Free Bus: ఏపీలో ఉచిత బస్సు పథకం కీలక అప్డేట్! పెరిగిన రద్దీ... ఇక నుండి మరింత సౌకర్యంగా!

2025-12-30 08:58:00
AP Cabinet: ఏపీలో వారికి తీపికబురు.. వడ్డీ మాఫీ! కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఆంధ్రప్రదేశ్‌లో అమలవుతున్న స్త్రీశక్తి పథకం ద్వారా మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణిస్తున్నారు. ఈ నేపథ్యంలో గుర్తింపు కార్డు చూపించాలనే నిబంధనను తొలగించాలని ఎంప్లాయీస్ యూనియన్ (ఈయూ) డిమాండ్ చేసింది. ఇతర రాష్ట్రాలకు చెందిన మహిళలు ఈ పథకాన్ని పెద్దగా వినియోగించుకోవడం లేదని, అందువల్ల ఐడీ కార్డు అవసరం లేదని యూనియన్ నేతలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు వినతిపత్రం అందజేశారు.

Praja Vedika: నేడు (30/12) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

ఈయూ అధ్యక్షుడు పలిశెట్టి దామోదరరావు, ప్రధాన కార్యదర్శి జీవీ నరసయ్య మాట్లాడుతూ, గుర్తింపు కార్డు నిబంధన వల్ల కండక్టర్లపై అనవసర ఒత్తిడి పెరుగుతోందన్నారు. ఈ నిబంధన తొలగితే బస్సు ఎక్కే ప్రతి మహిళకు సులభంగా స్త్రీశక్తి పథకం టికెట్ ఇవ్వవచ్చని తెలిపారు. దీంతో ప్రయాణికులు, సిబ్బంది ఇద్దరికీ సౌకర్యంగా ఉంటుందన్నారు.

Cough Relief: శీతాకాలం దగ్గుతో ఇబ్బంది పడుతున్నారా... పడుకునే ముందు ఇలా చేస్తే సరి!

ఉచిత బస్సు పథకం అమలుతో ప్రయాణికుల రద్దీ గణనీయంగా పెరిగిందని ఈయూ పేర్కొంది. ఈ రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆర్టీసీ సొంతంగా 3,000 బస్సులు కొనుగోలు చేసి, సుమారు 10 వేల మందిని నియమించాలని ప్రభుత్వాన్ని కోరింది. అలాగే ప్రభుత్వ సహకారంతో విద్యుత్ బస్సులను కొనుగోలు చేసి నిర్వహించాలని విజ్ఞప్తి చేసింది. సంస్థలో పనిచేస్తున్న సుమారు 8 వేల మంది పొరుగుసేవల ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలని కూడా డిమాండ్ చేసింది.

APSRTC Promotions: ఏపీఎస్‌ఆర్టీసీ ప్రమోషన్లలో కీలక మార్పులు! ఆ ఉద్యోగులకు ఏకంగా 16 సెలవులు!!

ఇదే సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతిలో నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ (ఎన్‌ఎంయూఏ) నూతన సంవత్సర క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. ఏపీ జేఏసీ ఛైర్మన్ విద్యాసాగర్, ఎన్‌ఎంయూఏ రాష్ట్ర అధ్యక్షుడు వై. శ్రీనివాసరావు, ఉపాధ్యక్షుడు శ్రీనివాసరాజు పాల్గొన్నారు. వచ్చే ఏడాది స్వర్ణాంధ్ర సాధన కోసం ప్రభుత్వ ఉద్యోగులు మరింత ఉత్సాహంగా పనిచేయాలని సీఎం పిలుపునిచ్చారు.

Tollywood News: ముహూర్తం కుదిరింది.. విజయ్ దేవరకొండ - రష్మిక పెళ్లి తేదీ ఫిక్స్! వేదిక ఎక్కడో తెలుసా?

ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం ఎప్పుడూ ప్రాధాన్యత ఇస్తుందని సీఎం చంద్రబాబు భరోసా ఇచ్చారు. ఉద్యోగుల డిమాండ్లను దశలవారీగా పరిష్కరిస్తామని తెలిపారు. ఇదే సమయంలో పట్టణాల్లో మున్సిపల్ షేర్డ్ సర్వీస్ సెంటర్ల ఏర్పాటుకు 15వ ఆర్థిక సంఘం నిధుల నుంచి రూ.25 కోట్లను విడుదల చేసింది. ఈ కేంద్రాల ద్వారా ప్రజలకు ఒకే చోట ప్రభుత్వ సేవలు అందించి, మున్సిపల్ ఆదాయాన్ని పెంచడమే లక్ష్యమని ప్రభుత్వం స్పష్టం చేసింది.

ఏపీ ప్రజలకు అదిరిపోయే శుభవార్త.. ఆ జిల్లాకు ఆ పేరు ఎందుకు? ప్రతి జిల్లాకు ఒక 'పోర్టు' - మరికొన్ని కీలక ఆమోదాలు..
Praja Vedika: రేపు (30/12) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!
Drink milk: నిద్ర సమస్యలతో బాధపడేవారికి శుభవార్త.. రాత్రి పడుకునే ముందు పాలు తాగితే!
YouTuber Anvesh: యూట్యూబర్ అన్వేష్ అరెస్ట్ చేయాలి.. VHP డిమాండ్!
ఏపీ రేషన్ కార్డుదారులకు భారీ గుడ్ న్యూస్.. బియ్యంతో పాటు ఇక ఆ ఐదు రకాలు! ఒక్కొక్కరికి ఆరు కేజీలు..

Spotlight

Read More →