అస్సాంలో షాకింగ్ ఘటన వెలుగుచూసింది. గౌహతి నగరంలోని జ్యోతికూచి ఏరియాలో కుళ్లిపోయిన స్థితిలో ఉన్న తల్లి మృతదేహంతో ఓ వ్యక్తి ఏకంగా మూడు నెలలు ఇంట్లోనే నివసించాడు. అస్థిపంజరం అవశేషాలు బయటపడడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. చనిపోయింది పూర్ణిమా దేవిగా (75) పోలీసులు గుర్తించారు. మూడు నెలల క్రితం చనిపోయి ఉంటుందని అనుమానిస్తున్నట్లు పోలీసులు చెప్పారు. మృతురాలి కొడుకు పేరు జయదీప్ దేయ్ అని, అతడు మానసిక సమస్యలతో బాధపడుతున్నట్టు ఇరుగుపొరుగు వారు చెప్పారని వివరించారు. కాగా మృతదేహం బయటపడడంతో జయదీప్ దేయ్‌ని పోలీసులు ఆదివారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. అతడిని ప్రశ్నించనున్నట్టు తెలిపారు. ఇక ఆ ఇంటిని ఫోరెన్సిక్ నిపుణులు, పోలీసు బృందం పరిశీలించాయి. అస్థిపంజరానికి శవపరీక్ష నిర్వహించాల్సి ఉందని తెలిపారు. కాగా ఈ కేసుకు సంబంధించి దేయ్ మామ, అమ్మమ్మలను కూడా పోలీసులు ప్రశ్నిస్తున్నారు.
ఇంకా చదవండి: మనస్పర్థలతో చేయి కోసుకున్న ప్రియురాలు! అది చూసి గుండె ఆగి మరణించిన ప్రియుడు! అసలు ఏమి జరిగింది!
ఇరుగుపొరుగు వారు ఏమంటున్నారంటే..
దేయ్ మానసిక సమస్యలతో బాధపడుతున్నాడని, అతడి ప్రవర్తన విచిత్రంగా ఉంటుందని, అందుకే చాలా మంది అతడితో మాట్లాడేవారు కాదని ఇరుగుపొరుగువారు చెబుతున్నారు. తండ్రి బతికి ఉన్నప్పుడు ఆయనను తిట్టేవాడని, ఎవరితోనైనా మాట్లాడటానికి తల్లి బయటికి వస్తే ఆమెను కూడా తిట్టేవాడని వివరించారు. ఇక గత కొన్ని నెలలుగా ఎప్పుడూ ఇంటికి తాళం వేసి ఉంచేవాడని పేర్కొన్నారు. తన తల్లి బాగానే ఉందని, ఇంట్లో నుంచి బయటకు రావడానికి ఇష్టపడడం లేదని కొంతమందికి అతడు చెప్పినట్టు కొందరు చెప్పారు.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
సీఎం చంద్రబాబు సంచలన ప్రకటన! ఇళ్లు కట్టుకోవాలనుకునే వారికి బంపర్ ఆఫర్.!
దోచుకుని దాచుకోవడం మీద ఉన్న శ్రద్ధ! జగన్ పై షర్మిల ఫైర్ - రాజీ చర్చల ప్రచారం వేళ..!
మహిళలకు గుడ్ న్యూస్ చెప్పిన చంద్రబాబు! దీపావళి కానుక అదరహో! ఆ వివరాలు మీ కోసం!!
వైసీపీకి షాక్.. మాజీ మంత్రి పినిపె విశ్వరూప్ కుమారుడు అరెస్ట్! ఎందుకో తెలుసా?
రూ.1 కట్టక్కర్లేదు.. ఏపీలో వీళ్లందరికీ ఉచితంగానే కరెంట్! ప్రభుత్వం మాస్టర్ ప్లాన్!
ఉత్తరాంధ్రకు భారీ వర్షాల సూచన! మత్స్యకారులకు సముద్రంలో వెళ్లవద్దని హెచ్చరిక!
పాకిస్థాన్ యువతిని ఆన్‌లైన్‌లో పెళ్లి చేసుకున్న బీజేపీ కార్పొరేటర్ కొడుకు! పెళ్లి కూతురు తరపువారు!
ఏపీలో మద్యం బాబుల సందడి! ఈ నెల 16 నుంచి రాష్ట్రంలో!
ఆధార్ కార్డ్ ఉన్న వారికి శుభవార్త.. ప్రభుత్వం కీలక ప్రకటన! జిల్లాలలో 5 నుంచి 15 ఏళ్ల వయసు!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: