LIVE
Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!  •  Modi: ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు ప్రధాని మోదీ.. యూరప్ దేశాలతో బంధాల బలోపేతమే లక్ష్యం!  •  TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ నెల తిరుమల దర్శన టికెట్ల కోటా షెడ్యూల్ విడుదల!  •  EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్... 8.25 శాతం వడ్డీ డబ్బులు అకౌంట్లలోకి వచ్చేది అప్పుడే!  •  Allu Arjun: రెండు దశాబ్దాల తర్వాత అదే క్రేజ్... 'హ్యాపీ' రీ-రిలీజ్ కలెక్షన్ల సంచలనం!  •  Srisailam: శ్రీశైల క్షేత్రంలో రికార్డు స్థాయి ఆర్థిక ప్రగతి.. బ్యాంకుల్లో వందల కోట్ల భారీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు!  •  Google Maps: గూగుల్ మ్యాప్స్ క్రేజీ అప్‌డేట్.. ఇకపై పెట్రోల్, డీజిల్ ఖర్చులు మిగిలడం ఖాయం!  •  AP CRDA: 0.4 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో రూపుదిద్దుకుంటున్న నీరుకొండ రిజర్వాయర్...  •  Vishaka: ప్రభుత్వ స్కూల్‌గా మారిన విశాఖ విమల విద్యాలయం.. కలెక్టర్, ఎమ్మెల్యే పల్లా చేతుల మీదుగా ప్రారంభం!  •  6G Network: భారత్‌లో 6G సంచలనం.. టెలికాం రంగం రూపురేఖలు మార్చబోతున్న కేంద్ర ప్రభుత్వ మాస్టర్ ప్లాన్!  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
Gulf

Iran War: అమెరికా ప్రకటనపై ఇజ్రాయెల్ సంచలన వ్యాఖ్యలు.. ట్రంప్ సరికొత్త వ్యూహం - ఐదు రోజుల గడువులోగా.!

Iran War: ఇరాన్‌తో యుద్ధాన్ని ఐదు రోజుల పాటు విరమిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటనపై ఇజ్రాయెల్ స్పందించింది. యుద్ధ విరమణ అమెరికాకే పరిమితమని స్పష్టం చేసింది. తాము యుద్ధాన్ని విరమించలేదని పేర్కొంది.

AndhraPravasi News Desk 2 min read
Iran War: అమెరికా ప్రకటనపై ఇజ్రాయెల్ సంచలన వ్యాఖ్యలు.. ట్రంప్ సరికొత్త వ్యూహం - ఐదు రోజుల గడువులోగా.!
  • Gulf: శాంతి దిశగా చర్చలు సఫలం? ఇరాన్ ప్రతినిధులతో రెండు రోజుల భేటీ తర్వాత ట్రంప్ ప్రకటన..
     
  • చమురు సరఫరా పునరుద్ధరణే లక్ష్యం.. ట్రంప్ యుద్ధ విరమణ వెనుక అసలు కారణాలివే..

Iran War: పశ్చిమాసియాలో కొనసాగుతున్న భీకర యుద్ధం కొత్త మలుపులు తిరుగుతోంది, ముఖ్యంగా ఇరాన్‌తో యుద్ధాన్ని ఐదు రోజుల పాటు తాత్కాలికంగా విరమిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటన అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. గత రెండు రోజులుగా ఇరాన్ ప్రతినిధులతో జరిగిన చర్చలు సానుకూల వాతావరణంలో సాగాయని, ఈ నేపథ్యంలోనే శాంతి స్థాపనకు అవకాశం ఇస్తూ ఐదు రోజుల విరామం ప్రకటిస్తున్నానని ట్రంప్ స్పష్టం చేశారు. అయితే ఈ యుద్ధ విరమణ కేవలం అమెరికా దళాలకు మాత్రమే పరిమితమని, తాము మాత్రం యుద్ధాన్ని విరమించే ప్రసక్తే లేదని ఇజ్రాయెల్ ఘాటుగా స్పందించడం గమనార్హం. ఇరాన్‌తో జరగబోయే తదుపరి చర్చల ఫలితాల ఆధారంగానే తమ భవిష్యత్తు కార్యాచరణ ఉంటుందని ట్రంప్ వివరించినప్పటికీ, ఇజ్రాయెల్ తన పంథా మార్చుకోకపోవడం గల్ఫ్ ప్రాంతంలో తీవ్ర అనిశ్చితికి దారితీస్తోంది.

ఈ సంక్షోభం ఫిబ్రవరి 28న అమెరికా-ఇజ్రాయెల్ మరియు ఇరాన్ మధ్య దాడులతో ప్రారంభమైంది, ఇది కేవలం కొన్ని దేశాలకే పరిమితం కాకుండా ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై కోలుకోలేని దెబ్బ కొట్టింది. అమెరికా మరియు ఇజ్రాయెల్ జరిపిన సంయుక్త వైమానిక దాడులకు ప్రతిచర్యగా ఇరాన్ వ్యూహాత్మకమైన హర్మూజ్ జలసంధిని పూర్తిగా మూసివేసింది. ప్రపంచ దేశాలకు అవసరమైన చమురులో సింహభాగం ఈ మార్గం గుండానే సరఫరా అవుతుండటంతో, ఒక్కసారిగా అంతర్జాతీయంగా ఇంధన సంక్షోభం తలెత్తింది. భారతదేశం సహా దాదాపు అన్ని దేశాల్లో పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడటంతో పాటు ధరలు ఆకాశాన్ని తాకాయి. ఈ నేపథ్యంలోనే యుద్ధాన్ని తాత్కాలికంగానైనా ఆపి, చర్చల ద్వారా పరిష్కారం కనుగొనాలని ట్రంప్ ప్రయత్నిస్తున్నారు.

ఇజ్రాయెల్ మాత్రం ఇరాన్ నుంచి పొంచి ఉన్న ముప్పును పూర్తిగా తొలగించే వరకు వెనక్కి తగ్గేది లేదని భీష్మించుక కూర్చుంది, ఇది అమెరికా శాంతి ప్రయత్నాలకు పెద్ద సవాలుగా మారింది. ట్రంప్ ప్రకటించిన ఈ ఐదు రోజుల గడువులోగా ఇరాన్ మరియు అమెరికా మధ్య కుదిరే ఒప్పందంపైనే ప్రపంచ దేశాల భవిష్యత్తు ఆధారపడి ఉంది. ఒకవేళ చర్చలు విఫలమైతే చమురు సరఫరా పునరుద్ధరణ మరింత ఆలస్యమయ్యే ప్రమాదం ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. హర్మూజ్ జలసంధి తెరుచుకుంటేనే ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఇంధన కష్టాలు తీరుతాయని, అప్పటివరకు సామాన్యుడిపై ధరల భారం తప్పదని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ కీలక పరిణామాల నేపథ్యంలో అంతర్జాతీయ సమాజం ఇరాన్ మరియు అమెరికా మధ్య జరగబోయే తదుపరి రౌండ్ చర్చల వైపు ఆసక్తిగా ఎదురుచూస్తోంది.

Be the first to react

More Coverage

Israel & India: పశ్చిమాసియాలో శాంతికి ‘భారత్’ ఒక్కటే మార్గం.. ఇజ్రాయెల్ రాయబారి రూవెన్ అజర్ కీలక వ్యాఖ్యలు!

Israel & India: పశ్చిమాసియాలో శాంతికి ‘భారత్’ ఒక్కటే మార్గం.. ఇజ్రాయెల్ రాయబారి రూవెన్ అజర్ కీలక వ్యాఖ్యలు!

Israel & India: భౌగోళిక ఉద్రిక్తతలు, ఆర్థిక అనిశ్చితి నేపథ్యంలో పశ్చిమాసియా ప్రాంతంలో శాంతి భద్రతలను…

Gulf Updates: రూ.84 లక్షల ‘దియా’ చెల్లిస్తేనే సౌదీ జైలు నుంచి విడుదల.. రియాద్ జైలులో నిజామాబాద్ ప్రవాసి..

Gulf Updates: రూ.84 లక్షల ‘దియా’ చెల్లిస్తేనే సౌదీ జైలు నుంచి విడుదల.. రియాద్ జైలులో నిజామాబాద్ ప్రవాసి..

Gulf Updates: సౌదీ అరేబియాలోని రియాద్ జైలులో ఉన్న నిజామాబాద్ జిల్లా సాలూర మండలం కుమ్మన్‌పల్లి గ్రామా…