తేదీ 30-12-2025 న మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించబడనున్న "ప్రజా వేదిక" కార్యక్రమంలో పాల్గొననున్న ముఖ్య నాయకుల షెడ్యూల్
ప్రజా వేదిక షెడ్యూల్.
తేదీ: 30 డిసెంబర్ 2025 (మంగళవారం)
స్థలం: తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం, మంగళగిరి.
1. శ్రీ గొట్టిపాటి రవికుమార్ గారు (గౌరవనీయ మంత్రి).
2. శ్రీ కే.కే. చౌదరి గారు (ఆంధ్రప్రదేశ్ ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ బోర్డు చైర్మన్)
29-12-2025 (సోమవారం) మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన “ప్రజా వేదిక” కార్యక్రమం విజయవంతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొని ప్రజా సమస్యలపై చర్చించారు. ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి గుమ్మడి సంద్యారాణి ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరించారు. ఏపీ స్టేట్ అగ్రికల్చరల్ మిషన్ వైస్ చైర్మన్ మారెడ్డి శ్రీనివాసరెడ్డి రైతుల సమస్యలు, వ్యవసాయ అభివృద్ధిపై మాట్లాడారు. ప్రజల నుంచి వచ్చిన సూచనలను పరిష్కరిస్తామని నాయకత్వం హామీ ఇచ్చింది.