జకార్తాలో ఏడంతస్తుల భవనంలో అగ్ని ప్రమాదం! 20 మందికి పైగా మృతి!

2025-12-09 17:00:00
Chinese Embassy: చైనా వీసా విధానంలో కీలక మార్పులు.. ప్రపంచవ్యాప్తంగా - కొత్త నిబంధనలు, అవసరమైన పత్రాలపై!

ఇండోనేషియా రాజధాని జకార్తాలో మంగళవారం (డిసెంబర్ 9) ఓ ఏడంతస్తుల కార్యాలయ భవనంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. మధ్యాహ్నం సమయంలో ఒక్కసారిగా చెలరేగిన మంటలు క్షణాల్లోనే భవంతి అంతటా వ్యాపించాయి. ఈ ఘటనలో 20 మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు ధృవీకరించారు. ప్రమాద సమయంలో అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు వెంటనే చర్యలు తీసుకున్నప్పటికీ, మంటల తీవ్రత ఎక్కువగా ఉండడంతో భవనంలో చిక్కుకున్న వారిని కాపాడడం కష్టమైంది.

Rajinikanths: రజినీకాంత్ సర్ప్రైజ్.. నరసింహ సీక్వెల్ నీలాంబరి ప్రకటించిన సూపర్ స్టార్!

ప్రమాదంలో మరణించిన వారిలో 15 మందికి పైగా మహిళలు ఉన్నట్లు స్థానిక పోలీసులు వెల్లడించారు. మృతుల్లో ఒక గర్భిణి మహిళ కూడా ఉన్నట్లు చెప్పారు. మంటల కారణంగా ఏర్పడిన దట్టమైన పొగను పీల్చడం వల్ల చాలామంది ఊపిరాడక మృతి చెందినట్టు ప్రారంభ అంచనా. గాయపడిన కొందరిని చికిత్స కోసం సమీప ఆసుపత్రులకు తరలించారు. రక్షణ చర్యలు కొనసాగుతుండగా, ప్రభుత్వం బాధిత కుటుంబాలకు సానుభూతి తెలిపింది.

Russia Visa Rules: కొత్త వీసా విధానం ప్రకటించిన రష్యా! మూడేళ్ల శాశ్వత నివాసం ఇక సులభతరం!

ఈ ప్రమాదానికి కారణం భవనం మొదటి అంతస్తులో జరిగిన ఓ బ్యాటరీ పేలుడేనని పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో నిర్ధారించారు. పేలుడు ధాటికి మంటలు ఒక్కసారిగా పై అంతస్తులకు వ్యాపించాయి. భవనం లోపల ఉన్న ఉద్యోగులు బయటకు పరుగెత్తేందుకు అవకాశం లేకపోవడంతో మరణాల సంఖ్య పెరిగింది. అగ్నిమాపక సిబ్బంది మంటలను పూర్తిగా అదుపులోకి తెచ్చిన తర్వాతే శవాలను వెలికితీస్తున్నట్లు అధికారులు తెలిపారు.

IPL 2026 Auction: బిగ్ ట్విస్ట్.. ఐపీఎల్ 2026 మినీ వేలం.. ఫైనల్ లిస్ట్ ఖరారు!

ఈ కార్యాలయ భవనం ‘టెర్రా డ్రోన్ ఇండోనేషియా’కి చెందినదిగా గుర్తించారు. ఈ సంస్థ మైనింగ్, వ్యవసాయం వంటి రంగాల్లో ఉపయోగించే డ్రోన్ల తయారీ, సర్వే సేవలు అందిస్తోంది. గతంలో కూడా ఇండోనేషియాలో ఇలాంటి ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా 2023లో తూర్పు ఇండోనేషియాలోని నికెల్ ప్రాసెసింగ్ ప్లాంట్‌లో జరిగిన పేలుడు ప్రమాదంలో 12 మంది మృతి చెందగా, 39 మంది గాయపడిన సంఘటన ఇప్పటికీ గుర్తుంది.

ఏపీలో 8 కొత్త నగరాలు.. ఈ ప్రాంతాల్లోనే.. దశ తిరిగింది! లక్షల ఉద్యోగాలే లక్ష్యంగా - ప్రభుత్వం కీలక నిర్ణయం -

ప్రస్తుతం ఈ ఘటనపై పోలీసులు పూర్తి స్థాయి దర్యాప్తు చేస్తున్నారు. బ్యాటరీ పేలుడు ఎలా జరిగిందన్న దానిపై సాంకేతిక నిపుణులను కూడా తీసుకువచ్చి పరిశీలిస్తున్నారు. భవన నిర్మాణం, భద్రతా ప్రమాణాలు, అత్యవసర నిష్క్రమణ మార్గాలపై కూడా అధికారులు పరిశీలన ప్రారంభించారు. ఈ ఘటన మరోసారి ఇండోనేషియాలో భవన భద్రతా నిబంధనలపై ప్రశ్నలు లేవనెత్తింది.

రైతులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త.. వారికి ఉచితంగా పంపిణీ.. నాలుగు కేజీల వరకూ.!
పుదుచ్చేరిలో హై అలర్ట్.. విజయ్ బహిరంగ సభలోకి తుపాకీతో చొరబడేందుకు యత్నించిన వ్యక్తి అరెస్ట్!
UIDAI: ఆధార్ అప్‌డేట్ ఇక ఇంట్లోనే…! కొత్త యాప్‌తో ఫేస్ అథెంటికేషన్ సేవలు స్టార్ట్!
ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త... 8వ వేతన సంఘంపై కీలక ప్రకటన! సిఫార్సుల ఆమోదం తర్వాత..
Andhra Pradesh: రెవెన్యూ శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష… భూమి రికార్డుల అప్‌గ్రేడేషన్, గ్రీవెన్స్ పరిష్కారంపై దృష్టి!!

Spotlight

Read More →