Syria: సిరియాలో ఐసిస్‌పై అమెరికా మెరుపుదాడులు..! సిరియాలో ఐసిస్ స్థావరాలపై బాంబుల వర్షం! Boarder: వీసా, పాస్‌పోర్టు లేకుండానే భారత్‌లోకి..! చైనా మహిళ అరెస్ట్! Aerospace: ఏరోస్పేస్ హబ్‌గా భాగ్యనగరం…! హైదరాబాద్‌లోనే C-130J యుద్ధ విమానాల తయారీకి రంగం సిద్ధం! India Alert: చైనా–పాక్ వ్యూహాత్మక ముప్పు…! రెండు సరిహద్దుల నుంచి భారత్‌పై ఒత్తిడి! Cyber Crime: కంబోడియా నుంచి నడిచిన సైబర్ ముఠా గుట్టురట్టు…! ఏపీ సీఐడీ భారీ ఆపరేషన్! Fishing Shock: ఒడిశా–ఏపీ సరిహద్దులో భారీ చేప…! ధర వింటే షాక్! Violence Alert: బంగ్లాదేశ్‌లో భారత మిషన్‌పై దాడి…! భద్రతా ఏజెన్సీలు అలర్ట్! Gwadar Port: గ్వాదర్ పోర్టుపై సౌదీ కన్ను…! వాణిజ్యమా? సైనిక వ్యూహమా? Spy Bird: భారత నేవీ స్థావరం సమీపంలో చైనా ట్రాకర్…! భద్రతా ఏజెన్సీలు అలర్ట్..! India-Bangladesh: బంగ్లాదేశ్ నాయకుడి కీలక వ్యాఖ్యలు..! బంగ్లా హైకమిషనర్‌కు భారత్ సమన్లు..! Syria: సిరియాలో ఐసిస్‌పై అమెరికా మెరుపుదాడులు..! సిరియాలో ఐసిస్ స్థావరాలపై బాంబుల వర్షం! Boarder: వీసా, పాస్‌పోర్టు లేకుండానే భారత్‌లోకి..! చైనా మహిళ అరెస్ట్! Aerospace: ఏరోస్పేస్ హబ్‌గా భాగ్యనగరం…! హైదరాబాద్‌లోనే C-130J యుద్ధ విమానాల తయారీకి రంగం సిద్ధం! India Alert: చైనా–పాక్ వ్యూహాత్మక ముప్పు…! రెండు సరిహద్దుల నుంచి భారత్‌పై ఒత్తిడి! Cyber Crime: కంబోడియా నుంచి నడిచిన సైబర్ ముఠా గుట్టురట్టు…! ఏపీ సీఐడీ భారీ ఆపరేషన్! Fishing Shock: ఒడిశా–ఏపీ సరిహద్దులో భారీ చేప…! ధర వింటే షాక్! Violence Alert: బంగ్లాదేశ్‌లో భారత మిషన్‌పై దాడి…! భద్రతా ఏజెన్సీలు అలర్ట్! Gwadar Port: గ్వాదర్ పోర్టుపై సౌదీ కన్ను…! వాణిజ్యమా? సైనిక వ్యూహమా? Spy Bird: భారత నేవీ స్థావరం సమీపంలో చైనా ట్రాకర్…! భద్రతా ఏజెన్సీలు అలర్ట్..! India-Bangladesh: బంగ్లాదేశ్ నాయకుడి కీలక వ్యాఖ్యలు..! బంగ్లా హైకమిషనర్‌కు భారత్ సమన్లు..!

Syria: సిరియాలో ఐసిస్‌పై అమెరికా మెరుపుదాడులు..! సిరియాలో ఐసిస్ స్థావరాలపై బాంబుల వర్షం!

2026-01-11 09:04:00
Women Empowerment: కేంద్రం నుంచి మహిళలకు గుడ్ న్యూస్! ఒక్కొక్కరికి నెలకు రూ.7,000 స్టైఫండ్... దరఖాస్తు వివరాలు!

సిరియాలో మళ్లీ ఉగ్రవాద ఛాయలు కనిపించడంతో అమెరికా సైన్యం తీవ్రంగా స్పందించింది. ఇస్లామిక్ స్టేట్ (ఐసిస్) ఉగ్రవాదులను లక్ష్యంగా చేసుకుని అమెరికా శనివారం ఆకస్మిక గగనతల దాడులు నిర్వహించింది. ఈ దాడులు ‘ఆపరేషన్ హాకీ స్ట్రైక్’లో భాగమని అమెరికా సెంట్రల్ కమాండ్ అధికారికంగా ప్రకటించింది. సిరియాలోని పలు ప్రాంతాల్లో ఐసిస్ కార్యకలాపాలు మళ్లీ ఊపందుకుంటున్న నేపథ్యంలో, ఉగ్రవాద స్థావరాలను పూర్తిగా ధ్వంసం చేయాలనే ఉద్దేశంతో ఈ మెరుపు దాడులు చేపట్టినట్లు పెంటగాన్ వర్గాలు వెల్లడించాయి.

Cold wave alert: వచ్చే మూడు రోజులు జాగ్రత్త .. చలి తీవ్రతపై ఐఎండీ అలర్ట్‌!

ఈ దాడులకు ప్రధాన కారణం 2025 డిసెంబర్‌లో జరిగిన ఘోర ఘటన. పల్మైరా సమీపంలో ఐసిస్ ఉగ్రవాదులు చేసిన ఆకస్మిక దాడిలో ఇద్దరు అమెరికన్ సైనికులు, ఒక పౌర అనువాదకుడు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన అప్పట్లో అమెరికాలో తీవ్ర కలకలం రేపింది. తాజాగా ఈ ఘటనపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, “ఉగ్రవాదులకు తగిన బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైంది” అని హెచ్చరించారు. ఆయన ఆదేశాల మేరకే శనివారం మధ్యాహ్నం అమెరికా గగనతల దళాలు సిరియాలోని ఐసిస్ స్థావరాలపై బాంబుల వర్షం కురిపించాయి.

Sankranti Muggulu: టెక్నాలజీతో ట్రెండింగ్‌ ముగ్గులు.. ఈ సంక్రాంతికి ఇలా ట్రై చేయండి!

అయితే ఈ దాడుల్లో ఎంతమంది ఉగ్రవాదులు మృతి చెందారు? స్థావరాలకు ఎంత నష్టం జరిగింది? అనే విషయాలపై ఇప్పటివరకు స్పష్టమైన సమాచారం వెలువడలేదు. అమెరికా రక్షణ శాఖ పరిస్థితిని సమీక్షిస్తోందని, పూర్తి నివేదిక త్వరలో విడుదల చేస్తామని తెలిపింది. మరోవైపు, ఈ దాడులు సిరియాలో భద్రతా పరిస్థితిని మరింత సంక్లిష్టం చేసే అవకాశముందని అంతర్జాతీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే అమెరికా మాత్రం ఐసిస్‌ను పూర్తిగా తుదముట్టించడమే తమ లక్ష్యమని స్పష్టం చేస్తోంది.

Home Minister: ఎర్ర బస్సు రాని చోట ఎయిర్ బస్సు.. జగన్‌కు హోంమంత్రి మాస్ కౌంటర్!

13 ఏళ్ల సుదీర్ఘ అంతర్యుద్ధంతో కుదేలైన సిరియా రాజకీయంగా కీలక మలుపులో నిలిచింది. 2024 డిసెంబర్‌లో బషర్ అల్-అస్సాద్ పాలన కూలిపోయిన తర్వాత, అహ్మద్ అల్-షరా నేతృత్వంలో కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఒకప్పుడు అల్-ఖైదాతో సంబంధాలున్న ఈ బృందాలు ఇప్పుడు ఐసిస్ వ్యతిరేక పోరాటంలో అమెరికాతో చేతులు కలిపాయి. గత ఏడాది షరా వైట్ హౌస్‌ను సందర్శించి, ఐసిస్ వ్యతిరేక అంతర్జాతీయ కూటమిలో సిరియా భాగస్వామిగా చేరింది. ప్రస్తుతం సిరియాలో సుమారు 1000 మంది అమెరికా సైనికులు ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాల్లో నిమగ్నమై ఉన్నారు.

Nara Bhuvaneswari: నారా భువనేశ్వరికి ప్రతిష్ఠాత్మక పురస్కారం.. అవుట్‌స్టాండింగ్ డెయిరీ ప్రొఫెషనల్ అవార్డ్!
Grok AI: ఎలాన్ మస్క్‌కు గట్టి ఎదురుదెబ్బ.. గ్రోక్ ఏఐపై తాత్కాలిక నిషేధం విధించిన తొలి దేశం ఇదే..!!
MSVP bookings: డిజిటల్ మాఫియాపై వార్.. సినిమా రివ్యూ ఆప్షన్‌కు బ్రేక్.. MSVP బుకింగ్స్ స్టార్ట్.. ధరల వివాదం హాట్ టాపిక్!
ఓటీటీలోకి మోహన్‌లాల్ సూపర్ హిట్ మలయాళం యాక్షన్ కామెడీ మూవీ.. స్ట్రీమింగ్ డేట్ ఇదే.! ఎప్పుడు? ఎక్కడ?
సుజుకి నుంచి ఫస్ట్‌ ఎలక్ట్రిక్ స్కూటర్‌ వచ్చిందిరోయ్.. ఒక్క దెబ్బతో రోడ్లన్నీ షేక్ అవ్వాల్సిందే? ఫీచర్లు, ధర పూర్తి వివరాలు!
Heart Surgery: గుండె శస్త్రచికిత్సకు సరైన సమయం ఇదే! కొత్త అధ్యయనంలో కీలక విషయాలు!

Spotlight

Read More →