LIVE
Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!  •  Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!  •  Modi: ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు ప్రధాని మోదీ.. యూరప్ దేశాలతో బంధాల బలోపేతమే లక్ష్యం!  •  Promotions: దేవాదాయ శాఖలో భారీ ప్రమోషన్లు.. గ్రేడ్-1 ఆఫీసర్లుగా 26 మంది ఈఓలకు పదోన్నతులు!  •  TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ నెల తిరుమల దర్శన టికెట్ల కోటా షెడ్యూల్ విడుదల!  •  EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్... 8.25 శాతం వడ్డీ డబ్బులు అకౌంట్లలోకి వచ్చేది అప్పుడే!  •  Allu Arjun: రెండు దశాబ్దాల తర్వాత అదే క్రేజ్... 'హ్యాపీ' రీ-రిలీజ్ కలెక్షన్ల సంచలనం!  •  Srisailam: శ్రీశైల క్షేత్రంలో రికార్డు స్థాయి ఆర్థిక ప్రగతి.. బ్యాంకుల్లో వందల కోట్ల భారీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు!  •  Google Maps: గూగుల్ మ్యాప్స్ క్రేజీ అప్‌డేట్.. ఇకపై పెట్రోల్, డీజిల్ ఖర్చులు మిగిలడం ఖాయం!  •  AP CRDA: 0.4 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో రూపుదిద్దుకుంటున్న నీరుకొండ రిజర్వాయర్...  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
Lifestyle

Kathmandu: కాఠ్‌మాండులో విమానంలో మంటలు.. తృటిలో తప్పిన విమాన ప్రమాదం!

Kathmandu: నేపాల్ రాజధాని కాఠ్‌మాండులో పెను విమాన ప్రమాదం తృటిలో తప్పింది. ఇస్తాంబుల్ నుంచి వచ్చిన ఎయిర్‌బస్-300 విమానం ల్యాండింగ్ అవుతున్న సమయంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

AndhraPravasi News Desk 1 min read
Kathmandu: కాఠ్‌మాండులో విమానంలో మంటలు.. తృటిలో తప్పిన విమాన ప్రమాదం!

ల్యాండింగ్ సమయంలో ఎయిర్‌బస్‌లో మంటలు..

కాఠ్‌మాండూ విమానాశ్రయంలో ఉద్రిక్తత..

నేపాల్ రాజధాని కాఠ్‌మాండులో పెను విమాన ప్రమాదం తృటిలో తప్పింది. ఇస్తాంబుల్ నుంచి వచ్చిన ఎయిర్‌బస్-300 విమానం ల్యాండింగ్ అవుతున్న సమయంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అయితే విమాన సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించడంతో అందరూ సురక్షితంగా బయటపడ్డారు.

విమానాశ్రయ అధికారుల వివరాల ప్రకారం, విమానం కాఠ్‌మాండులోని త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ అవుతుండగా కుడివైపు ల్యాండింగ్ గేర్ వద్ద మంటలు కనిపించాయి. వెంటనే పైలట్ అత్యవసర పరిస్థితిని ప్రకటించగా, ఎయిర్‌పోర్ట్ అగ్నిమాపక సిబ్బంది వెంటనే రంగంలోకి దిగారు.

మరోవైపు, విమాన సిబ్బంది చాకచక్యంగా స్పందించి ఎమర్జెన్సీ ఎగ్జిట్ ద్వారానే ప్రయాణికులను వేగంగా బయటకు దించారు. ప్రమాద సమయంలో విమానంలో మొత్తం 277 మంది ప్రయాణికులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. అందరూ క్షేమంగా బయటపడటంతో పెద్ద ప్రమాదం తప్పినట్టైంది.

అగ్నిమాపక సిబ్బంది కొద్ది నిమిషాల్లోనే మంటలను అదుపులోకి తీసుకురావడంతో పరిస్థితి సాధారణమైంది. ఈ ఘటనతో విమానాశ్రయంలో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఘటనపై విమానాశ్రయ అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. ల్యాండింగ్ గేర్‌లో సాంకేతిక లోపమే మంటలకు కారణమై ఉండొచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు.

Be the first to react

More Coverage

Highway Signboards: మీరు ఎప్పుడైనా గమనించారా? రోడ్డు పక్కన ఉండే ఆకుపచ్చ బోర్డుల వెనుక ఇంత పెద్ద సైన్స్ ఉందా? తెలిస్తే అబ్బా అంటారు!

Highway Signboards: మీరు ఎప్పుడైనా గమనించారా? రోడ్డు పక్కన ఉండే ఆకుపచ్చ బోర్డుల వెనుక ఇంత పెద్ద సైన్స్ ఉందా? తెలిస్తే అబ్బా అంటారు!

Highway Signboards: మీరు ఎప్పుడైనా హైవేలపై ప్రయాణించినప్పుడు రోడ్డు పక్కన లేదా పైన ఉండే బోర్డులను గమ…

South Korea: కొరియాలో ఉద్యోగం అంత కష్టమా? ‘భారతీయులెవరూ ఇక్కడికి రావద్దు’ అంటూ యువతి వైరల్ వీడియో!

South Korea: కొరియాలో ఉద్యోగం అంత కష్టమా? ‘భారతీయులెవరూ ఇక్కడికి రావద్దు’ అంటూ యువతి వైరల్ వీడియో!

South Korea: దక్షిణ కొరియాలో ఉద్యోగం చేయాలనుకుంటున్న భారతీయులను హెచ్చరిస్తూ ఓ యువతి పోస్ట్ చేసిన వీడ…