LIVE
Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!  •  Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!  •  Modi: ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు ప్రధాని మోదీ.. యూరప్ దేశాలతో బంధాల బలోపేతమే లక్ష్యం!  •  Promotions: దేవాదాయ శాఖలో భారీ ప్రమోషన్లు.. గ్రేడ్-1 ఆఫీసర్లుగా 26 మంది ఈఓలకు పదోన్నతులు!  •  TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ నెల తిరుమల దర్శన టికెట్ల కోటా షెడ్యూల్ విడుదల!  •  EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్... 8.25 శాతం వడ్డీ డబ్బులు అకౌంట్లలోకి వచ్చేది అప్పుడే!  •  Allu Arjun: రెండు దశాబ్దాల తర్వాత అదే క్రేజ్... 'హ్యాపీ' రీ-రిలీజ్ కలెక్షన్ల సంచలనం!  •  Srisailam: శ్రీశైల క్షేత్రంలో రికార్డు స్థాయి ఆర్థిక ప్రగతి.. బ్యాంకుల్లో వందల కోట్ల భారీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు!  •  Google Maps: గూగుల్ మ్యాప్స్ క్రేజీ అప్‌డేట్.. ఇకపై పెట్రోల్, డీజిల్ ఖర్చులు మిగిలడం ఖాయం!  •  AP CRDA: 0.4 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో రూపుదిద్దుకుంటున్న నీరుకొండ రిజర్వాయర్...  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
Lifestyle

TTD UPdates: తిరుమలలో భక్తజన సంద్రం.. శ్రీవారి దర్శనాల్లో సరికొత్త రికార్డు! 24 గంటలకు పైగా..

TTD UPdates: తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి క్షేత్రం భక్తులతో పోటెత్తుతోంది. వేసవి సెలవులు కావడంతో స్వామివారి దర్శనం కోసం భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఒక్కరోజే రికార్డు స్థాయిలో 94,758 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారని టీటీడీ అధికారులు వెల్లడ…

AndhraPravasi News Desk 1 min read
TTD UPdates: తిరుమలలో భక్తజన సంద్రం.. శ్రీవారి దర్శనాల్లో సరికొత్త రికార్డు! 24 గంటలకు పైగా..
  • కమాండ్ కంట్రోల్ సెంటర్‌తో భక్తుల రద్దీని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్న అధికారులు..
     
  •  Devotional: నిన్న‌ ఒక్కరోజే రికార్డు స్థాయిలో 94,758 మందికి స్వామివారి దర్శనం..

TTD UPdates: తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి క్షేత్రం భక్తులతో పోటెత్తుతోంది. వేసవి సెలవులు కావడంతో స్వామివారి దర్శనం కోసం భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఒక్కరోజే రికార్డు స్థాయిలో 94,758 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారని టీటీడీ అధికారులు వెల్లడించారు. ఈ మే నెలలో ఒకే రోజు దర్శనానికి వచ్చిన వారి సంఖ్య 90 వేలు దాటడం ఇది నాలుగోసారి కావడం విశేషం.

సాధారణంగా శుక్రవారం రోజున స్వామివారికి అభిషేకం, ఇతర ప్రత్యేక పూజా కైంకర్యాలు ఎక్కువగా ఉంటాయి. దీంతో భక్తుల దర్శనానికి కేటాయించే సమయం తక్కువగా ఉంటుంది. అయినప్పటికీ, భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. శుక్రవారం ఉదయం జరిగే అభిషేక సేవ సమయంలో కూడా క్యూ లైన్లను నిలిపివేయకుండా సామాన్య భక్తులను దర్శనానికి అనుమతించింది. ఈ నిర్ణయం వల్ల అదనంగా దాదాపు 5,850 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగలిగారని, మొత్తం 17 గంటలకు పైగా దర్శన సమయం కేటాయించామని టీటీడీ వర్గాలు తెలిపాయి.

ప్రస్తుతం తిరుమలలో భక్తుల రద్దీ అనూహ్యంగా పెరగడంతో సర్వదర్శనం టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి దర్శనానికి దాదాపు 24 గంటల సమయం పడుతోంది. కంపార్ట్‌మెంట్లన్నీ నిండిపోయి, క్యూ లైన్లు వెలుపలికి విస్తరించాయి. దీంతో, భక్తులు క్యూ లైన్లలోకి రావద్దని, రద్దీని నియంత్రించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. తీవ్రమైన ఎండలు ఉన్నప్పటికీ, వాటిని సైతం లెక్కచేయకుండా భక్తులు తిరుమలకు పోటెత్తడం గమనార్హం.

భక్తుల రద్దీని సమర్థవంతంగా నిర్వహించేందుకు టీటీడీ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ టెక్నాలజీని వినియోగిస్తోంది. నడక మార్గాలు, ఘాట్ రోడ్ల ద్వారా బస్సులు, ప్రైవేటు వాహనాల్లో వస్తున్న భక్తుల సంఖ్యను ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ, కంపార్ట్‌మెంట్ల వద్ద రద్దీని నియంత్రించేందుకు చర్యలు చేపడుతున్నారు.

Be the first to react

More Coverage

Highway Signboards: మీరు ఎప్పుడైనా గమనించారా? రోడ్డు పక్కన ఉండే ఆకుపచ్చ బోర్డుల వెనుక ఇంత పెద్ద సైన్స్ ఉందా? తెలిస్తే అబ్బా అంటారు!

Highway Signboards: మీరు ఎప్పుడైనా గమనించారా? రోడ్డు పక్కన ఉండే ఆకుపచ్చ బోర్డుల వెనుక ఇంత పెద్ద సైన్స్ ఉందా? తెలిస్తే అబ్బా అంటారు!

Highway Signboards: మీరు ఎప్పుడైనా హైవేలపై ప్రయాణించినప్పుడు రోడ్డు పక్కన లేదా పైన ఉండే బోర్డులను గమ…

South Korea: కొరియాలో ఉద్యోగం అంత కష్టమా? ‘భారతీయులెవరూ ఇక్కడికి రావద్దు’ అంటూ యువతి వైరల్ వీడియో!

South Korea: కొరియాలో ఉద్యోగం అంత కష్టమా? ‘భారతీయులెవరూ ఇక్కడికి రావద్దు’ అంటూ యువతి వైరల్ వీడియో!

South Korea: దక్షిణ కొరియాలో ఉద్యోగం చేయాలనుకుంటున్న భారతీయులను హెచ్చరిస్తూ ఓ యువతి పోస్ట్ చేసిన వీడ…