గుంటూరు జిల్లా కొలనుకొండ హరేకృష్ణ గోకుల క్షేత్రాన్ని సీఎం చంద్రబాబు నాయుడు సందర్శించారు. వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణంలో భాగంగా అనంతశేష స్థాపన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ చీఫ్ జస్టిస్ తో ఎన్వీరమణతో కలిసి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ మంచి చేసేవారికి ఇక నుంచి రాష్ట్రంలో ఎలాంటి స్పీడ్ బ్రేకర్లు, విధ్వంసాల అడ్డు ఉండదని చెప్పారు. మంచికి చిరునామాగా ఆంధ్రప్రదేశ్ ఉంటుందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా త్వరలో అన్న క్యాంటీన్లను ప్రారంభిస్తామని స్పష్టం చేశారు.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
హరేకృష్ణ సంస్థ నేతృత్వంలో దైవ సేవ, మానవ సేవ రెండూ సమానంగా కొనసాగుతున్నాయని చెప్పారు. ఆధ్మాత్మికతతో మానసిక ఆనందం కలుగుతుందని, లేకపోతే ఏ పని చేయలేమన్నారు. దైవత్వాన్ని ప్రతి ఒక్కరిలోనూ పెంపొందించాలని, టెక్నాలజీని అందిపుచ్చుకుంటూనే ఆధ్యాత్మిక సేవను కొనసాగించాలని సూచించారు. శ్రీవారి దయతోనే తాను అలిపిరి బ్లాస్ట్ నుంచి బయటపడ్డానని తెలిపారు. ప్రపంచానికి సేవలందించాలని తనకు వెంకటేశ్వరస్వామి ప్రాణభిక్ష పెట్టారని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి:
రాజధాని నిర్మాణంపై ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం! ఆ సంస్థలకు బాధ్యతలు!
ఏపీ లో అధ్వాన్నంగా ఉన్న రోడ్డులపై సీఎం చంద్రబాబు దృష్టి! అధికారులకు కీలక ఆదేశాలు!
పంచాయతీ రాజ్ శాఖకు మాస్టర్ ప్లాన్ రూపొందిస్తాం! డిప్యూటీ సీఎం హామీ!
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కీలక పరిణామం! కేజ్రీవాల్ కు భారీ ఊరట!
కవిత డిఫాల్ట్ బెయిల్ పేటీషన్ పై నేడు విచారణ! బెయిల్ వస్తుందా రాదా!
టీ-టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా బ్రాహ్మణి! తెలంగాణపై బాబు ప్రత్యేక ఫోకస్!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: