కులం పేరుతో బ్లాక్ మెయిల్ చెయ్యాలని ycp కుట్ర! ఇక మీ ఆటలకు చెక్

ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఎన్నికలలోను కులం ప్రధాన పాత్ర పోషిస్తుంది. అయితే రాష్ట్రంలో కులం పునాదులపై ఏర్పడ్డ ఏ పార్టీ కూడా మనుగడ సాధించలేదు. కుల బలంతో కులాన్ని రెచ

Published : 2024-01-20 16:10:00

ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఎన్నికలలోను కులం ప్రధాన పాత్ర పోషిస్తుంది.

అయితే రాష్ట్రంలో కులం పునాదులపై ఏర్పడ్డ ఏ పార్టీ కూడా మనుగడ సాధించలేదు.

కుల బలంతో కులాన్ని రెచ్చగొట్టి పదవులు అనుభవించిన వారు కూడా రాజకీయంగా కాలగర్భంలో కలిసిపోయారని చెప్పవచ్చు.

రాజశేఖర్ రెడ్డి రాజకీయ ప్రవేశం రెడ్డి కాంగ్రెస్ పార్టీ ద్వారా జరిగింది.

అనతి కాలంలోనే రెడ్డి కాంగ్రెస్ ను ముసివేసి రాజకీయ భవిష్యత్తు కోసం రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో కలిసిపోయారు.

ప్రజారాజ్యం పార్టీ కూడా కాపులకు ముఖ్యమంత్రి నినాదంతో కాపుల బలంతోనే పార్టీ ప్రారంభించారు.

సింగపూర్ లో తెలుగు వారికి శుభవార్త! హైదరాబాద్ లో పెట్టుబడి అవకాశం మీ ముంగిట్లోకే! ఈ నెల 20 - 21 తేదీలలో! మరిన్ని వివరాల కోసం Click Here

ప్రజారాజ్యం పార్టీని కూడా ఎన్నికల అనంతరం కాంగ్రెస్ పార్టీలో విలయం చేశారు చిరంజీవి.

ఇక కులం బలం వాడుకుని రాజకీయ నాయకులుగా ఎదిగిన ఎంతో మంది నేతలు ఒకటి రెండు ఎన్నికలకు పరిమితమై ఆర్థికంగా బలపడ్డారు తప్ప కులానికి ఒరిగింది మాత్రం ఏమీ లేదు.

తెలుగుదేశం పార్టీలో సామాన్య కుటుంబం నుండి నాయకుడిగా ఎదిగిన ముద్రగడ పద్మనాభం కుల నాయకుడిగా ఎదిగారు.

కులాన్ని అడ్డుపెట్టుకొని రాజకీయ పార్టీలను బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించారు.

ముద్రగడ పద్మనాభం ఎత్తులను పసిగట్టిన పార్టీలు ముద్రగడను దూరంగా పెట్టాయి.

2019 ఎన్నికల ముందు జాతి ప్రయోజనాలు అంటూ ముద్రగడ పద్మనాభం సృష్టించిన హంగామా అంతా ఇంతా కాదు.

కాపుల భావోద్వేగాలను గుర్తించిన తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు ఓబీసీలకు ఇచ్చిన 10% రిజర్వేషన్లలో ఐదు శాతం కాపులకు కేటాయించారు.

ఇది కూడా చాలదన్నట్లుగా ముద్రగడ పద్మనాభం భారీ బహిరంగ సభ పెట్టి కాపులను రెచ్చగొట్టి రైళ్లను తగలబెట్టి విధ్వంసం సృష్టించారు.

వైసిపి పార్టీ అధినేత కాపుల అడ్డా అయిన జగ్గంపేటలోని ఐదు శాతం రిజర్వేషన్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించి బీసీల మద్దతు కూడగట్టుకున్నారు.

ఉన్న రిజర్వేషన్లను ఊడగొట్టిన ఆయన పై కుల నాయకుడిగా చెప్పుకుంటున్న ముద్రగడ పద్మనాభం ఒక్క మాట మాట్లాడిన దాఖలాలు లేవు.

సినీ గ్లామర్ తో రాజకీయ రంగ ప్రవేశం చేసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టార్గెట్ గా వైసీపీ అధినేత వ్యక్తిగత విమర్శలకు దిగిన కాపు నేతలుగా చలామణి అవుతున్న నాయకులు నోరెత్తలేదు.

వైసీపీలోని కాపు మంత్రులతో పవన్ కళ్యాణ్ పై వ్యక్తిగత దాడి చేయించింది ప్రభుత్వం.

పవన్ కళ్యాణ్ కాపు కులాన్ని నమ్ముకుని రాజకీయ పార్టీ పెట్టలేదని అన్ని కులాలు తమ పార్టీకి అండదండలు ఉంటాయని ప్రకటించారు.

ఈయన మాత్రం పవన్ కళ్యాణ్ ను కాపు నాయకుడిగా రాష్ట్రంలో చిత్రీకరిస్తూ ప్రచారం చేస్తున్నారు.

ఈయన పార్టీ కూడా వైయస్సార్సీపి అని పేరు పెట్టుకున్న అధికారం చేపట్టిన తర్వాత పూర్తిగా రెడ్ల పార్టీగా మారిపోయింది.

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్   Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

వైసీపీలో రెడ్లకు మాత్రమే ప్రాధాన్యత తప్ప ఇతరు ఏ కులాలకు ప్రాధాన్యత లేని విధంగా ఐదేళ్ల పాలన సాగింది.

రాజశేఖర్ రెడ్డి కొడుకుగా అభిమానించి రాష్ట్రంలో అన్ని కులాలు 2019 ఎన్నికలలో ఈయన్ని ఆదరించాయి.

అధికారం చేపట్టిన తర్వాత ఈయన స్వభావాన్ని గుర్తించిన ఇతర కులాలు పార్టీని వదిలి పారిపోతున్నాయి.

సెక్యులర్ పార్టీగా కాంగ్రెస్, తెలుగువారి ఆత్మగౌరవం నినాదంతో ఏర్పడిన పార్టీగా తెలుగుదేశం, హిందూ మతతత్వ పార్టీగా బిజెపి, కార్మిక కర్షకుల పేదల ప్రతినిధులుగా కమ్యూనిస్టు పార్టీలు ఉన్నాయి.

ఈ పార్టీలకు కులం ముద్రలు లేవు అందువల్లే సుదీర్ఘకాలం ప్రజల ఆదరాభిమానాలను పొందగలుగుతున్నాయి.

కుల పునాదులతో ఏర్పడిన పార్టీలు గాని వ్యక్తులు గాని ఒక్కసారి వారి కుట్టలయత్నాలను ప్రజలు గ్రహించలేకపోవచ్చు కానీ గ్రహించిన తర్వాత ఆ పార్టీలకు నాయకులకు సమాధి కడతారు.

ఇటువంటి పరిస్థితి రాష్ట్రంలో కోకొల్లలుగా చెప్పవచ్చు.

ప్రభుత్వం అంటే కులం మతం ప్రాంతం తారతమ్యం లేకుండా అభివృద్ధి పలాలు పంచినప్పుడే ప్రజల ఆశీస్సులు పొందగలరు.

ఈయన కులతత్వాన్ని గుర్తించిన రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డికి, కులతత్వంతో ఎన్నికలలో పోటీపడే నాయకులకు రాబోయే ఎన్నికలలో పతనం తప్పదు.

తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి  సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా  దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group

Spotlight

Read More →