బెట్టింగ్ యాప్‌ల మనీలాండరింగ్ కేసులో సినీ నటుడు రానా దగ్గుబాటికి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మరోసారి నోటీసులు జారీ చేసింది. ముందుగా జూలై 23న విచారణకు హాజరు కావాల్సిన రానా, షూటింగ్‌లు మరియు ఇతర కార్యక్రమాల నిమిత్తం కొంత గడువు కోరారు. దీనిని ఈడీ ఆమోదించి, ఆగస్టు 11న విచారణకు తప్పకుండా హాజరుకావాలని స్పష్టంగా పేర్కొంది.
ఈ కేసులో బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేసిన సినీ ప్రముఖులకు ఆ యాప్ నిర్వాహకులు చెల్లించిన పారితోషికాలపై మనీలాండరింగ్ అనుమానంతో ఈడీ దర్యాప్తు జరుపుతోంది. ఈ క్రమంలో రానాతో పాటు ప్రకాశ్ రాజ్, విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మి తదితరులకు కూడా నోటీసులు పంపింది.
విచారణకు హాజరయ్యేందుకు మంచు లక్ష్మి కూడా గడువు కోరినట్టు సమాచారం. బెట్టింగ్ యాప్‌ల వెనకున్న నిధుల మార్పిడి, సెలబ్రిటీల ప్రమోషన్‌లో భాగంగా వచ్చిన డబ్బు లావాదేవీలపై ఈడీ ప్రశ్నల వర్షం కురిపించనుంది.