అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించినట్టుగానే వలసదారులపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. వారిని అత్యంత దారుణంగా వెనక్కి పంపిస్తోంది. తాజాగా పదుల సంఖ్యలో బ్రెజిల్ వలసదారులను వెనక్కి పంపింది. కనీసం నీళ్లు ఇవ్వకుండా, విమానంలో ఏసీ లేకుండా, చేతికి బేడీలు వేసి అత్యంత అవమానకరంగా పంపడంపై ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. తమ పౌరులను అమెరికా వెనక్కి పంపిన తీరుపై బ్రెజిల్ తీవ్రంగా మండిపడింది. ఇది మానవ హక్కులను ఉల్లంఘించడమేనని, దీనిపై వెంటనే వివరణ ఇవ్వాలని డిమాండ్ చేసింది. మానవహక్కులను దారుణంగా అవమానించారని, తమ పౌరులను అవమానకర పరిస్థితుల్లో వెనక్కి పంపారని బ్రెజిల్ విదేశాంగ మంత్రిత్వశాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది. వారు విమానం దిగిన వెంటనే వారి చేతులకున్న బేడీలను తొలగించామని న్యాయశాఖమంత్రి రికార్డో లేవాండోవ్‌స్కీ ఆవేదన వ్యక్తం చేశారు. విమాన ప్రయాణంలో తమకు ఎదురైన దారుణ అనుభవాలను బాధితులు వర్ణించారు. అమెరికాలో తనను ఏడు నెలలు నిర్బంధంలో ఉంచారని కంప్యూటర్ టెక్నీషియన్ ఎడ్గార్ డా సిల్వామౌరా తెలిపారు.
ఇంకా చదవండి: ఆ జిల్లాలో వారిపై చంద్రబాబు ఆగ్రహం! పూర్తి స్థాయి విచారణ జరిపి బాధ్యులపై చర్యలు!
ఆ సమయంలో అక్కడి వాతావరణం దారుణంగా ఉందని చెప్పారు. తాగేందుకు నీళ్లు కూడా ఇవ్వలేదని, కాళ్లు, చేతులు కట్టేసి తమను విమానంలోకి ఎక్కించారని, మరుగుదొడ్లు ఉపయోగించుకునేందుకు కూడా అవకాశం ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. విమానంలో ఏసీని ఆఫ్ చేయడం వల్ల శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు పడ్డామని మరో బాధితుడు లూయిస్ ఆంటోనియో రోడ్రిగెస్ శాంటోస్ తెలిపారు. కాగా, బాధితులను తరలిస్తున్న విమానం బ్రెజిల్‌లోని ఉత్తర నగరమైన మనౌస్‌లో ల్యాండ్ అయింది. అందులో ప్రయాణించిన 88 మంది బ్రెజిల్ పౌరులు చేతులకు బంధనాలతో దిగడంతో అందరూ నిర్ఘాంతపోయారు. వెంటనే వారికి వేసిన బేడీలను తొలగించి వారి గమ్యస్థానాలకు గౌరవంగా తరలించాలని అధ్యక్షుడు లులూ వైమానిక దళాన్ని ఆదేశించారు. అక్రమ వలసలను అరికట్టేందుకు ఎన్నికల ప్రచారంలో చెప్పినట్టుగానే ట్రంప్ కఠిన చర్యలు ప్రారంభించారు. ప్రమాణ స్వీకారం చేసిన మొదటి రోజే ‘దక్షిణ సరిహద్దు వద్ద జాతీయ అత్యవసర స్థితి’ని ప్రకటించి సైన్యాన్ని నియమించారు. ఈ క్రమంలో అమెరికా నిబంధనలను ఉల్లంఘించిన 26 మంది వలసదారులను గ్వాటిమలా పంపారు. తమ పౌరుల విషయంలో అమెరికా వ్యవహరించిన విధానం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని, అమెరికా కఠిన వలస విధానాలు ప్రజలను ఆందోళనకు గురిచేసేలా ఉన్నాయని బ్రెజిల్ ఆందోళన వ్యక్తం చేసింది. అమెరికాకు తన నిరసన వ్యక్తం చేసింది.
ఇంకా చదవండి: వైసీపీకి మరో షాక్.. సాక్షిపై పరువు నష్టం కేసు! నారా లోకేష్ కీలక నిర్ణయం..
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
తీవ్ర ఉద్రిక్తత.. వైసీపీ, టీడీపీ నేతల మధ్య ఘర్షణ.. రెండు కార్లు, నాలుగు ద్విచక్ర వాహనాలు!
డ్వాక్రా మహిళల కోసం సర్కార్ భారీ ప్రణాళిక! లక్షల కుటుంబాలకు సోలార్ రూఫ్ టాప్ సౌకర్యం!
దిమ్మతిరిగే ఆఫర్.. రూ.15 వేల స్మార్ట్‌ఫోన్ ఎంత తక్కువకి వస్తుందో.. లక్కీ ఛాన్స్ గురు..
షాక్ షాక్ షాక్... జగన్ గూబగుయ్యుమనిపించిన నంబర్ టు, నంబర్ త్రీ! రాజకీయాల నుంచి అవుట్!
శుభవార్త చెప్పిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం! ఫిబ్రవరి 1న కొత్త పథకం ప్రారంభం!
కేంద్ర ప్రభుత్వం 139 మందికి పద్మ పురస్కారాలు.. ఆ వివరాలు మీకోసం!
మూడో మేనిఫెస్టో విడుదల చేసిన అమిత్ షా! 62 వేల గ్రూపుల సలహాలు, సూచనలు..
విజయసాయిరెడ్డి రాజీనామాపై చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు! పార్టీ పరిస్థితి కూడా..
ఈ విషయంలో భారతీయుల గుండెల్లో గుబులు! అమెరికా వద్దంటే.. ఈ దేశాలు రారమ్మంటున్నాయ్.. ఆ వివరాలు..
రైతులకు ప్రభుత్వం భారీ శుభవార్త! వారి అకౌంట్లలోకి రూ.53 వేలు జమ!
ఎమ్మెల్యే పై టమాటాలు, గుడ్లు విసిరిన జనం.. దీంతో గ్రామసభలో ఉద్రిక్తత!
ఢిల్లీ నుంచి విజయవాడ బయల్దేరిన చంద్రబాబు! 2025-26 కేంద్ర బడ్జెట్లో ఏపీకి..
ప్రభుత్వ పాఠశాలలో నా బర్త్ డే వేడుకలు.. లోకేశ్ ఆసక్తికర వ్యాఖ్యలు! బాధ్యులపై వెంటనే చర్యలు..
మంత్రికి తప్పిన ప్రమాదం.. కాన్వాయ్ లో ఒకదానికొకటి ఢీ కొన్న ఎనిమిది వాహనాలు!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: