ఇటీవల మధ్యప్రదేశ్‌లోని ధార్ జిల్లాలో 5 ఏళ్ల బుడ్డోడు తన తండ్రిపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెళ్లాడు. 'మా నాన్న నన్ను నదిలో స్నానం చేసేందుకు వెళ్లకుండా ఆపుతున్నాడు. బయట వీధుల్లో ఆడుకోనివ్వట్లేదు' అని తండ్రిపై పిల్లోడు ఫిర్యాదు చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోలోని దృశ్యాల ఆధారంగా.. ఆ పిల్లవాడు ఫిర్యాదు చేయడానికి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి అక్కడి ఓ కుర్చీపై కూర్చొవడం వీడియోలో ఉంది. అతని ముందు (టేబుల్‌కి ఎదురుగా) ఒక పోలీసు అధికారి కూర్చుని ఉన్నాడు. పోలీసులు అతని పేరు, ఎవరిపై ఫిర్యాదు చేయాలనుకుంటున్నావు, నేరం ఏంటని ఆ బుడ్డోడిని అడగడం వీడియోలో కనిపించింది. ఇక పోలీస్ అధికారికి సమాధానమిస్తూ, పిల్లవాడు తన పేరు చెప్పడం, నదికి వెళ్లకుండా, వీధిలో ఆడుకోవద్దని తండ్రి అడ్డుపడుతున్నాడని వివరించడం మనం వీడియోలో చూడొచ్చు. ఈ వీడియోను సురేష్ సింగ్ అనే ఎక్స్ (గతంలో ట్విట్టర్) ఖాతాదారు షేర్ చేశారు. అతను ఈ వీడియోకు “మధ్యప్రదేశ్‌లోని ధార్‌లో ఐదేళ్ల పిల్లవాడు తన సొంత తండ్రిపై ఫిర్యాదు చేయడానికి పోలీసు స్టేషన్‌కు వెళ్లాడు. నదిలో స్నానానికి వెళ్తున్న చిన్నారిని తండ్రి ఆపి మందలించాడు. కోపంతో ఆ పిల్లవాడు తండ్రికి వ్యతిరేకంగా ఫిర్యాదు చేయడానికి పోలీసు స్టేషన్‌కు చేరుకున్నాడు" అనే క్యాప్షన్ రాయడం జరిగింది. దాంతో బుడ్డోడి వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. నెటిజన్లు తమదైనశైలిలో ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.
ఇంకా చదవండి: కొత్త రేషన్ కార్డులు.. కీలక అప్‌డేట్ ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం! దరఖాస్తు ఆ నెలలో ముగియనుంది!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
ఏపీలో 15వేల సాఫ్ట్ వేర్ ఉద్యోగాలు - గుడ్ న్యూస్ చెప్పిన లోకేష్! ఐటీలో ప్రస్తుతం అంతర్జాతీయంగా!
టీడీపీ కేంద్ర కార్యాలయంలో గ్రీవెన్స్ కార్యక్రమం! వెల్లువెత్తిన విజ్ఞప్తులు!
అందుకే నేను ఎక్కువగా తమిళంలో నటించడం లేదు! సంగీత వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్!
తల్లులకు గుడ్ న్యూస్ చెప్పిన చంద్రబాబు సర్కార్! అకౌంట్లలో రూ.15 వేలు!
ఇంకా ఏం చేస్తే ఇలాంటి సంఘటనల్ని ఆపగలం? కోల్‌కతా హత్యాచార ఘటనపై విజయశాంతి ట్వీట్!
అధ్యక్షుడిగా గెలిస్తే మస్క్ కు కేబినెట్ లో చోటిస్తా! ట్రంప్ ఇచ్చిన బంపర్ ఆఫర్!
టీడీపీ కేంద్ర కార్యాలయంలో గ్రీవెన్స్ కార్యక్రమం! వెల్లువెత్తిన విజ్ఞప్తులు!
ఆధార్ కార్డ్ ఉన్న ప్రతి ఒక్కరికీ అదిరే శుభవార్త! అంగన్‌వాడీ, సచివాలయాల్లో ఈ నెల 20 నుంచి!
18 ఏళ్ల నుంచి 45 ఏళ్ల లోపు మహిళలకు గుడ్ న్యూస్! గొప్ప అవకాశం.. ఇప్పుడు మిస్ చేసుకుంటే ఇక అంతే!
కేశినేని చిన్నికి కీలక పదవి! వచ్చే నెల 8న అధికారిక ప్రకటన!
అక్కాచెల్లెమ్మలకు చంద్రబాబు భారీ శుభవార్త! రక్షాబంధన్ కానుక అదరహో?
రేషన్ కార్డు దారులకు గుడ్‌న్యూస్! మరో కీలక మార్పు! ఇక ఆ సమస్యకు చెక్ చెప్పిన ఏపీ ప్రభుత్వం!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: