ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి సీబీఐ అధికారులు షాక్ ఇచ్చారు. మాజీ సీఎం వైయస్ జగన్ విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్వకూడదని కోర్టుకు సీబీఐ మనవి చేసింది. తాను విదేశాలకు వెళ్లడానికి అనుమతి ఇవ్వాలని మాజీ సీఎం వైయస్ జగన్ సీబీఐ ప్రత్యేక కోర్టుకి మనవి చేశారు. యూకేలో చదువుతున్న తన కుమార్తె వద్దకు వెళ్లడానికి తనకు అవకాశం ఇవ్వాలని వైసీపీ అధినేత వైయస్ జగన్ సీబీఐ కోర్టుకు మనవి చేశారు. సీబీఐ కోర్టు ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ టి. రఘురాం సీబీఐ వివరణ కోరుతూ విచారణ వాయిదా వేశారు. బుధవారం సీబీఐ ప్రత్యేక కోర్టులో వాదనలు జరిగాయి. ఈ సందర్భంగా మాజీ సీఎం జగన్ విదేశాలకు వెళ్లడానికి అనుమతి ఇవ్వకూడదని, ఆయన పైన నమోదైన అక్రమాస్తుల కేసు విచారణ ఇంకా పెండింగ్ లో ఉందని, కేసు విచారణ చాలా ఆలస్యం అవుతుందని సీబీఐ కోర్టుకు చెప్పింది. మాజీ సీఎం జగన్ విదేశాలు వెళ్లడానికి అవకాశం ఇవ్వకూడదని సీబీఐ కోర్టుకు మనవి చేసింది. వాదనలు విన్న సీబీఐ కోర్టు ఈనెల 27వ తేదీకి విచారణ వాయిదా వేసింది. ఇప్పటికే అక్రమాస్తుల కేసు విచారణ ఆలస్యం అవుతుందని గతంలో సీఎం హోదాలో ఉన్న జగన్ కేసు విచారణకు హాజరు కాలేదని ఇప్పుడు ఆయన మరోసారి విదేశీ పర్యటనలో ఉంటే కేసు విచారణ ఇంకా ఆలస్యం అయ్యే అవకాశం ఉందని సీబీఐకి చెందిన ఓ అధికారి అంటున్నారని తెలిసింది.
ఇంకా చదవండి: టీడీపీ రాష్ట్ర కార్యాలయంపై దాడి కేసులో కీలక మలుపు! మంగళగిరిలోని వైసీపీ కేంద్ర కార్యాలయానికి!
ఇదే కేసులో నెంబర్ టూగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి కూడా విదేశాలకు వెళ్లడానికి ప్రత్యేక కోర్టు అనుమతి కోరారు. వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి తరఫున ఆయన న్యాయవాది అశోక్ రెడ్డి కోర్టులో వాదనలు వినిపించారు. యూరప్ లో వచ్చే నెల 6వ తేదీ తేదీ నుండి రెండు నెలల పాటు పర్యటించేందుకు అనుమతి ఇవ్వాలని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కోర్టుకు మనవి చేశారు. గతంలో కూడా విజయసాయి రెడ్డి విదేశీ పర్యటనకు వెళ్లడానికి కోర్టు అనుమతి ఇచ్చిందని, ఇప్పుడు కూడా అనుమతి ఇవ్వాలని ఆయన న్యాయవాది అశోక్ రెడ్డి కోర్టుకు మనవి చేశారు. అయితే వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి విదేశీ పర్యటనకు అనుమతి ఇస్తే కోర్టు విచారణ ఆలస్యం అయ్యే అవకాశం ఉందని, ఇప్పటికే కేసు విచారణ ఆలస్యం అయ్యిందని సీబీఐ అధికారులు ప్రత్యేక కోర్టుకు మనవి చేశారు. విజయసాయి రెడ్డి విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్వకూడదని సీబీఐ అధికారులు కోర్టుకి మనవి చేశారు. వాదనలు విన్న కోర్టు వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి విదేశీ పర్యటన పై దాఖలు అయిన పిటిషన్ విచారణ ఈనెల 30వ తేదీకి వాయిదా వేసింది.
ఇంకా చదవండి: కొత్త రేషన్ కార్డులు.. కీలక అప్‌డేట్ ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం! దరఖాస్తు ఆ నెలలో ముగియనుంది!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
ఏపీలో 15వేల సాఫ్ట్ వేర్ ఉద్యోగాలు - గుడ్ న్యూస్ చెప్పిన లోకేష్! ఐటీలో ప్రస్తుతం అంతర్జాతీయంగా!
టీడీపీ కేంద్ర కార్యాలయంలో గ్రీవెన్స్ కార్యక్రమం! వెల్లువెత్తిన విజ్ఞప్తులు!
అందుకే నేను ఎక్కువగా తమిళంలో నటించడం లేదు! సంగీత వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్!
తల్లులకు గుడ్ న్యూస్ చెప్పిన చంద్రబాబు సర్కార్! అకౌంట్లలో రూ.15 వేలు!
ఇంకా ఏం చేస్తే ఇలాంటి సంఘటనల్ని ఆపగలం? కోల్‌కతా హత్యాచార ఘటనపై విజయశాంతి ట్వీట్!
అధ్యక్షుడిగా గెలిస్తే మస్క్ కు కేబినెట్ లో చోటిస్తా! ట్రంప్ ఇచ్చిన బంపర్ ఆఫర్!
టీడీపీ కేంద్ర కార్యాలయంలో గ్రీవెన్స్ కార్యక్రమం! వెల్లువెత్తిన విజ్ఞప్తులు!
ఆధార్ కార్డ్ ఉన్న ప్రతి ఒక్కరికీ అదిరే శుభవార్త! అంగన్‌వాడీ, సచివాలయాల్లో ఈ నెల 20 నుంచి!
18 ఏళ్ల నుంచి 45 ఏళ్ల లోపు మహిళలకు గుడ్ న్యూస్! గొప్ప అవకాశం.. ఇప్పుడు మిస్ చేసుకుంటే ఇక అంతే!
కేశినేని చిన్నికి కీలక పదవి! వచ్చే నెల 8న అధికారిక ప్రకటన!
అక్కాచెల్లెమ్మలకు చంద్రబాబు భారీ శుభవార్త! రక్షాబంధన్ కానుక అదరహో?
రేషన్ కార్డు దారులకు గుడ్‌న్యూస్! మరో కీలక మార్పు! ఇక ఆ సమస్యకు చెక్ చెప్పిన ఏపీ ప్రభుత్వం!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: