LIVE
Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!  •  Modi: ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు ప్రధాని మోదీ.. యూరప్ దేశాలతో బంధాల బలోపేతమే లక్ష్యం!  •  TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ నెల తిరుమల దర్శన టికెట్ల కోటా షెడ్యూల్ విడుదల!  •  EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్... 8.25 శాతం వడ్డీ డబ్బులు అకౌంట్లలోకి వచ్చేది అప్పుడే!  •  Allu Arjun: రెండు దశాబ్దాల తర్వాత అదే క్రేజ్... 'హ్యాపీ' రీ-రిలీజ్ కలెక్షన్ల సంచలనం!  •  Srisailam: శ్రీశైల క్షేత్రంలో రికార్డు స్థాయి ఆర్థిక ప్రగతి.. బ్యాంకుల్లో వందల కోట్ల భారీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు!  •  Google Maps: గూగుల్ మ్యాప్స్ క్రేజీ అప్‌డేట్.. ఇకపై పెట్రోల్, డీజిల్ ఖర్చులు మిగిలడం ఖాయం!  •  AP CRDA: 0.4 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో రూపుదిద్దుకుంటున్న నీరుకొండ రిజర్వాయర్...  •  Vishaka: ప్రభుత్వ స్కూల్‌గా మారిన విశాఖ విమల విద్యాలయం.. కలెక్టర్, ఎమ్మెల్యే పల్లా చేతుల మీదుగా ప్రారంభం!  •  6G Network: భారత్‌లో 6G సంచలనం.. టెలికాం రంగం రూపురేఖలు మార్చబోతున్న కేంద్ర ప్రభుత్వ మాస్టర్ ప్లాన్!  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
National

APSDMA: ఎండలతో పాటు పిడుగుల హెచ్చరికలు.. ప్రజలకు APSDMA హెచ్చరిక!

APSDMA: రాష్ట్రంలో మారుతున్న వాతావరణ పరిస్థితుల కారణంగా ఎండల తీవ్రత పెరుగుతుందని, అలాగే పిడుగులతో కూడిన అకాల వర్షాలు కూడా పడే అవకాశముందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) హెచ్చరించింది.

AndhraPravasi News Desk 2 min read
APSDMA: ఎండలతో పాటు పిడుగుల హెచ్చరికలు.. ప్రజలకు APSDMA హెచ్చరిక!

ఎండ తీవ్రత, వడగాలులు పట్ల ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి..

గుండె సంబంధిత వ్యాధులు, షుగర్, బీపీ ఉన్నవారు ఎండలో తిరగకుండా ఉండాలి.. 

అమరావతి: రాష్ట్రంలో మారుతున్న వాతావరణ పరిస్థితుల కారణంగా ఎండల తీవ్రత పెరుగుతుందని, అలాగే పిడుగులతో కూడిన అకాల వర్షాలు కూడా పడే అవకాశముందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలని సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ సూచించారు.

ఈ సీజన్‌లో ఇప్పటివరకు నమోదైన అత్యధిక ఉష్ణోగ్రతలు రాష్ట్రంలో ఆందోళన కలిగిస్తున్నాయి. కాకినాడ జిల్లా కరపలో 44.1 డిగ్రీల సెల్సియస్, కడపలో 43.6 డిగ్రీలు నమోదయ్యాయి. మొత్తం 22 జిల్లాల్లో 40 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ముఖ్యంగా కడపలో 19 మండలాలు, నంద్యాలలో 11, మార్కాపురంలో 7, ఎన్టీఆర్ జిల్లాలో 4 మండలాలు కలిపి మొత్తం 67 మండలాల్లో 41 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదైనట్లు అధికారులు తెలిపారు.

రేపు (ఏప్రిల్ 11) పరిస్థితి మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందని తెలిపారు. ఉత్తరాంధ్రలో వడగాల్పులు, కోస్తా మరియు రాయలసీమ జిల్లాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముంది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి, పోలవరం, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో కలిపి 66 మండలాల్లో తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొన్నారు. అదేవిధంగా మరో 79 మండలాల్లో సాధారణ వడగాలుల ప్రభావం ఉండగా, ఆదివారం నాటికి ఈ సంఖ్య 93 మండలాలకు పెరిగే అవకాశం ఉందని తెలిపారు.

