LIVE
Indian Railways: ప్రయాణికులకు అలర్ట్... జూన్ 20 నుండి ఆ ఎక్స్‌ప్రెస్ సమయాల్లో మార్పు!  •  Pakistan: హాలిడే ట్రిప్‌లో ఊహించని విషాదం.. పాకిస్థాన్‌లో ఘోరం.. 9 ఏళ్ల చిన్నారిని కాల్చి చంపిన పోలీసులు!  •  India: భారత్ దెబ్బకు టర్కీ విమానయాన సంస్థ విలవిల.. రూ. 4,200 కోట్ల నష్టంతో రాత్రికి రాత్రే.. 10,000 మంది ఉద్యోగులను.!  •  Yogandhra: ఉపమాకలో పండగ వాతావరణంలో యోగాంధ్ర కార్యక్రమం.. యోగాసనాలు వేసిన హోంమంత్రి అనిత, ఎంపీ సీఎం రమేష్!  •  AP Government: రైతులకు ఏపీ ప్రభుత్వం బంపర్ ఆఫర్.. 85% సబ్సిడీతో ఆ పథకం పునరుద్ధరణ!  •  TANA: తానా మిడ్ అట్లాంటిక్ ఆధ్వర్యంలో మహిళల త్రోబాల్ టోర్నమెంట్ ఘన విజయం!  •  Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి గంటల తరబడి వేచి ఉన్న భక్తులు!  •  Praja Vedika: నేడు (17/6) తెలుగుదేశం పార్టీ కేంద్రంలో 'ప్రజా వేదిక' కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!  •  AP Farmers: రైతులకు డబుల్ ధమాకా.... ఒకే రోజు అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ నిధులు విడుదల!  •  New Pensions: ఎన్టీఆర్ భరోసా పింఛన్లపై మంత్రి కీలక ప్రకటన... త్వరలోనే వారందరికి నెలకు రూ.4వేలు!  • 
⚡ BREAKING
Lifestyle

Godavari Pushkaralu: గోదావరి పుష్కరాలు 2027కు భారీ ఏర్పాట్లు ప్రారంభించిన ఏపీ ప్రభుత్వం!

Godavari Pushkaralu: ఆంధ్రప్రదేశ్‌లో 2027 గోదావరి పుష్కరాలను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం భారీ స్థాయిలో ఏర్పాట్లు ప్రారంభించింది. ఈ నేపథ్యంలో అమరావతిలోని సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వివిధ శాఖల అధికారులతో సమగ్ర సమీక్ష నిర్వహించారు.

AndhraPravasi News Desk 2 min read
Godavari Pushkaralu: గోదావరి పుష్కరాలు 2027కు భారీ ఏర్పాట్లు ప్రారంభించిన ఏపీ ప్రభుత్వం!

గోదావరి పుష్కరాలపై సీఎం చంద్రబాబు సమగ్ర సమీక్ష..

2027 పుష్కరాల కోసం 525 ఘాట్ల నిర్మాణానికి ప్రభుత్వం సిద్ధం..

ఆంధ్రప్రదేశ్‌లో 2027 గోదావరి పుష్కరాలను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం భారీ స్థాయిలో ఏర్పాట్లు ప్రారంభించింది. ఈ నేపథ్యంలో అమరావతిలోని సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వివిధ శాఖల అధికారులతో సమగ్ర సమీక్ష నిర్వహించారు. అఖండ గోదావరి అభివృద్ధి ప్రాజెక్టు, పుష్కరాల నిర్వహణ, మౌలిక సదుపాయాల కల్పనపై మంత్రుల కమిటీతో కలిసి సీఎం విస్తృతంగా చర్చించారు.

పుష్కరాలను విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా 2027 గోదావరి పుష్కరాలకు ముందే పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ఇటీవల ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ క్షేత్రస్థాయిలో పర్యటించి ఇచ్చిన సూచనలను కూడా పరిగణనలోకి తీసుకుని పనులు చేపట్టాలని సూచించారు.

పుష్కరాల నిర్వహణను కేవలం తాత్కాలిక కార్యక్రమంగా కాకుండా, గోదావరి పరివాహక ప్రాంత అభివృద్ధికి ఉపయోగపడేలా దీర్ఘకాలిక ప్రణాళికతో ముందుకు వెళ్లాలని సీఎం తెలిపారు. ముఖ్యంగా రాజమహేంద్రవరం వంటి నగరాలను మెగాసిటీలుగా తీర్చిదిద్దే దిశగా పనులు చేపట్టాలని సూచించారు. ప్రస్తుతం నిర్మిస్తున్న మౌలిక వసతులు భవిష్యత్తులో ప్రజలకు శాశ్వత ఆస్తులుగా మారాలని అభిప్రాయపడ్డారు.

