ఈ ఏడాది విడుదలైన కొన్ని సినిమాలు అంచనాలను మించి వసూళ్లు సాధించగా మరికొన్ని సినిమాలు భారీ ప్రచారం ఉన్నప్పటికీ ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోయాయి. 2025 సంవత్సరం టాలీవుడ్ బాక్సాఫీస్‌కు ప్రత్యేక గుర్తింపు తెచ్చిన సినిమాలు. ప్రేక్షకుల అభిరుచులు మారుతున్న ఈ కాలంలో కథ, నటన, సాంకేతికత కలిసి సినిమాలకు మంచి ఆదరణ తీసుకొచ్చాయి. ముఖ్యంగా సీనియర్ హీరోలతో పాటు యువ హీరోలు కూడా తమ మార్కెట్ సామర్థ్యాన్ని నిరూపించుకోవడం 2025 ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు.
ఈ ఏడాది బాక్సాఫీస్‌ను షేక్ చేసిన సినిమా “దే కాల్ హిమ్ ఓజీ”. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ గ్యాంగ్‌స్టర్ డ్రామా ప్రేక్షకులను థియేటర్లకు పరుగులు పెట్టించింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రూ.325 కోట్లకు పైగా వసూళ్లు సాధించి 2025లో టాలీవుడ్ టాప్ వసూళ్లు చేసిన చిత్రంగా నిలిచింది.
సంక్రాంతి విడుదలైన “సంక్రాంతికి వస్తున్నాం” సినిమా ఫ్యామిలీ ఆడియెన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంది. విక్టరీ వెంకటేశ్ నటన, అనిల్ రావిపూడి దర్శకత్వం కలిసి సినిమాకు పండుగ వాతావరణాన్ని తీసుకొచ్చాయి. ఈ చిత్రం దాదాపు రూ.300 కోట్లకు చేరువగా వసూళ్లు రాబట్టి వెంకటేశ్ కెరీర్‌లోనే అతిపెద్ద విజయంగా నిలిచింది.
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన “గేమ్ ఛేంజర్” భారీ అంచనాలతో విడుదలైంది. శంకర్ దర్శకత్వం కావడంతో హైప్ ఎక్కువగా ఉన్నా, మిక్స్‌డ్ టాక్ వచ్చింది. అయినప్పటికీ చరణ్ క్రేజ్‌తో ఈ సినిమా రూ.198 కోట్లకు పైగా వసూలు చేసి బాక్సాఫీస్ వద్ద నిలకడగా నిలిచింది.
పవర్‌ఫుల్ డైలాగ్స్, యాక్షన్ సీన్లు అభిమానుల శతజయీ బాలయ్య అనిపించుకునే నందమూరి బాలకృష్ణ నటించిన “డాకు మహారాజ్” కూడా మంచి వసూళ్లు సాధించింది. ఈ చిత్రం రూ.130 కోట్లకు పైగా వసూలు చేసి బాలయ్య మార్కెట్‌ను మరోసారి నిరూపించింది. “అఖండ 2” కూడా థియేటర్లలో విజయవంతంగా కొనసాగుతూ రూ.115 కోట్ల మార్క్ దాటింది.
వరుస అపజయాలతో ఉన్న నాగచైతన్య నటించిన “తండేల్” భావోద్వేగ కథతో ప్రేక్షకులను కట్టిపడేసింది. ఈ సినిమా రూ.100 కోట్ల క్లబ్‌లోకి చేరి నాగచైతన్య కెరీర్‌కు మంచి బూస్ట్ ఇచ్చింది. నాని నిర్మాతగా వచ్చిన “కోర్ట్” చిన్న సినిమాగా వచ్చి పెద్ద విజయాన్ని అందుకుంది. కేవలం కథ మీద నమ్మకంతో తెరకెక్కిన ఈ సినిమా రూ.55 కోట్లకు పైగా వసూలు చేయడం విశేషం.
నాచురల్ స్టార్ నాని నటించిన “హిట్ 3” క్రైమ్ థ్రిల్లర్‌గా ప్రేక్షకులను ఆకట్టుకుంది. సైలెంట్‌గా విడుదలైనప్పటికీ, మౌత్ టాక్‌తో భారీ వసూళ్లు సాధించి రూ.120 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. యువ సామ్రాట్ నాగార్జున, ధనుష్ కలిసి నటించిన “కుబేర” క్లాస్ ఆడియెన్స్‌ను మెప్పించి రూ.115 కోట్ల వసూళ్లు రాబట్టింది.
లిటిల్ హాట్ చిత్రం ఎటువంటి ప్రమోషన్ లేకుండానే థియేటర్లలో పాజిటివ్ టాక్‌తో ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.6–7 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. సినీ బ్యాగ్రౌండ్ లేకపోయినా బాల్య నటనతో ఆకట్టుకున్న తేజ సజ్జా నటించిన “మిరాయ్” ఈ ఏడాది అతిపెద్ద సర్ప్రైజ్‌లలో ఒకటిగా నిలిచింది. విజువల్స్, కాన్సెప్ట్ కలిసి ఈ సినిమాను రూ.142 కోట్ల వరకు తీసుకెళ్లాయి