స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) దేశవ్యాప్తంగా భారీగా 996 కాంట్రాక్ట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నియామకాల్లో VP వెల్త్, AVP వెల్త్, కస్టమర్ రిలేషన్‌షిప్ ఎగ్జిక్యూటివ్ (CRE) వంటి ప్రధాన పోస్టులు ఉన్నాయి. బ్యాంకింగ్ రంగంలో అవకాశాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ఇది మంచి అవకాశం కావడం విశేషం.
తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు కూడా ఈ నోటిఫికేషన్ ద్వారా మంచి అవకాశాలు లభిస్తున్నాయి. హైదరాబాద్‌లో 43 పోస్టులు, అమరావతిలో 29 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దేశవ్యాప్తంగా అనేక కేంద్రాల్లో ఈ నియామకాలు జరుగుతుండటంతో, స్థానికంగా అవకాశాలు పెరిగినట్లయ్యింది.
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులు డిగ్రీ, ఎంబీఏ లేదా CFP/CFA వంటి ప్రొఫెషనల్ సర్టిఫికేషన్లు కలిగి ఉండాలి. పోస్టు స్వభావాన్ని బట్టి సంబంధిత రంగంలో పని అనుభవం తప్పనిసరి. కాంట్రాక్ట్ ఉద్యోగాలు కావడంతో అనుభవానికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నారు.
ఎంపిక ప్రక్రియలో ముందుగా అభ్యర్థుల దరఖాస్తులను పరిశీలించి షార్ట్ లిస్టింగ్ చేస్తారు. షార్ట్‌లిస్ట్ అయిన వారికి ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఈ రెండు దశల్లో చూపిన ప్రతిభ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఎలాంటి రాతపరీక్ష ఉండకపోవడం ప్రత్యేక ఆకర్షణ.
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ డిసెంబర్ 23. ఆసక్తి ఉన్న వారు ఆలస్యం చేయకుండా ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. మరిన్ని వివరాలు, అర్హతలు, అప్లికేషన్ లింక్ కోసం sbi.bank.in ను సందర్శించవచ్చు. ఈ నియామకాలు 5 సంవత్సరాల కాంట్రాక్ట్ పద్ధతిలో ఉండనున్నాయి.