ల క్రితం పల్నాడు జిల్లాలో టీడీపీ నేతలపై జరిగిన దాడికి సంబంధించి ఆ పార్టీ నేత బుద్దా వెంకన్న ఇవాళ జిల్లా అదనపు ఎస్పీని కలిసి ఫిర్యాదు చేసారు. అప్పట్లో తమపై వైసీపీ నేతలు దాడి చేసినట్లు ఆధారాలు ఉన్నా తమ ఫిర్యాదుల్ని పోలీసులు పట్టించుకోలేదన్నారు. కాబట్టి ఇప్పుడు ఫిర్యాదు చేస్తున్నట్లు బుద్దా వెంకన్న తెలిపారు. అప్పట్లో మాచర్ల ఎమ్మెల్యేగా ఉన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డితో పాటు ఆయన సోదరుడు కలిసి తనతో పాటు పార్టీ నేత బోండా ఉమపై దాడి చేసినట్లు ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. తమపై అప్పట్లో పిన్నెల్లి బ్రదర్స్ ఆకారణంగా దాడి చేశారని గుర్తుచేశారు. ఈ దాడి లో పాత్రధారి తురకా కిషోర్ అయితే సూత్రధారి పిన్నెల్లి అన్నారు. వీరు తమ కారుపై పెద్ద పెద్ద రాళ్లతో కొట్టి దాడి చేసినట్లు తెలిపారు. తమపై దాడి చేసిన వారికి మాచర్ల మున్సిపల్ చైర్మన్ పదవి ఇచ్చారన్నారు. ప్రజల్ని భయబ్రాంతులకు గురి చేయడానికి మాపై దాడి ఒక సంకేతం అని బుద్దా ఆరోపించారు. మాచర్లని అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా పిన్నెల్లి తయారు చేశారని బుద్దా విమర్శించారు. తమపై దాడి చేసినప్పుడు ఏ పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు. అధికారం ఉంటే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అని లేకపోతే పిల్లి రామకృష్ణారెడ్డి అని బుద్దా ఎద్దేవా చేశారు.
ఇంకా చదవండి: కడప ఎస్పీ హర్షవర్ధన్ ను కలిసి ఫిర్యాదు చేసిన దస్తగిరి! తప్పు చేసిన వాళ్లకు శిక్ష!
తమను చంపడానికి పిన్నెల్లి పధకం వేశారని, తనపై దాడి కేసులో పిన్నెల్లి మొదటి ముద్దాయి అని వెల్లడించారు. నీకు మూతి మీద మీసం ఉంటే సరే చూసుకుందాం అంటూ పిన్నెల్లికి బుద్దా సవాల్ విసిరారు. అన్ని ఆలోచించే ఈ కేసు పెట్టానన్నారు. ఈ కేసులో నీకు శిక్ష పడే వరకూ పోరాడుతానంటూ బుద్దా హెచ్చరించారు. అధికారం ఉంది కాబట్టి అప్పుడు పిన్నెల్లి తప్పించుకున్నాడని, తనపై దాడి చేసి ఆ వీడియో క్లిప్పింగ్స్ కూడా వారే బయటకు వదిలారని బుద్దా గుర్తుచేశారు. ఎస్పీకి ఎన్ని సార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు. పవర్ ఉంటే ఒకలా పవర్ లేకపోతే ఒకలా ఉంటారన్నారు. పిన్నెల్లి అనే వాడు ఒక పిల్లి లాంటోడన్నారు. ఒక మంచి పని కోసం తమను చంద్రబాబు మాచర్లకి పంపారని అప్పటి ఘటనను గుర్తుచేసుకున్నారు. పిన్నెల్లి బ్రదర్స్ ప్రజాస్వామ్యoలో తిరగడానికి అనర్హుడన్నారు. పిన్నెల్లి దుర్మాగ్వాలను ఇప్పటికైనా పూర్తిగా అణచివేయాలని పోలీసుల్ని కోరారు.