పోలవరం, ఏలూరు, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కోనసీమ, కాకినాడ జిల్లాల్లో భారీ స్థాయిలో పుష్కరాల పనులు చేపట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. రాష్ట్రంలో 212 కిలోమీటర్ల మేర ప్రవహించే గోదావరి నదికి అనుసంధానంగా మొత్తం 525 పుష్కర ఘాట్లను సిద్ధం చేయాలని నిర్ణయించారు. ప్రస్తుతం ఉన్న 288 ఘాట్లకు అదనంగా కొత్తగా 237 ఘాట్లు నిర్మించేందుకు అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు.

పోలవరం జిల్లా గుండాలలో తొలి పుష్కర ఘాట్ ఏర్పాటు చేయనుండగా, కోనసీమ జిల్లా అంతర్వేది, బలుసుతిప్ప, కాకినాడలోని గోవాలంక, పశ్చిమగోదావరిలోని నర్సాపురం ప్రాంతాల్లో చివరి ఘాట్‌ల నిర్మాణ ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. ముఖ్యంగా తూర్పుగోదావరి, కోనసీమ జిల్లాల్లో 150కి పైగా కొత్త ఘాట్లు నిర్మించనున్నారు. ప్రస్తుతం 4.5 కిలోమీటర్ల పొడవున్న పుష్కర ఘాట్లను కొత్త నిర్మాణాలతో కలిపి 9.9 కిలోమీటర్లకు విస్తరించనున్నారు.

ఈసారి గోదావరి పుష్కరాలకు 9 నుంచి 10 కోట్ల మంది భక్తులు వస్తారని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఒక్కరోజులోనే సుమారు కోటి మంది పుణ్యస్నానాలు చేసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. గతంలో 1991లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 1.2 కోట్ల మంది, 2003లో 5 కోట్ల మంది, 2015లో నవ్యాంధ్రప్రదేశ్‌లో 4.86 కోట్ల మంది భక్తులు పుష్కర స్నానాలు ఆచరించారు. గత పుష్కరాల్లో ఒక్కరోజులో అత్యధికంగా 58.26 లక్షల మంది భక్తులు స్నానం చేశారు.

భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పుష్కర ఘాట్లు, రహదారులు, తాత్కాలిక టెంట్లు, మరుగుదొడ్లు, తాగునీటి సదుపాయాలు, పారిశుధ్యం, ట్రాఫిక్ నియంత్రణ వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సీఎం సూచించారు. రాజమహేంద్రవరం, నర్సాపురం తదితర పట్టణాల్లో మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో రూ.1,974 కోట్ల వ్యయంతో 1,660 పనులు చేపట్టనున్నారు. అలాగే పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ పరిధిలో రూ.1,080 కోట్ల విలువైన 1,140 పనులు అమలు చేయనున్నారు. ఇప్పటికే రూ.211.97 కోట్లతో 132 పనులకు ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది.

ఈ సమీక్ష సమావేశానికి మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, పయ్యావుల కేశవ్, బీసీ జనార్ధన్ రెడ్డి, సత్యకుమార్ యాదవ్, పి.నారాయణ, హోంమంత్రి అనిత, నిమ్మల రామానాయుడు, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, అనగాని సత్యప్రసాద్, గొట్టిపాటి రవికుమార్, వాసంశెట్టి సుభాష్ హాజరయ్యారు. సీఎస్ జి.సాయి ప్రసాద్, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా సహా దేవాదాయ, వైద్యారోగ్యం, రవాణా, పర్యాటక, పురపాలక, పంచాయతీరాజ్, ఆర్థిక, జలవనరులు, పోలీసు శాఖల ఉన్నతాధికారులు కూడా సమావేశంలో పాల్గొన్నారు.

Be the first to react

More Coverage

Highway Signboards: మీరు ఎప్పుడైనా గమనించారా? రోడ్డు పక్కన ఉండే ఆకుపచ్చ బోర్డుల వెనుక ఇంత పెద్ద సైన్స్ ఉందా? తెలిస్తే అబ్బా అంటారు!

Highway Signboards: మీరు ఎప్పుడైనా గమనించారా? రోడ్డు పక్కన ఉండే ఆకుపచ్చ బోర్డుల వెనుక ఇంత పెద్ద సైన్స్ ఉందా? తెలిస్తే అబ్బా అంటారు!

Highway Signboards: మీరు ఎప్పుడైనా హైవేలపై ప్రయాణించినప్పుడు రోడ్డు పక్కన లేదా పైన ఉండే బోర్డులను గమ…

South Korea: కొరియాలో ఉద్యోగం అంత కష్టమా? ‘భారతీయులెవరూ ఇక్కడికి రావద్దు’ అంటూ యువతి వైరల్ వీడియో!

South Korea: కొరియాలో ఉద్యోగం అంత కష్టమా? ‘భారతీయులెవరూ ఇక్కడికి రావద్దు’ అంటూ యువతి వైరల్ వీడియో!

South Korea: దక్షిణ కొరియాలో ఉద్యోగం చేయాలనుకుంటున్న భారతీయులను హెచ్చరిస్తూ ఓ యువతి పోస్ట్ చేసిన వీడ…