LIVE
Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!  •  Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!  •  Modi: ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు ప్రధాని మోదీ.. యూరప్ దేశాలతో బంధాల బలోపేతమే లక్ష్యం!  •  Promotions: దేవాదాయ శాఖలో భారీ ప్రమోషన్లు.. గ్రేడ్-1 ఆఫీసర్లుగా 26 మంది ఈఓలకు పదోన్నతులు!  •  TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ నెల తిరుమల దర్శన టికెట్ల కోటా షెడ్యూల్ విడుదల!  •  EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్... 8.25 శాతం వడ్డీ డబ్బులు అకౌంట్లలోకి వచ్చేది అప్పుడే!  •  Allu Arjun: రెండు దశాబ్దాల తర్వాత అదే క్రేజ్... 'హ్యాపీ' రీ-రిలీజ్ కలెక్షన్ల సంచలనం!  •  Srisailam: శ్రీశైల క్షేత్రంలో రికార్డు స్థాయి ఆర్థిక ప్రగతి.. బ్యాంకుల్లో వందల కోట్ల భారీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు!  •  Google Maps: గూగుల్ మ్యాప్స్ క్రేజీ అప్‌డేట్.. ఇకపై పెట్రోల్, డీజిల్ ఖర్చులు మిగిలడం ఖాయం!  •  AP CRDA: 0.4 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో రూపుదిద్దుకుంటున్న నీరుకొండ రిజర్వాయర్...  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
Lifestyle

Modi: గంగా ఎక్స్‌ప్రెస్‌వే ప్రారంభం… ప్రధాని మోదీ చేతులమీదుగా..

Modi: ఉత్తరప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి మరో కీలక అడుగు పడింది. ప్రధాని నరేంద్ర మోదీ హర్దోయి జిల్లాలో 594 కిలోమీటర్ల పొడవైన గంగా ఎక్స్‌ప్రెస్‌వేను ప్రారంభించారు.

AndhraPravasi News Desk 1 min read
Modi: గంగా ఎక్స్‌ప్రెస్‌వే ప్రారంభం… ప్రధాని మోదీ చేతులమీదుగా..

హర్దోయి జిల్లాలో 594 కిలోమీటర్ల పొడవైన గంగా ఎక్స్‌ప్రెస్‌వే..

ఉత్తరప్రదేశ్‌లోనే అతి పొడవైన ఎక్స్‌ప్రెస్‌వే..

ఉత్తరప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి మరో కీలక అడుగు పడింది. ప్రధాని నరేంద్ర మోదీ హర్దోయి జిల్లాలో 594 కిలోమీటర్ల పొడవైన గంగా ఎక్స్‌ప్రెస్‌వేను ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో మాట్లాడుతూ, గంగా నది వేల ఏళ్లుగా ఉత్తరప్రదేశ్‌కు జీవనాడిగా ఉన్నట్టే, ఈ ఎక్స్‌ప్రెస్‌వే కూడా రాష్ట్ర అభివృద్ధికి కొత్త జీవనాడిగా మారుతుందని ప్రధాని పేర్కొన్నారు.

ఈ హై-స్పీడ్ కారిడార్ రాష్ట్రంలోని పశ్చిమ, మధ్య, తూర్పు ప్రాంతాలను ఒకే మార్గంలో కలుపుతూ కీలక పాత్ర పోషించనుంది. ఉత్తరప్రదేశ్‌లోనే అతి పొడవైన ఎక్స్‌ప్రెస్‌వేగా ఇది నిలవనుంది. మీరట్ నుంచి ప్రయాగ్‌రాజ్ వరకు ప్రస్తుతం సుమారు 12 గంటలు పడుతున్న ప్రయాణ సమయం, ఈ ఎక్స్‌ప్రెస్‌వే ద్వారా కేవలం 6 గంటలకు తగ్గనుంది.

ఈ ఎక్స్‌ప్రెస్‌వే మీరట్, హాపూర్, బులంద్‌షహర్, అమ్రోహా, సంభల్, బుదౌన్, షాజహాన్‌పూర్, హర్దోయి, ఉన్నావ్, రాయ్‌బరేలీ, ప్రతాప్‌గఢ్, ప్రయాగ్‌రాజ్ జిల్లాల గుండా వెళ్తుంది. దీని వల్ల అనేక ప్రాంతాల మధ్య కనెక్టివిటీ మెరుగవుతుందని అధికారులు తెలిపారు.

ప్రత్యేకంగా షాజహాన్‌పూర్ ప్రాంతంలో 3.5 కిలోమీటర్ల పొడవైన ఎయిర్‌స్ట్రిప్‌ను కూడా ఏర్పాటు చేశారు. అత్యవసర పరిస్థితుల్లో భారత వాయుసేన విమానాలు ల్యాండింగ్, టేకాఫ్ చేసుకునేలా ఇది ఉపయోగపడనుంది.

ఈ ప్రాజెక్టు ద్వారా పరిశ్రమలు, వాణిజ్యం, వ్యవసాయం, పర్యాటక రంగాలకు భారీగా ప్రోత్సాహం లభించనుంది. అంతేకాకుండా, ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది ఉద్యోగ అవకాశాలు కూడా సృష్టించబడతాయని ప్రభుత్వం భావిస్తోంది.

మొత్తంగా గంగా ఎక్స్‌ప్రెస్‌వే ఉత్తరప్రదేశ్ అభివృద్ధి దిశలో ఒక పెద్ద మైలురాయిగా నిలుస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Be the first to react

More Coverage

Highway Signboards: మీరు ఎప్పుడైనా గమనించారా? రోడ్డు పక్కన ఉండే ఆకుపచ్చ బోర్డుల వెనుక ఇంత పెద్ద సైన్స్ ఉందా? తెలిస్తే అబ్బా అంటారు!

Highway Signboards: మీరు ఎప్పుడైనా గమనించారా? రోడ్డు పక్కన ఉండే ఆకుపచ్చ బోర్డుల వెనుక ఇంత పెద్ద సైన్స్ ఉందా? తెలిస్తే అబ్బా అంటారు!

Highway Signboards: మీరు ఎప్పుడైనా హైవేలపై ప్రయాణించినప్పుడు రోడ్డు పక్కన లేదా పైన ఉండే బోర్డులను గమ…

South Korea: కొరియాలో ఉద్యోగం అంత కష్టమా? ‘భారతీయులెవరూ ఇక్కడికి రావద్దు’ అంటూ యువతి వైరల్ వీడియో!

South Korea: కొరియాలో ఉద్యోగం అంత కష్టమా? ‘భారతీయులెవరూ ఇక్కడికి రావద్దు’ అంటూ యువతి వైరల్ వీడియో!

South Korea: దక్షిణ కొరియాలో ఉద్యోగం చేయాలనుకుంటున్న భారతీయులను హెచ్చరిస్తూ ఓ యువతి పోస్ట్ చేసిన వీడ…