ఇంకా చదవండి: వైసీపీకి బిగ్ షాక్! టీడీపీలోకి మేయర్ దంపతులు, ఆ 30మంది కూడా!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
విషాదం.. అమెరికాలో తెలంగాణ యువకుడి మృతి! అసలు ఏమి జరిగింది అంటే!
కువైట్‌లో ఏపీ మహిళ ఇక్కట్లు! చిత్రహింసలకు గురిచేస్తున్నారు... నారా లోకేశ్ కాపాడాలని!
ఆమెకు ఆ అధికారం లేదు! కంగనా రనౌత్‌కు బీజేపీ షాక్! భవిష్యత్తులో ఇలాంటి ప్రకటనలు!
మదనపల్లి సబ్ కలెక్టరేట్ లో వేకువజాము వరకూ సీఐడీ తనిఖీలు! దస్త్రాల దహన ఘటనపై!
ఏపీ గుడ్ న్యూస్.. ఈ స్కీమ్ కి మీరు అర్హులా! అయితే ఇప్పుడే అప్లై చేయండి! మీ లైఫ్ సెటిల్ చేసుకోండి!
విజయవాడలో వైసీపీకి గట్టి ఎదురుదెబ్బ! సుజనా చౌదరి సీటులో టీడీపీకి గుడ్ న్యూస్!
పవన్ కళ్యాణ్ కొత్త ట్రెండ్! ఇది ఎవ్వరూ ఊహించి ఉండరు, ఈ నెల 24న పిఠాపురంలో భారీగా!
విద్యార్థులకు అదిరే గుడ్ న్యూస్! ప్రతి నెలా రూ.1,000 అకౌంట్లలోకి! వెంటనే అప్లై చేసుకోండిలా!
పర్యాటకులకు శ్రీలంక గుడ్ న్యూస్! భారత్ సహా 35 దేశాలకు వీసా లేకుండా!
గత ప్రభుత్వ వైఫల్యాలపై పవన్ కల్యాణ్ ఆగ్రహం! 13,326 పంచాయతీల్లో కొత్త మార్పుల వెలుగులు!
దేశాన్ని అదానీ, అంబానీలకు అప్పగించిన మోదీ? రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు!
టీడీపీ రాష్ట్ర కార్యాలయంపై దాడి కేసులో కీలక మలుపు! మంగళగిరిలోని వైసీపీ కేంద్ర కార్యాలయానికి!
ఏపీలో 15వేల సాఫ్ట్ వేర్ ఉద్యోగాలు - గుడ్ న్యూస్ చెప్పిన లోకేష్! ఐటీలో ప్రస్తుతం అంతర్జాతీయంగా!
టీడీపీ కేంద్ర కార్యాలయంలో గ్రీవెన్స్ కార్యక్రమం! వెల్లువెత్తిన విజ్ఞప్తులు!
కోల్‌కతా వైద్యురాలి హత్యాచార ఘటన! వెలుగులోకి మరో సంచలన విషయం!
అందుకే నేను ఎక్కువగా తమిళంలో నటించడం లేదు! సంగీత వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్!
తల్లులకు గుడ్ న్యూస్ చెప్పిన చంద్రబాబు సర్కార్! అకౌంట్లలో రూ.15 వేలు!
ఇంకా ఏం చేస్తే ఇలాంటి సంఘటనల్ని ఆపగలం? కోల్‌కతా హత్యాచార ఘటనపై విజయశాంతి ట్వీట్!
అధ్యక్షుడిగా గెలిస్తే మస్క్ కు కేబినెట్ లో చోటిస్తా! ట్రంప్ ఇచ్చిన బంపర్ ఆఫర్!
టీడీపీ కేంద్ర కార్యాలయంలో గ్రీవెన్స్ కార్యక్రమం! వెల్లువెత్తిన విజ్ఞప్తులు!
ఆధార్ కార్డ్ ఉన్న ప్రతి ఒక్కరికీ అదిరే శుభవార్త! అంగన్‌వాడీ, సచివాలయాల్లో ఈ నెల 20 నుంచి!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: