WhatsApp services: వైద్య సేవలు ఇక అరచేతిలోనే.. ఏపీ ప్రభుత్వం నుంచి 'మనమిత్ర' వాట్సాప్ సేవలు ప్రారంభం.! Liquor Price Hike: మందుబాబులకు షాక్.. భారీగా పెరగనున్న మద్యం ధరలు! ప్రీమియం బ్రాండ్ల ఫుల్ బాటిల్‌పై.. Chandrababu: పవన్‌ను పరామర్శించనున్న చంద్రబాబు.. నేడు హైదరాబాద్‌కు పయనం! Praja Vedika: నేడు (02/05) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! AP EV Policy: విశాఖ టు తిరుపతి.. ఐదు నగరాలకు మహర్దశ! రూ. 250 కోట్ల నిధితో మోడల్ ఈ-మొబిలిటీకి లైన్ క్లియర్... Amaravati Works: అమరావతిలో కీలక ఘట్టం... ఎమ్మెల్యే క్వార్టర్స్ ప్రారంభానికి సర్వం సిద్ధం! AP Government: అమరావతి రైతులకు మెగా గిఫ్ట్! కౌలు పెంపు, రుణమాఫీపై ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ! Chandrababu: వైసీపీ కాదు.. అది గొడ్డలి పార్టీ.. జగన్ తీరుపై ముఖ్యమంత్రి సంచలన వ్యాఖ్యలు.! Vizag: విశాఖ ఉక్కుకు కేంద్రం భారీ ప్యాకేజీ.. మరో రూ. 8,097 కోట్ల ఆర్థిక సాయానికి రంగం సిద్ధం.! Guntur Brigde: మరో కొద్ది రోజులే.. శంకర్ విలాస్ బ్రిడ్జ్ పనుల్లో వేగం- కేంద్ర మంత్రి పెమ్మసాని! WhatsApp services: వైద్య సేవలు ఇక అరచేతిలోనే.. ఏపీ ప్రభుత్వం నుంచి 'మనమిత్ర' వాట్సాప్ సేవలు ప్రారంభం.! Liquor Price Hike: మందుబాబులకు షాక్.. భారీగా పెరగనున్న మద్యం ధరలు! ప్రీమియం బ్రాండ్ల ఫుల్ బాటిల్‌పై.. Chandrababu: పవన్‌ను పరామర్శించనున్న చంద్రబాబు.. నేడు హైదరాబాద్‌కు పయనం! Praja Vedika: నేడు (02/05) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! AP EV Policy: విశాఖ టు తిరుపతి.. ఐదు నగరాలకు మహర్దశ! రూ. 250 కోట్ల నిధితో మోడల్ ఈ-మొబిలిటీకి లైన్ క్లియర్... Amaravati Works: అమరావతిలో కీలక ఘట్టం... ఎమ్మెల్యే క్వార్టర్స్ ప్రారంభానికి సర్వం సిద్ధం! AP Government: అమరావతి రైతులకు మెగా గిఫ్ట్! కౌలు పెంపు, రుణమాఫీపై ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ! Chandrababu: వైసీపీ కాదు.. అది గొడ్డలి పార్టీ.. జగన్ తీరుపై ముఖ్యమంత్రి సంచలన వ్యాఖ్యలు.! Vizag: విశాఖ ఉక్కుకు కేంద్రం భారీ ప్యాకేజీ.. మరో రూ. 8,097 కోట్ల ఆర్థిక సాయానికి రంగం సిద్ధం.! Guntur Brigde: మరో కొద్ది రోజులే.. శంకర్ విలాస్ బ్రిడ్జ్ పనుల్లో వేగం- కేంద్ర మంత్రి పెమ్మసాని!

AP Fishermens welfare: మత్స్యకారుల సంక్షేమం: రూ. 10 వేల నుంచి రూ. 20 వేలకు.. ఎస్సీ, ఎస్టీ జాబితాలో.!

AP Fishermens welfare: ఏపీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా బుధవారం శాసనమండలిలో ప్రశ్నోత్తర సమయంలో సభ్యులు అడిగిన ప్రశ్నకు రాష్ట్ర చేనేత, జౌళి శాఖామాత్యులు ఎస్.సవిత స్పందన...

Published : 2026-03-04 14:00:00
  • బీసీలను పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దాలన్నదే సీఎం చంద్రబాబు లక్ష్యం..
     
  • త్వరలో ప్రారంభించబోయే ఆదరణ 3.0లో వడ్డెర్లకు ప్రాధాన్యమిస్తున్నాం..

AP Fishermens welfare: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో 'బీసీలంటే తెలుగుదేశం, తెలుగుదేశమంటే బీసీలు' అనే నినాదం మరోసారి బలంగా వినిపిస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం వెనుకబడిన తరగతుల (BC) అభ్యున్నతి కోసం సరికొత్త ప్రణాళికలతో ముందుకు సాగుతోంది. గత ఐదేళ్ల పాలనలో నిలిచిపోయిన అభివృద్ధిని మళ్లీ పట్టాలెక్కించి, బీసీలను కేవలం ఓటు బ్యాంకుగా కాకుండా 'పారిశ్రామికవేత్తలు'గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా అడుగులు వేస్తోంది. గతంలో చంద్రబాబు ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'ఆదరణ', 'ఆదరణ 2.0' పథకాలు లక్షలాది మంది చేతివృత్తుల వారి జీవితాల్లో వెలుగులు నింపాయి. ఇప్పుడు మరింత ఆధునిక సాంకేతికతతో 'ఆదరణ 3.0' ప్రారంభం కానుంది.

వడ్డెర్లకు ప్రాధాన్యత: ఈ పథకంలో వడ్డెర కులస్తులకు పెద్దపీట వేయనున్నారు. వారికి అవసరమైన ఆధునిక పనిముట్లను ప్రభుత్వం అందజేస్తుంది.
రజకులకు ఆధునికత: బట్టలు ఉతికే కష్టాన్ని తగ్గించేందుకు రజకులకు భారీ వాషింగ్ మిషన్లు, ఇతర ఆధునిక పరికరాలను పంపిణీ చేయబోతున్నారు. 2014-19 మధ్య నిర్మించిన ధోబీఘాట్లకు కొనసాగింపుగా ఈ పథకం ఉండనుంది.

వడ్డెర్ల ఆర్థికాభివృద్ధి కోసం ప్రభుత్వం రెండు కీలక నిర్ణయాలను తీసుకుంది. ఇవి ప్రస్తుతం ఆర్థిక శాఖ పరిశీలనలో ఉన్నాయి:
మైనింగ్ లీజుల్లో వాటా: మైనింగ్ లీజుల కేటాయింపులో వడ్డెర్లకు 15 శాతం రిజర్వేషన్లు కల్పించే ఆలోచనలో ప్రభుత్వం ఉంది.
సీనరేజీ మినహాయింపు: క్వారీయింగ్ రంగంలో వారికి భారం తగ్గించేలా సీనరేజీలో 50 శాతం మినహాయింపు ఇవ్వనున్నారు. ఈ రెండు ఫైళ్లు ఆమోదం పొందితే వడ్డెర్ల జీవితాల్లో భారీ మార్పు రానుంది.

సముద్రంపై వేట సాగించే మత్స్యకారుల (పల్లెకారుల) కష్టాలను గుర్తించిన ప్రభుత్వం వారి సహాయాన్ని రెట్టింపు చేసింది.
వేట నిషేధ కాలం సాయం: చేపల వేట నిషేధ సమయంలో ఇచ్చే ఆర్థిక సాయాన్ని రూ. 10 వేల నుండి రూ. 20 వేలకు పెంచారు. దీనివల్ల రాష్ట్రంలోని 1.20 లక్షల మత్స్యకార కుటుంబాలకు లబ్ధి చేకూరుతుంది.
డీజిల్ సబ్సిడీ & బీమా: పడవల కోసం వాడే లీటర్ డీజిల్‌పై రూ. 9 సబ్సిడీ ఇస్తున్నారు. ఒకవేళ ప్రమాదవశాత్తూ మత్స్యకారుడు మరణిస్తే వారి కుటుంబానికి రూ. 10 లక్షల బీమా సదుపాయం కల్పించారు.
విద్య & మౌలిక వసతులు: మత్స్యకారుల పిల్లల కోసం ప్రత్యేక గురుకుల పాఠశాలలు నిర్వహించడంతో పాటు, పడవల మరమ్మతుల కోసం ఏకంగా రూ. 30 కోట్లు కేటాయించారు.

ఎస్సీ, ఎస్టీ జాబితాలో చేరిక: కమిటీల నివేదికల కోసం నిరీక్షణ
వడ్డెర్లను, మత్స్యకారులను, రజకులను మరియు వాల్మీకిలను ఎస్సీ, ఎస్టీ జాబితాలో చేర్చాలనేది దశాబ్దాల కాలం నాటి డిమాండ్. దీనిపై ప్రభుత్వం సానుకూల వైఖరితో ఉంది.
గత ప్రభుత్వ నిర్లక్ష్యం: 2014-19 మధ్య ఈ అంశంపై అధ్యయనం చేయడానికి చంద్రబాబు ప్రభుత్వం కమిటీలను వేస్తే, ఆ తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం వాటిని నిర్వీర్యం చేసిందని కూటమి నేతలు ఆరోపిస్తున్నారు.
ప్రస్తుత స్థితి: ఈ కులాలను ఎస్సీ, ఎస్టీ జాబితాలో చేర్చే అంశంపై కమిటీల నివేదికలు రాగానే తదుపరి చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం తెలిపింది. అయితే, తుది నిర్ణయం తీసుకోవాల్సింది కేంద్ర ప్రభుత్వమేనని, ఆ దిశగా ఒత్తిడి తెస్తామని స్పష్టం చేసింది.

Spotlight

Read More →