Terrorists Arrest: భారత్ లో బాంబు పేలుళ్లకు ప్లాన్! నలుగురు ఉగ్రవాదులు అరెస్ట్!

2025-07-23 18:52:00
Pension: ఏపీలో పెన్షన్ పథకం పై కీలక నిర్ణయం! వారందరికీ కట్.. మీ పేరు ఉందేమో చెక్ చేసుకోండి!

భారతదేశంలో సంచలనంగా మారిన అల్‌ఖైదా ఉగ్ర కుట్రను గుజరాత్ యాంటీ టెర్రర్ స్క్వాడ్ (ATS) సమర్థంగా భగ్నం చేసింది. బుధవారం నాడు జరిగిన ఈ ఆపరేషన్‌లో నాలుగు ప్రాంతాల నుంచి నలుగురు ఉగ్రవాదులు అరెస్ట్ అయ్యారు. అరెస్టైనవారిని మహమ్మద్ ఫైక్, మహమ్మద్ ఫర్దీన్, సైఫుల్ ఖురేషి, జీషన్ అలీగా గుర్తించారు. వీరిలో ఒకరిని ఢిల్లీలో, మరొకరిని నోయిడాలో, ఇంకో ఇద్దరిని గుజరాత్‌లోని అహ్మదాబాద్, మోడాసాలో అరెస్ట్ చేశారు.

Stamp Duty: ఏపీ ప్రజలకు శుభవార్త! స్టాంపు డ్యూటీ పై భారీ తగ్గింపు.. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ!

ఈ నలుగురు యువకుల వయస్సు 20–25 మధ్యలో ఉండగా, దేశంలో భారీ స్థాయిలో ఉగ్రదాడులకు ప్రణాళికలు రచించినట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. సోషల్ మీడియా ద్వారా వీరంతా ఒకరితో ఒకరు సంప్రదింపులు జరిపినట్లు గుర్తించామని, తదుపరి విచారణ కొనసాగుతోందని గుజరాత్ పోలీసులు తెలిపారు. గతేడాది కూడా ఢిల్లీ పోలీసులు అల్‌ఖైదా అనుబంధ టెర్రర్ మాడ్యూల్‌ను ఛేదించి ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, రాజస్థాన్‌లలో 14 మందిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.

Cabinet: కేబినెట్ ప్రక్షాళన ముహూర్తం ఫిక్స్! ఇన్, అవుట్ లిస్టులో వారి పేర్లు!

ఈ ఘటన నేపథ్యంలో దేశ భద్రతా వ్యవస్థ మరింత అప్రమత్తం అవుతున్నదని స్పష్టమవుతోంది. యువతను ఆకర్షించి, ఉగ్రవాద మార్గానికి దించేందుకు చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకోవడం, నిఘాను పటిష్టం చేయడం కోసం అధికారులు సమాయత్తమవుతున్నారు. ఈ అరెస్టులతో పాటు, ఆయుధ శిక్షణ పొందిన అనేక మంది భారతీయులపై కూడా పక్కా గమనిక కొనసాగుతోందని సమాచారం.

AP Forest Department: ఏపీలో ప్రభుత్వ ఉద్యోగాలు..! 100 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్!
Karnataka: క‌ర్ణాట‌క‌లో టీ, కాఫీ, పాల అమ్మ‌కాలు బంద్‌..! కార‌ణ‌మిదే!
UPI New Rules: ఫోన్ పే వాడుతున్నారా.. బిగ్ అప్ డేట్! ఆగస్ట్ నుండి కొత్త రూల్స్!
Big Shock: కొలికపూడి బిగ్ షాక్! వైసీపీ నేతతో భేటీ... కారణం ఇదే!
Subsidy: కొత్తగా రేషన్ కార్డులు తీసుకున్నారా.... ఉచిత విద్యుత్, గ్యాస్ సబ్సిడీలకు దరఖాస్తులు! వెంటనే అప్లై చేసుకోండి!
Google: గూగుల్ బంపరాఫర్…! ఏడాది పాటు అడ్వాన్స్‌డ్‌ ఏఐ టూల్స్‌ ఫ్రీ!

Spotlight

Read More →