సైబర్ నేరగాళ్లు రోజు కొత్త పద్ధతులను ఉపయోగిస్తూ, ప్రజలను మోసం చేస్తున్నారు. ఇటీవల కాలంలో పోలీసుల పేరుతో చేస్తున్న మోసాలు కూడా పెరుగుతున్నాయి. చండీగఢ్‌లో ఓ మహిళను మోసగాళ్లు క్రైమ్ బ్రాంచ్ అధికారులుగా చెప్పి, రూ.80 లక్షలు బదిలీ చేయించుకున్న ఘటన వెలుగులోకి వచ్చింది.
ఇంకా చదవండి: వాట్సాప్ వినియోగదారులకు గుడ్ న్యూస్! వీడియో నోట్ ఫీచర్ త్వరలో అందుబాటులో!
సైబర్ నేరగాళ్ల పన్నాగం: ఛండీగఢ్ నివాసి అయిన మహిళకు ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అని చెప్పి ఒక వ్యక్తి ఫోన్ చేశారు. ఆమె ఆధార్ కార్డు ద్వారా తీసుకున్న సిమ్ కార్డు ద్వారా మనీ లాండరింగ్ జరుగుతోందని, 24 ఫిర్యాదులు ఉన్నాయని పేర్కొన్నారు. దీనిపై భయపడిన మహిళ న్యాయపరమైన ఇబ్బందులు లేకుండా చేయాలని కోరింది.
మోసానికి గురైన మహిళ: నేరగాళ్లు ఆమెకు చెప్పిన బ్యాంకు ఖాతాలో రూ.80 లక్షలు డిపాజిట్ చేయాలని సూచించి, కేసుల్లో నిర్దోషిగా తేలితే ఆ నగదు వెనక్కి ఇస్తామని చెప్పి మోసం చేశారు. ఆ తర్వాత, తాను మోసపోయినట్లు గుర్తించిన మహిళ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఇంకా చదవండి: జింబాబ్వేతో మూడో టీ20... టాస్ గెలిచిన టీమిండియా! వరల్డ్ కప్ ఆడిన జట్టులోని!
పోలీసులు ఇచ్చిన సూచనలు: పోలీసులు ఇటువంటి కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని, నిజమైన పోలీస్ అధికారులు ఎప్పుడూ కూడా ఫోన్ కాల్‌లోనే నేరుగా నగదు డిమాండ్ చేయరని గుర్తించాలని సూచించారు. అదేవిధంగా, ఆధార్ కార్డు వివరాలు, బ్యాంకు ఖాతా నంబర్లు, OTP లను ఎవరికీ వెల్లడించకూడదని చెప్పారు.
నివారణ చర్యలు: అనుమానాస్పద కాల్స్, మెసెజ్‌ల పట్ల అప్రమత్తంగా ఉండాలని, వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఇటువంటి ఘటనల్లో కుటుంబ సభ్యులు, స్నేహితులను సంప్రదించడం ఉత్తమమని చెప్పారు.
ఇంకా చదవండి: పోలీసు కస్టడీలో పిన్నెల్లి రెండవరోజు విచారణ! ఏం చెప్పాడో తెలుసా!
మరిన్ని పాలిటిక్స్ తాజా వార్తలు మరియు ఆసక్తికర వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి:
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
ఇవి కూడా చదవండి:
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో మరో కీలక మలుపు! కేజ్రీవాల్ కు బిగ్ షాక్!
ఆర్ధిక శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష! అప్పులు ఎంతంటే!
ఛీ ఛీ.. విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణికురాలిపై లైంగికదాడికి యత్నం! కిందపడిన బాధితురాలు!
ఉద్యోగాలు పేరుతో మోసాలు పట్ల తస్మాత్ జాగ్రత్త! కార్యక్రమం ద్వారా 44 ఫిర్యాదులు!
సమంతను జైల్లో పెట్టాలన్న డాక్టర్ సిరియాక్! ఇటీవల ప్రత్యామ్నాయ వైద్య విధానాలపై!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: