సామాన్య ప్రజల్లో డిమార్ట్‌కు ఉన్న ఆదరణ అంతా ఇంతా కాదు. ఇతర సూపర్ మార్కెట్లతో పోలిస్తే డిమార్ట్‌లో నిత్యావసరాలు, కిరాణా సరుకులు, దుస్తులు, కిచెన్ వేర్ వంటి వస్తువులు చాలా తక్కువ ధరలకు లభిస్తాయన్నదే దీనికి ప్రధాన కారణం. “డైలీ లో ప్రైస్” కాన్సెప్ట్‌తో వినియోగదారుల నమ్మకాన్ని సంపాదించిన డిమార్ట్, ఇప్పుడు జనవరి 2026 స్పెషల్ ఆఫర్లతో మరింత ఆకర్షణీయంగా మారింది. సాధారణంగా ఎప్పుడూ డిస్కౌంట్లు ఉన్నప్పటికీ, కొత్త ఏడాది ప్రారంభంలో వినియోగదారులకు మరింత లాభం చేకూర్చేలా ఈసారి భారీ ఆఫర్లు ప్రకటించింది.
జనవరి 2026 ఆఫర్లలో భాగంగా ముఖ్యంగా కిరాణా సరుకులపై భారీ తగ్గింపులు అందిస్తోంది. నిత్యావసర వస్తువులు, హౌస్‌హోల్డ్ స్టేపుల్స్, డైలీ ఎసెన్షియల్స్‌కు సంబంధించిన బల్క్ ప్యాక్స్‌పై 70 శాతం వరకు డిస్కౌంట్ లభిస్తోంది. ప్యాకేజ్డ్ ఫుడ్స్, స్నాక్స్, బెవరేజెస్, డ్రై ఫ్రూట్స్, కుకింగ్ ఆయిల్స్, బియ్యం, పప్పులు, మసాలాలు వంటి వస్తువులపై 30 శాతం నుంచి 60 శాతం వరకు తగ్గింపు అందిస్తోంది. నెలవారీగా కొనుగోలు చేసే కొన్ని ప్రధాన సరుకులపై అయితే 50 శాతం వరకు డిస్కౌంట్ ఇవ్వడం వినియోగదారులను మరింత ఆకర్షిస్తోంది.
కిచెన్ అవసరాలకు సంబంధించిన వస్తువులపై కూడా డిమార్ట్ భారీ ఆఫర్లు ప్రకటించింది. ‘ది గ్రేట్ కిచెన్ ఫెస్ట్’లో భాగంగా కుక్వేర్ సెట్స్‌పై ప్రత్యేక తగ్గింపులు అందిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రెషర్ కుక్కర్లు, కడాయిలు, ఫ్రై ప్యాన్స్ వంటి కుక్వేర్ వస్తువులపై రూ.499 నుంచే డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. అంతేకాకుండా మిక్సర్లు, జ్యూసర్లు, టోస్టర్లు, ఇండక్షన్ కుక్‌టాప్స్ వంటి హోమ్ అప్లయన్సెస్‌పై 70 శాతం వరకు తగ్గింపు ఇస్తోంది. స్టీల్ ప్రొడక్ట్స్, క్రాకరీ, ప్లాస్టిక్ గూడ్స్, ఇతర కిచెన్ ఎసెన్షియల్స్‌పై కూడా భారీ డీల్స్ లభిస్తున్నాయి.
దుస్తుల విభాగంలోనూ డిమార్ట్ జనవరి ఆఫర్లు అదరగొడుతున్నాయి. మెన్, విమెన్, కిడ్స్ అపారెల్స్లో క్యాజువల్, ట్రెడిషనల్, ఫార్మల్ దుస్తులపై భారీ డిస్కౌంట్లు అందిస్తోంది. కుటుంబం మొత్తం కోసం ఒక్క చోటే షాపింగ్ చేసుకునేలా ఈ ఆఫర్లు రూపొందించినట్లు తెలుస్తోంది. దుస్తులతో పాటు ఇతర గృహోపకరణాలు, డైలీ యూజ్ వస్తువులపై కూడా తగ్గింపులు అందుబాటులో ఉన్నాయి. మొత్తంగా చూస్తే, జనవరి 2026లో డిమార్ట్ ఆఫర్లు మధ్యతరగతి కుటుంబాలకు నిజంగా పెద్ద ఊరటనిచ్చేలా ఉన్నాయి.