శుక్రవారం నమోదైన ఇతర గరిష్ఠ ఉష్ణోగ్రతలు కూడా తీవ్రతను చూపిస్తున్నాయి. పశ్చిమగోదావరి జిల్లా పోడూరులో 42.9°C, తిరుపతి జిల్లా వరదయ్యపాలెంలో 42.8°C, ఎన్టీఆర్ జిల్లా మోగులూరులో 42.6°C నమోదయ్యాయి. కృష్ణా, నంద్యాల జిల్లాల్లో 42.3°C, ఏలూరు, నెల్లూరు జిల్లాల్లో 42.1°C, విజయనగరం జిల్లా తుమ్మికపల్లిలో 42°C నమోదయ్యాయి. కర్నూలు, అనంతపురం, ప్రకాశం, పల్నాడు తదితర జిల్లాల్లో కూడా 41°C పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

ఈ నేపథ్యంలో ప్రజలు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. ఎండలో బయటకు వెళ్లేటప్పుడు తలకు టోపీ ధరించడం, తెలుపు రంగు కాటన్ బట్టలు వేసుకోవడం, కళ్ల రక్షణ కోసం సన్ గ్లాసెస్ ఉపయోగించడం మంచిదని తెలిపారు. వేడిగాలి చెవుల్లోకి వెళ్లకుండా జాగ్రత్త పడాలని సూచించారు. గుండె సంబంధిత వ్యాధులు, షుగర్, బీపీ ఉన్నవారు ఎండలో తిరగకుండా ఉండాలని హెచ్చరించారు. శరీరంలో నీరు తగ్గకుండా నిమ్మరసం, మజ్జిగ, కొబ్బరి నీరు, సాధారణ నీరు ఎక్కువగా తీసుకోవాలని సూచించారు.

మరోవైపు, తెలంగాణ, రాయలసీమ, తమిళనాడు ప్రాంతాలపై కొనసాగుతున్న ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో చెదురుమదురుగా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఈ వర్షాలు పిడుగులతో కూడి ఉండే అవకాశముండటంతో రైతులు, పశు కాపరులు ఉరుములు, మెరుపులు సమయంలో చెట్ల కింద నిలబడకూడదని హెచ్చరించారు.

రాష్ట్రంలో ఒకవైపు ఎండల తీవ్రత, మరోవైపు పిడుగులతో కూడిన వర్షాలు ప్రజలను ఇబ్బందులకు గురి చేసే పరిస్థితి ఏర్పడుతున్నందున, అప్రమత్తంగా ఉండటం అత్యవసరమని APSDMA సూచించింది.

Be the first to react

More Coverage

Ram Mohan Naidu: ఏర్ ఇండియా AI-171 ప్రమాదంపై కొనసాగుతున్న దర్యాప్తు.. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కీలక వ్యాఖ్యలు!

Ram Mohan Naidu: ఏర్ ఇండియా AI-171 ప్రమాదంపై కొనసాగుతున్న దర్యాప్తు.. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కీలక వ్యాఖ్యలు!

Ram Mohan Naidu: ఏర్ ఇండియా విమానం AI-171 ప్రమాద ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని కేంద్ర పౌర విమానయాన శ…

Strait of Hormuz: ఇటీవల దాడుల్లో ముగ్గురు భారతీయుల మృతి.. తాజా దాడి పుకార్లతో ఒమన్ తీరంలో ఒక్కసారిగా ఉత్కంఠ!

Strait of Hormuz: ఇటీవల దాడుల్లో ముగ్గురు భారతీయుల మృతి.. తాజా దాడి పుకార్లతో ఒమన్ తీరంలో ఒక్కసారిగా ఉత్కంఠ!

Strait of Hormuz: ఒమన్‌ తీరంలో భారతీయ సిబ్బందితో ప్రయాణిస్తున్న మరో వాణిజ్య నౌకపై దాడి జరిగిందన్న వా…

Supreme Court: మీనాక్షి నటరాజన్‌కు సుప్రీంకోర్టులో దక్కని ఊరట! రాజ్యసభ నామినేషన్ తిరస్కరణపై పిటిషన్ కొట్టివేత!

Supreme Court: మీనాక్షి నటరాజన్‌కు సుప్రీంకోర్టులో దక్కని ఊరట! రాజ్యసభ నామినేషన్ తిరస్కరణపై పిటిషన్ కొట్టివేత!

Supreme Court: మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభ ఎన్నికలకు కాంగ్రెస్ నేత మీనాక్షి నటరాజన్ దాఖలు చేసిన నామినే…