ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) 2025–26 సంవత్సరానికి ప్రొబేషనరీ ఆఫీసర్లు (PO), స్పెషలిస్ట్ ఆఫీసర్లు (SO) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇప్పటికే విడుదల చేసింది. కాగా, జూలై 21తో ముగియాల్సిన దరఖాస్తుల గడువును ఐబీపీఎస్ తాజాగా మరో వారం పాటు పొడిగించింది.
అభ్యర్థులు జూలై 28, 2025వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇప్పటి వరకు అప్లై చేయని వారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించింది.
ఈ నియామక ప్రక్రియ ద్వారా ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో మొత్తం 5,208 పీఓ, 1,007 ఎస్ఓ పోస్టులను భర్తీ చేయనున్నారు. బ్యాంక్ ఉద్యోగాలపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ అవకాశం ద్వారా తమ కలలను నిజం చేసుకోవచ్చు.